"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉక్కుపిడుగు

From tewiki
Jump to navigation Jump to search
ఉక్కుపిడుగు
(1969 తెలుగు సినిమా)
150px
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
సంగీతం కోదండపాణి
నిర్మాణ సంస్థ నవభారత్ కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు

 • కాంతారావు
 • రాజశ్రీ
 • రాజబాబు
 • శ్రీరంజని
 • ప్రభాకరరెడ్డి
 • సత్యనారాయణ
 • విజయలలిత
 • రాజనాల
 • ధూళిపాల
 • విజయశ్రీ
 • మోదుకూరి సత్యం
 • మీనాకుమారి
 • కాశీనాథ్ తాతా
 • పి.జె.శర్మ
 • కొండా శేషగిరిరావు
 • చలపతిరావు

సాంకేతికవర్గం

 • కథ: మహతి
 • మాటలు, పాటలు: వీటూరి
 • కళ: గోడ్‌గాంకర్
 • కూర్పు: కె బాలు
 • ఛాయగ్రహణం: ఆర్ మధు
 • స్టంట్స్: మాధవన్
 • సంగీతం: కోదండపాణి
 • నృత్యం: కెఎస్ రెడ్డి
 • నిర్మాతలు: పియస్ ప్రకాశరావు, ఆర్ సుధాకర్‌రెడ్డి
 • దర్శకత్వం: జి విశ్వనాథం

కథ

కళింగ సామ్రాజ్య ప్రభువుకు ఇద్దరు కుమారులు. వారి జన్మదినోత్సవ వేడుకలు సాగుతుండగా, సామంతరాజు భుజంగవర్మ (ప్రభాకర్‌రెడ్డి) రాజ్యంపై దండెత్తుతాడు. ప్రభువును అంతంచేసి రాజ్యం ఆక్రమిస్తాడు. మహారాణి, ఇద్దరు రాకుమారులను రహస్యమార్గంలో తప్పించిన మహామంత్రి, వాళ్లను కాపాడతాడు. మహారాణి శాంతిమతీదేవి (జూ.శ్రీరంజని) పెద్దకుమారుడు వసంతుని ఓ సాధువు (ధూళిపాళ) రక్షిస్తాడు. అలా వసంతుని సకల విద్యాప్రావీణ్యుని చేస్తాడు. మహామంత్రి (కాశీనాథ్ తాతా) చిన్న కుమారుడు మార్తాండవర్మకు యుద్ధ విద్యలలో ప్రావీణ్యత కలిగిస్తాడు. భుజంగవర్మకు ఓ ఆడ శిశువు జన్మించగా, ఆమె భర్త చేతిలో తనకు మరణం ఉందని తెలిసి, ఆమెను ఒంటరిగా ప్రత్యేక మందిరంలో పెంచుతాడు. జ్వాలాభైరవుడు అనే (రాజనాల) మాంత్రికుడు అష్టసిద్దుల కోసం దేవిని ప్రార్థిస్తాడు. తల్లిపాలు ఎరగని తరుణిని బలిగా ఇవ్వాలన్న దేవి ఆదేశంతో, ఆమెను సాధించేందుకు తగిన వ్యక్తిగా వసంతుని (కాంతారావు) ఉపయోగించాలని ప్రయత్నాలు చేస్తాడు. అతని ద్వారా రాకుమారుని, నాగలోకపు యువరాణి సర్పకేశిని (విజయశ్రీ) తనవద్దకు తెప్పించుకుంటాడు. మార్తాండవర్మ, భుజంగవర్మ వద్ద సేనానిగా కొలువు సంపాదిస్తాడు. పరిస్థితుల కారణంగా మహారాణిని, తన ప్రియురాలు మల్లి (విజయలలిత)ని కోట చెరలో బంధిస్తాడు. సాధనతో మహాఖడ్గం సాధించి, మాంత్రికుని కుట్రచే దాన్ని పొగొట్టుకున్న వసంతుడు, సర్పకేశినివల్ల దాన్ని పొంది మాంత్రికుని అంతం చేస్తాడు. రాకుమారి పద్మావతి (రాజశ్రీ)తో పాటు రాజ్యానికి వచ్చి, నిజం వెల్లడించి భుజంగవర్మను సంహరిస్తాడు. తన సోదరుడు, తల్లి.. అందరితో కలిసి కళింగ సింహాసనం అధిష్టించటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు

 1. ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి - రచన వీటూరి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 2. ఓ లోకాలేలే చల్లని తల్లి శరణము నీవే కల్పకవల్లి - పి.సుశీల, ఎస్. జానకి
 3. జయహో జయహో వీరకుమారా - ఎస్. జానకి, బి.వసంత
 4. పళ్ళో బాబు పళ్ళు పసందైన పళ్ళు గున్నమామిడి పళ్ళు - ఎల్. ఆర్. ఈశ్వరి
 5. సై అంటె సై అంటాను అంశుకాడా నీవెంట నేనుంటాను - ఎస్.జానకి బృందం
 6. ఓహోహో కమ్మని కలలా కనిపించాడే - రచన వీటూరి - పి సుశీల (సోలో)

మూలాలు

 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (27 July 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 ఉక్కుపిడుగు". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 3 August 2019. Retrieved 9 June 2020.

బయటిలింకులు