ఉత్తరాయణం

From tewiki
Jump to navigation Jump to search

ఆయనం అనగా పయనించడం అని అర్ధం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకి పయనిస్తున్నంతకాలం దేవతలకి రాత్రి గాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏవిధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనంలో మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికి ఈ విషయం తెలియజేయడం కోసం పెద్దలు పండుగలను జరపడం మొదలు పెట్టారు. ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయిందని ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామి వారి దీవెనలను అందుకుంటారు. అలాగే వైకుంఠంలో ముక్కోటి ఏకాదశి రోజున ద్వారాలు తెరిచి ఉంటాయని అన్ని విష్ణు దేవాలయాలలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

తెలుగు మాసములు

చైత్ర మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
భాద్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు

పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు