"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఋతువులు (భారతీయ కాలం)

From tewiki
(Redirected from ఋతువులు)
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సంవత్సరానికి ఆరు ఋతువులు: అవి

  1. వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి
  2. గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి
  3. వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.
  4. శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.
  5. హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది
  6. శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.

ఋతువుల పట్టిక

ఈ క్రింది పట్టిక భారతదేశంలోని ఋతువులు,అవి ఏ మాసంలో వస్తాయో, వాటి లక్షణాలను తెలియజేస్తుంది.

వసుస సంఖ్య ఋతువు కాలాలు హిందూ చంద్రమాన మాసాలు ఆంగ్ల నెలలు లక్షణాలు ఋతువులో వచ్చే పండగలు
1 వసంతఋతువు Spring చైత్రం, వైశాఖం ~ మార్చి 20నుండి మే 20 సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి
2 గ్రీష్మఋతువు Summer జ్యేష్టం, ఆషాఢం ~ మే 20 నుండి జూలై 20 బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ
3 వర్షఋతువు Monsoon శ్రావణం, భాద్రపదం ~ జూలై 20 నుండి సెప్టెంబరు 20 చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ಓಣಂ
4 శరదృతువు Autumn ఆశ్వయుజం, కార్తీకం ~ సెప్టెంబరు 20 నుండి నవంబరు 20 తక్కువ ఉష్ణోగ్రత నవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి,
5 హేమంతఋతువు Winter మార్గశిరం, పుష్యం ~ నవంబరు 20 నుండి జనవరి 20 చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ
6 శిశిరఋతువు Winter & Fall మాఘం, ఫాల్గుణం ~ జనవరి 20 నుండి మార్చి 20 బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ

మూలాలు

వెలుపలి లంకెలు