"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉల్క

From tewiki
Jump to navigation Jump to search
రాత్రివేళ ఉల్కాపాత చిత్రం.
పాలపుంతలో ఒక ఉల్క.

ఉల్క (ఆంగ్లం Meteoroid లేదా Meteor), సౌరమండలములో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.

1100 ఉల్కలు

గత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ ఆస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం రాయిని పోలి క్రికెట్‌ బాల్‌ పరిమాణంలో అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు