ఉజ్జిని నారాయణరావు

From tewiki
Jump to navigation Jump to search

ఉజ్జిని నారాయణరావు సీపీఐ సీనియర్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[1]

జీవిత విశేషాలు

రాజకీయ జీవితం

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి 1985-99 కాలంలో సీపీఐ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.[2][3][4]

రైతు బాంధవుడు

దేవరకొండ తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారాయణరావు తన జీవితానంతా రైతాంగ ఉద్యమాలకే ధారబోశారు. రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భూస్వాముల చెరల్లో ఉన్న భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాగునీటి భూములపై అప్పటి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల బకాయిలు, నీటి తీరువా వసూళ్లను రద్దు చేయించడంలో అలుపెరుగని పోరాటం చేశారు. రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి రైతు బంధువుగా పేరు సంపాదించారు. ప్రస్తుతం నారాయణరావు దేవాదాయ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.[5]

మరణం

ఆయన తన 90వ యేట ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు నివాసంలో జూలై 13 2016 న కన్నుమూసాడు.[6]

మూలాలు

ఇతర లింకులు