ఊరు

From tewiki
Jump to navigation Jump to search

ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు. తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అనే అంటారు.

  • తక్కువ జనావాసాలు ఉన్న ఊరును "గ్రామం" అంటారు. గ్రామాన్ని ఆంగ్లంలో విలేజ్ అంటారు.
  • మధ్యస్థంగా జనావాసాలు ఉన్న ఊరును "పట్టణం" అంటారు. పట్టణాన్ని ఆంగ్లంలో టౌన్ అంటారు.
  • ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "నగరం" అంటారు. నగరాన్ని ఆంగ్లంలో సిటీ అంటారు.
  • మరీ ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "మహానగరం" అంటారు. మహానగరాన్ని గ్రేట్ సిటీ అంటారు.

రెండు ఊర్లు ఉదాహరణకు రెండు నగరాలు కలిసిపోయినప్పుడు వాటిని జంటనగరాలు అంటారు, జంటనగరాలకు ఉదాహరణగా హైదరాబాదు, సికింద్రాబాద్‌లను చెప్పవచ్చు.

కొన్ని చిన్న ఊర్లను (చిన్న గ్రామాలను) కలిపి పంచాయితి అంటారు, పెద్ద గ్రామాలను మేజర్ పంచాయితిలు అంటారు. కొన్ని పంచాయితిలను కలిపి మండలంగాను, కొన్ని మండలాలను కలిపి డివిజన్ గాను, కొన్ని డివిజన్లను కలిపి జిల్లా అంటారు.

ఇతర అర్థాలు

ఊరు అంటే ఊట ఊరుట అనే అర్థం వచ్చే చోట ఉపయోగిస్తారు.

నోరూరు అనగా నోటిలో లాలాజలం ఊరుట అని అర్థం.

ఊరు పేరు తెలియని వ్యక్తిని అన్యుడు అంటారు.

సామెతలు

ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.

ఇవి కూడా చూడండి

గ్రామం

నిర్జన గ్రామం

నగరం

బయటి లింకులు