"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉప్పుమాగులూరు

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

ఉప్పుమాగులూరు, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 301., ఎస్.టి.డి.కోడ్ = 08404.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

కొప్పెరపాలెం 5 కి.మీ, చవటపాలెం 5 కి.మీ, వేమవరం 6 కి.మీ, బల్లికురవ 6 కి.మీ, తంగెడుమల్లి 6 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన మార్టూరు మండలం, పశ్చిమాన సంతమాగులూరు మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, తూర్పున యద్దనపూడి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ పాఠశాల ఆవరణలో 2017,జూన్-1న నందమూరి తారకరామారావు కళావేదిక నిర్మాణానికై భూమిపూజ నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ చిట్టిపోతు మస్తానయ్య, శ్రీ కక్కెర వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో ఈ కళావేదిక నిర్మించనున్నారు. [4]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది. [3]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్నేని అంజనాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,479 - పురుషుల సంఖ్య 2,294 - స్త్రీల సంఖ్య 2,185 - గృహాల సంఖ్య 1,160; 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,431. ఇందులో పురుషుల సంఖ్య 2,276, మహిళల సంఖ్య 2,155, గ్రామంలో నివాస గృహాలు 1,150 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,438 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,ఆగస్టు-8; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-4; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-2; 1వపేజీ.