"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఊర్వశి

From tewiki
Jump to navigation Jump to search
ఊర్వశి పురూరవులు: రాజా రవి వర్మ చిత్రం.

ఊర్వశి ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు.పుర్వం విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి రంభను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.

ఒక యప్సరస. నరనారాయణులు బదరికాశ్రమమున తపము ఆచరించునపుడు దేవతాస్త్రీలు వారి తపోభంగము చేయ అచటికి రాఁగా ఆమహామునులు చలింపని వారైరి. అందు నారాయణుఁడు తమ నిశ్చలత్వమును ఆనారీమణులకు తెలుపువాఁడై తన యూరువు గీఱఁగా అందుండి రూపవతులగు ఊర్వసి మొదలగువారు అనేకులు పుట్టిరి. అప్పుడు దేవతాస్త్రీలు తమయత్నము జరగనేరదని తలఁచి ఊర్వసిని తమకు ముఖ్యురాలినిగాఁ జేసికొని తమ లోకమునకు పోయిరి అని భాగవతమునందు చెప్పబడి యున్నది.

మఱియు అర్జునుడు, శివుడు మొదలగు దేవతలవలన పాశుపతము మొదలయిన దివ్యాస్త్రములను పడసి దేవతలకు బాధకులుగా ఉండిన కాలకేయ నివాతకవచులను వధించుటకై దేవలోకమునకు పోయి ఉండు తఱిని ఊర్వసి ఇతని సంగమమును కోరె. అందులకు ఇతఁడు ఇయ్యకొననందున ఇతనికి నపుంసకత్వము కలుగునట్లు శపియించెను. అంత అది ఇంద్రుఁడు ఎఱిఁగి ఆశాపమును అర్జునుఁడు అజ్ఞాతవాసకాలమున అనుభవించునట్లును తదంతంబున శాపమోక్షము అగునట్లును అనుగ్రహించెను.

మూలం

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

వెలుపలి లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).