"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉపద్రష్ట సునీత

From tewiki
Jump to navigation Jump to search
సునీత ఉపద్రష్ట
200px
సునీత
జననం
ఉపద్రష్ట సునీత

(1978-05-10) మే 10, 1978 (వయస్సు 43)
వృత్తిగాయని, డబ్బింగ్ కళాకారిణి
జీవిత భాగస్వాములుకిరణ్
పిల్లలు2; ఆకాష్, శ్రేయ
తల్లిదండ్రులు
 • ఉపద్రష్ట నరసింహారావు (తండ్రి)
 • సుమతి (తల్లి)
వెబ్‌సైటుhttp://www.singersunitha.com

సునీత ఉపద్రష్ట నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా పేరు తెచ్చిన చిత్రాలు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేకమంది తెలుగు కథానాయికలకు గాత్రదానం చేసింది. ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.[1]

జీవిత విశేషాలు

సునీత ఉపద్రష్ట నరసింహారావు, సుమతి దంపతులకు గుంటూరులో జన్మించింది. ఈమె మేనత్త, చిన్నమ్మ సంగీత పాఠాలు చెప్పేవారు. సంగీతం వీరి కుటుంబాలలో కొన్ని తరాలుగా వస్తోంది.

విద్యాభ్యాసం

ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరు లోను, మరికొంత కాలం విజయవాడలోను జరిగింది. చిన్ననాటి నుండే సంగీతం మీద అనురక్తితో విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోను [2], కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందింది. గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేది.

ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట ప్రజలకు బాగా చేరువయ్యింది. తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.[3]

వివాహం

ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. పిల్లలిద్దరూ కూడా పాటలు పాడగలరు. ఈమెకు రెండో వివాహం కొరకు నిశ్చితార్థం 7/12/2020లో వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్‌ హెడ్‌ రామ్‌ వీరపనేనినితో జరిగింది.

డబ్బింగ్ కళాకారిణి

ఉపద్రష్ట సునీత తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బెంద్రే, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైన వారికి గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చింది.

డబ్బింగ్ కళాకారిణిగా ప్రఖ్యాతి పొందిన సినిమాలు

కొన్ని సినిమా పాటలు

అవార్డులు

జాతీయ అవార్డులు

 • విద్యార్థినిగా, ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు అందుకొంది, ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
 • 1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.

నంది పురస్కారాలు

ఫిలింఫేర్ అవార్డులు

 • సినిమా పాట కోసం Cheluveye నిన్నే Nodalu "ఓ Priyathama" కన్నడలో (2010) - ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు
 • సినిమా పాట "ఎం సందేహం లేదు " కోసం ఊహలు  గుసగుసలాడే  కోసం తెలుగు (2014) - ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు

ఇతర అవార్డులు

 • 1999 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 1999 సం.లో వంశీ బర్కిలీ అవార్డు.
 • 2000 : భరత ముని అవార్డు. (2000 సం.లో)
 • 2000 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 2000 సం.లో వార్త వాసవి అవార్డు.

ప్రదర్శనలు

 • 3 సం.ల వయస్సులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చింది.
 • 16 సంవత్సరాల వయస్సులో 1995లో ఆల్ ఇండియా రేడియో (AIR) లలిత (లైట్) సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది.
 • ఇప్పటివరకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
 • స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్, కెన్యా లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
 • సౌత్ ఆఫ్రికాలో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు నిర్వహించింది.
 • దాదాపు 750 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పింది.
 • డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె సూపర్ సింగర్స్ 7 అనే తెలుగు టివి సీరియల్ కార్యక్రమ షో టైటిల్‌ను గెలుచుకుంది.
 • తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతిలో జరుగు బ్రహ్మోత్సవాల సమయములలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.
 • ప్రభుత్వము వారు నిర్వహించే వివిధ కార్యక్రమములు అయిన, 200 సంవత్సరాల సికింద్రాబాదు లాంటి అనేక వేడుకల్లో పాల్గొన్నారు.
 • అసెంబ్లీలో భారతదేశము స్వాతంత్ర్యం సాధించి 50 సంవత్సరాల సందర్భ వేడుకలు నిర్వహించింది.
 • భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భ సందర్భంగా, ఆమె కాంగ్రెస్ ప్లీనరీ మీట్ వద్ద గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాటు వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

టెలివిజన్ కార్యక్రమములు

 • ఉపద్రష్ట సునీత జెమిని టివి, మా టివి, ఈ టివి, దూరదర్శన్ వంటి పలు సంస్థలలో, అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించింది.
 • ఆమె జెమిని టివిలో నవరాగం, ఈ టివిలో ఝుమ్మంది నాదం, సప్తస్వరాలు, పాడుతా తీయగా, అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమములకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది.
 • మా టివి నిర్వహించిన సూపర్ సింగర్ ప్రదర్శన యొక్క ఒక భాగం అయిన 4వ సిరీస్ కార్యక్రమమునకు ఆమె ఒక న్యాయమూర్తి, గురువుగాను వ్యవహరించింది.

మూలాలు

 1. Chinduri, Mridula (2 October 2005). "Sunitha, the heroine of voice". Times of India. Retrieved 30 December 2010.
 2. [1]
 3. http://www.idlebrain.com/news/2000march20/chitchat-sunitha-filmfare.html
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-09. Retrieved 2011-12-14.

బయటి లింకులు

మూసలు , వర్గాలు