"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇరటోస్తనీస్ జల్లెడ

From tewiki
Jump to navigation Jump to search
ఎరటోస్తనీస్ జల్లెడ పద్ధతి ఒక సంఖ్యలోపు గల మొత్తం ప్రధాన సంఖ్యలన్నింటినీ కనుగొనడానికి ఒక ప్రాచీన పద్ధతి, సులభమైన పద్ధతి. దీని తరువాత వచ్చిన అట్కిన్ జల్లెడ పద్ధతి దీని కన్నా వేగమైనది, క్లిష్టతరమైనది. ఎరటోస్తనీసు జల్లెడ క్రీపూ 3వ శతాబ్దానికి చెందిన ఎరటోస్తనీస్ అనే ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త చే రూపొందించబడింది

ఎరటోస్తనీస్ జల్లెడ అనేది గణిత శాస్త్రంలో ఒకటి నుంచి ఒక పరిధిలోపు ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఉపయోగించే ఒక సులభమైన, ప్రాచీనమైన పద్ధతి. దీన్ని ఏరటోస్తనీస్ అనే ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త రూపొందించాడు. ఆయన ఇవే కాక ఇంకా చాలా గణితావిష్కారాలను కావించాడు కానీ, అన్నీ అంతరించి పోయాయి. నికోమాకస్ అనే గణిత శాస్త్రవేత్త రచించిన ఇంట్రడక్షన్ టు అరిథ్‌మెటిక్ అనే పుస్తకంలో ఎరటోస్తనీస్ జల్లెడ గురించి వ్రాశాడు.

మూలాలు