ఈమని రామకృష్ణ ఘనపాఠి

From tewiki
Jump to navigation Jump to search

ఈవని రామకృష్ణ ఘనాపాఠీ (1928-13 అక్టోబరు 2003) వేదవిద్యల్లో ప్రవీణునిగా ప్రఖ్యాతులు. ఘన, జట వంటి పాఠాలతో కృష్ణయజుర్వేదం, శ్రౌతం, స్మార్తం, పంచకావ్యాలు వంటి విద్యలు పూర్తిగా అభ్యసించి పాండిత్యం, శాస్త్రార్థం సంపాదించారు.

జీవిత విశేషాలు

ఈవని రామకృష్ణ 1928 సంవత్సరంలో ఆషాఢ బహుళ తదియ నాడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సమీపంలోని కట్టుంగ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణావధాన్లు, శేషమ్మ. వారి పూర్వీకులది కానూరు అగ్రహారం. వారు కొత్తపేటలో నివాసం ఏర్పరుచుకున్నారు.[1]

మూలాలు

  1. ఈవని, శేషాద్రి శర్మ (డిసెంబర్ 2011). వల్లూరి, విజయ హనుమంతరావు (ed.). "`వేదసార్వభౌమ' శ్రీ రామకృష్ణ ఘనాపాఠీ". సుపథ. విశాఖపట్టణం. 12 (1): 34–36. Check date values in: |date= (help)