"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఉన్నత విద్య
ఉన్నత విద్య, పాఠశాల విద్య (సెకండరీ) తరువాత ప్రారంభమయ్యే విద్య. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య (సీనియర్ సెకండరీ), 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీలో మొదటి స్థాయి విద్యని పట్టభద్ర విద్య (గ్రాడ్యుయేషన్) అని, దాని తరువాత స్థాయి పట్టభద్ర తరువాత స్థాయి (పోస్ట్ గ్రాడ్యుయేట్) అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధన స్థాయి విద్య (రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్., పి.హెచ్.డీ. పట్టాలు) ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.
ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, విద్య, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, భాషా శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్, ఇతర రంగాలు. ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నత విద్యా పరిషత్ సమన్వయం చేస్తుంది.
Contents
కళాశాల విద్య
ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సుల గల కళాశాలను కళాశాల విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది.[1] రాష్ట్రంలో 249 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలలో 3, 64, 726 మంది విద్యార్థులు చదువుతున్నారు.[2] ఉద్యోగావకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిలో కొన్ని జీవసాంకేతిక శాస్త్రం (బయో టెక్నాలజీ), మైక్రో బయాలజి, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఎడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్ లాంటివి ఉన్నాయి.. జెకెసిలు 29 ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాయి. 130 ప్రభుత్వ కళాశాలలు నాక్ అక్రిడిటేషన్ పొందాయి. వీటిలో 120 బి ఆ పై స్థాయి పొందాయి. ఇంగ్లీషు భాష నైపుణ్యాన్ని పెంచడానికి 75 ఇంగ్లీషు భాషా ప్రయోగశాల (ఇంగ్లీషు లాంగ్వేజ్ లాబ్స్) ఏర్పాటు చేశారు. చాలా విషయాలు సాంప్రదాయ శాఖల (ఆర్ట్స్, సామాజిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం) ద్వారా మాత్రమే చదవడానికి వీలుండగా, కంప్యూటర్ అనువర్తనాలు లాంటి అధునిక విషయాలు, శాఖలలో కొన్ని విషయాలు అందరికి ఐచ్ఛికంగా చదివే అవకాశం సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో లేక దూర విద్యా విధానంద్వారా చదివే వారికి వుంటుంది.
ఆర్ట్స్
సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలోని ముఖ్యంశాలు. ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, ప్రజా పరిపాలన, సామాజిక శాస్త్రము, మానసిక శాస్త్రము, భాషలు (తెలుగు సాహిత్యము, ఇంగ్లీషు సాహిత్యము, హిందీసాహిత్యము, ఉర్దూ సాహిత్యము) .
కామర్స్
సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలో ముఖ్యాంశాలు వ్యాపార నిర్వహణ, గణాంకాలు గురించి వుంటాయి.
సైన్స్
సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలో ముఖ్యాంశాలు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జీవ శాస్త్రం, జంతు శాస్త్రం.
వృత్తివిద్య
ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్య మండలి[3] వృతి విద్యలను పర్యవేక్షిస్తుంది. సాంకేతిక విద్య శాఖ [4] ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక విద్యని పర్యవేక్షిస్తుంది. సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 ప్రకారం వివరాలు.[2]
వివరము | కళాశాలల సంఖ్య | ప్రవేశానికి సీట్లు |
---|---|---|
ఇంజినీరింగ్ | 665 | 226870 |
ఎం.బి.బి.ఎస్. | 23 | 4250 |
ఎమ్సిఎ | 703 | 47595 |
పాలిటెక్నిక్ | 144 | 63075 |
ఎమ్బిఎ | 881 | 59676 |
బి ఫార్మసీ | 213 | 16675 |
బి.ఇడి[5] | 607 | * |
2008 లో విద్యార్థుల సీట్ల వివరాలు [5]
ఇంజినీరింగ్ : 1, 74, 352
ఉన్నత, సాంకేతిక విద్య మొత్తం: 15, 00, 000
స్థూల నమోదు నిష్పత్తి
స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrollment Ratio) ఆనగా, 18-23 సంవత్సరాల వయస్సుగల యువతలో ఉన్నత విద్య ఆభ్యసిస్తున్న వారి శాతం. ఇది 2005 లో దేశంలో 11శాతంగా, ఆంధ్ర ప్రదేశ్ లో 12.9 శాతంగా నమోదయింది. ఇది 2012 నాటికి దేశంలో 15 శాతంగా పెంచటం 11 వ ఆర్థిక ప్రణాళిక ఉద్దేశం. ఆప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 19.2 శాతంకి పెరుగుతుందని అంచనా. [6]. 2001-02 లో ప్రపంచ సగటు స్థూల నమోదు నిష్పత్తి 23.2 శాతంగాను, ఆభివృద్ధి చెందిన దేశాలలో 54.6 గావుంది.
వనరులు
- ↑ "కళాశాల విద్యాశాఖ వెబ్ సైటు". Archived from the original on 2010-02-08. Retrieved 2010-05-29.
- ↑ 2.0 2.1 సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 - సంకలనం రఘురామ్
- ↑ "ఉన్నత విద్య మండలి". Archived from the original on 2010-06-19. Retrieved 2010-09-22.
- ↑ "సాంకేతిక విద్యా శాఖ వెబ్సైటు". Archived from the original on 2011-09-02. Retrieved 2012-02-17.
- ↑ 5.0 5.1 "విద్యాభివృద్ధికి కృషి చేశాం", వార్త, 27 మార్చి, 2009 లో రోశయ్య వ్యాఖ్యలపై సమాచారం
- ↑ "12. Report of the HIGHER EDUCATION IN INDIA Issues Related to Expansion, Inclusiveness, Quality and Finance". Archived from the original on 2010-08-22. Retrieved 2010-05-29.