"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉమ్మెత్త

From tewiki
Jump to navigation Jump to search

ఉమ్మెత్త
DaturaStramonium-plant-sm.jpg
Datura stramonium
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
దతుర

జాతులు
See text below

మూస:Taxonbar/candidate

ఉమ్మెత్త (ఆంగ్లం Datura) సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు నాలుగవది.

దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొద లాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దినిని మొట్టమొదటచ లిన్నియస్ కనుగొన్నారు. ఈ మొక్క మూడు అడుగులు పెరిగే వార్షిక హెర్బ్.వీటి కాండాలు వంకాయి రంగులో వుండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి.పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్ తెలుపు పసుపు, ఎరుపు,, వైలెట్ మొదలుకుని ఉంటాయి. దత్తురా ఫాస్టుయొసాని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు, వృత్తాకారంలో ఉంటాయి.బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి. వీటి మొక్కలు పెద్ద, నిటారుగా, బలిసిన హెర్బ్, ఈ మొక్కలకు బ్రాంచ్డ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి వుంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి.

దత్తూర పత్రి

భౌతిక లక్షణాలు

ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. దీని పుష్పాలు తెల్లగా, ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి.

శాస్త్రీయ నామం

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Datura metal (Family:Solanaceae).

ఉపయోగాలు

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు

  • వ్యాధిగ్రస్తునికి శిరోముం డనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు నెల లపాటు రోజూ మర్ధన చేస్తే వ్యాధి తగ్గుతుంది.
  • ఆస్తమాను తగ్గిస్తుంది
  • ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
  • మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భు తంగా పనిచేస్తుంది.

హిందువులు

  • వినాయక చవితి రోజు ఉమ్మెత్తను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
  • ఉమ్మెత్తలో చాల రకాలున్నాయి. తెల్ల ఉమ్మెత్త/ నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెత్తలు విషపూరితాలె. చాల దుర్వాసన కలిగి వుంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం వుండి కాయ చుట్టు దట్టమైన ముళ్ళు కలిగి వుంటుంది. ఈ కాయలను కొన్ని ఔషదాలలో వుపయోగిస్తారు.

ఇతర విశేషాలు

నల్ల ఉమ్మెత్త చెట్టు. వనస్థలిపురములో తీసినది.
నల్ల ఉమ్మెత్త కాయ

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.

  • ఉమ్మెత్తలో రెండు రకాలు గలవు. 1. తెల్ల ఉమ్మెత్త, 2. నల్ల ఉమ్మెత్త. నల్ల ఉమ్మెత్త వైద్యములో ఎక్కువగా ఉపయోగిస్తారు.

మూలాలు

వనరులు

చిత్రమాలిక

వెలుపలి లింకులు