ఈదుమూడి

From tewiki
Jump to navigation Jump to search


ఈదుమూడి
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()
దస్త్రం:Eedumudiwall.JPG
ఈదుమూడి గ్రామం.[1].

ఈదుమూడి, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 186., ఎస్.టి.డి.కోడ్ = 08592.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం ఉప్పుగుండూరుకు 5కిమీ వుంటుంది.

సమీప గ్రామాలు

దుద్దుకూరు 4 కి.మీ, రాచపూడి 5 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ, గొనసపూడి 6 కి.మీ. నూజెళ్లపల్లి 8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన ఇంకొల్లు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం, తూర్పున వేటపాలెం మండలం.

విద్యా సౌకర్యాలు

కె.కె.సి.ఉన్నత పాఠశాల

  1. 1988లో ఈ గ్రామానికి ఉన్నత పాఠశాల రావటంతో పిల్లలకు దుద్దుకూరు 2.8 కి.మీ నడచి వెళ్ళే శ్రమ తప్పింది.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న కొప్పా అనూషారాణి, "టెన్నిస్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మినీ జాతీయ టెన్నిస్, వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2015-16 పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొన్నది. ఆ పోటీలలో ఈ జట్టు రన్నర్-అప్ గా నిలిచింది. [6]

గ్రామంలో మౌలిక వసతులు

బ్యాంకులు

ఈ గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకును ఆధునీకరించి, 2014, జూలై-15వ తేదీనాడు పునఃప్రారంభించెదరు. [3]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కూనం సత్యవాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం శివాలయం

ఈ ఆలయం ధ్వజస్తంభం దెబ్బతినడంతో, గ్రామస్థులు ఆలయ జీర్ణోద్ధరణ పనులను, 2015, నవంబరు-30వ తేదీ సోమవారంనాడు ప్రారంభించారు. [5]

నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో 2017,జూన్-14వతేదీ బుధవారంనాడు, ముందుగా హోమాలు నిర్వహించి, అనంతరం, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి, గణపతి, నందీశ్వరుడు, కాలభైరవుడు, ఆదిత్యాది నవగ్రహాలు, జీవధ్వజ, కలశ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు పెద్దయెత్తున అన్నసమారాధన నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. [7]

గ్రామ విశేషాలు

  • హైదరాబాదులో స్థిరపడిన ఈ గ్రామ వాసులు, మొత్తం 70 కుటుంబాలవారు, 3-10-2013 నాడు కుకట్ పల్లిలో, ఉదయం 10 గం. నుండి 4 గం. వరకూ ఆత్మీయ సమావేశం జరుపుకుని సందడి చేశారు. పిల్లలూ, మహిళలకు పలు ఆసక్తికరమైన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి బహుమతి ప్రదానం చేశారు. గ్రామ విషయాలు మాట్లాడుకొని, గ్రామంలోని తమ బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు-2న ఈదుమూడి ఆత్మీయ సమావేశం, హైదరాబాదులో జరుగును. [2]

మాదిగ దండోరా ఉద్యమం

ఈదుమూడి గ్రామంలో 1994 జులై 7న ఎమ్మార్పీఎస్‌ (మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి) ఆవిర్భవించింది.అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీలను ఎబిసిడి లుగా వర్గీకరిస్తూ జీవో జారీ చేసింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కోర్టుకు ఎక్కడంతో వర్గీకరణ అమలుకాకుండా నిలపివేశారు. రిజర్వేషన్లు వర్గీకరించడం పార్లమెంటు ద్వారా జరగాలని రాష్ట్రాలకు విభజించే హక్కులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వర్గీకరణ నిలిచిపోయింది. దండోర ఉద్యమం తరువాత ఆత్మ గౌరపోరాట ఉద్యమంగా మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందింది.

గణాంకాలు

  • ఈ గ్రామ జనాభాలో కమ్మ, కురుమ, మాదిగ, కుమ్మరి, చాకలి, మంగలి కులస్తులు ఎక్కువగా ఉన్నారు.
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,824.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,378, మహిళల సంఖ్య 1,446, గ్రామంలో నివాస గృహాలు 761 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 613 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 2,748 - పురుషుల సంఖ్య 1,370 - స్త్రీల సంఖ్య 1,378 - గృహాల సంఖ్య 793

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూలై-15, 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-21; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-15; 2వపేజీ.