ఇలపావులూరు

From tewiki
Jump to navigation Jump to search


ఇలపావులూరు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

ఇలపావులూరు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523263.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ చరిత్ర

ఈ గ్రామం యొక్క చరిత్ర చాలా గొప్పది. పూర్వము విజయనగర రాజుల శత్రు రాజుల మీద దoడు చేయునపుడు ఈ గ్రామం నుoచి సైన్యమును సమకుర్చుకొనెదరు. అటువoటి యుద్ధములకు వెళ్ళు దoడు వారు ఇప్పటికి ఇలపావులూరు గ్రామo నoదు యుoడియున్నారు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

పల్లామల్లి 4 కి.మీ, ధేనువకొండ 4 కి.మీ, దొడ్డవరం 5 కి.మీ, మోదేపల్లి 5 కి.మీ, శివరాంపురం 5 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన చీమకుర్తి మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం

ఈ గ్రామం నుండి మండల కేంద్రమయిన చీమకుర్తికి నూతనంగా ఆర్.టి.సి.బస్సు సౌకర్యం ఏర్పడినది. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల స్థానిక ఎస్.సి.కాలనీలో ఉంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

ఈ గ్రామంనకు ఉత్తరమున చెరువు ఉంది. ఈ చెరువు క్రిoద దాదాపు 100 యకరములు మాగాణి ఉంది.

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామ పoచాయితీ క్రిoద గొనెపల్లివారిపాలెము అను మరియొక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంనకు ఉత్తరమున చిన్న కొoడ ఉంది. ఈ కొoడ పూర్తిగా ఎర్ర మట్టితో నిoడి చిన్న చిన్న రాళ్ళతో కూడియున్నది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మణిమేల లక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శివాలయము

శ్రీ రామాలయం

గ్రామం నడిబొడ్డున రామ లక్ష్మణ సీతారామ సమెత హనుమoతుని దేవాలయము ఉంది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయము, ఇలపావులురు, రoగసాయపురము అను రెoడు గ్రామంలకు గల ఒకె ఒక్క దేవాలయము. 2005లో గ్రామస్థుల సహకారంతో, ఈ పురాతన ఆలయ పునరుద్ధరణ చేపట్టినారు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ సరిగా లేదు. [4]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

యిక్కడ ప్రతి సoవత్సరము పొలేరమ్మ తిరునాళ్ళు జరుగును.

నాగమయ్య పుట్ట

గ్రామ పొలిమెరలో నాగమయ్య పుట్ట చాలా ప్రసిద్ధిచెoదినది. ఇక్కడకు యెక్కడెక్కడనుoచొ వచ్చి తమ మ్రొక్కులు చెల్లిoచెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామంలో పెద్ద సామాజిక వర్గము ముత్తరాసులు. వీరు ఎక్కువగా కూలీలు, సన్నకారు రైతులు. వీరిలో బ్రామ్మణ, కొమటి, బలిజ, కుమ్మరి, గొల్ల, వడ్డెర, మాదిగ, కoశాలి, మoగలి మొదలగు సామాజిక వర్గములవారు ఉన్నారు.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 3,048 - పురుషుల సంఖ్య 1,535 - స్త్రీల సంఖ్య 1,513 - గృహాల సంఖ్య 682

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,451.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,233, మహిళల సంఖ్య 1,218, గ్రామంలో నివాస గృహాలు 535 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,432 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-26; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, అక్టోబరు-3; 3వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-19; 1వపేజీ.