"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎండమావి

From tewiki
Jump to navigation Jump to search

ఎండమావి (బహువచనం: ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.

ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం.

కారణాలు

వక్రీభవనం

వేడి గాలి కన్నా చల్లటి గాలికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చల్లగాలికి వక్రీభవన గుణకం కూడా ఎక్కువే. కాంతి కిరణం చల్లని ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి ప్రసరించినపుడు అది టెంపరేచర్ గ్రేడియంట్ కు దూరంగానూ వేడి నుంచి చల్లని ప్రదేశానికి ప్రసరించినపుడు టెంపరేచర్ గ్రేడియంట్ కు దగ్గరగానూ వంగుతుంది. ఈ విధంగా వంగడాన్నే వక్రీభవనం అంటారు. ఎడమవైపున ఉన్న బొమ్మ ప్రకారం కాంతి కిరణాలు ఆకాశం నుంచి భూమికి దగ్గరవుతున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది. దానివల్ల ఆ కిరణాలు పుటాకారంలో వంగి ప్రయాణిస్తూ వీక్షకుడు కంటిని చేరుతాయి. కానీ దృష్టి మాత్రం ఆ పుటాకారం యొక్క స్పర్శ రేఖ ఆకారంలో వస్తువును చూస్తుంది. దీని ఫలితమే ఆకాశం భూమ్మీద కనిపించినట్లుగా కనిపించడం. చూసే వారికి అక్కడ నీరున్నట్లుగా ఆకాశం అందులో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఎండమావి చిత్రాలు

Farallon Islands at inferior mirage no mirage and superior mirage.jpg
జెట్ ఇంజిన్ ఎగ్జాస్ట్ వల్ల కలిగే వేడి పొగమంచు
వేడెక్కిన రోడ్లపై ఎండమావి, రహదారిపై నీళ్ళు వున్న భ్రమకల్పిస్తుంది , సాధరణ ఎండమావికి బాగా తెలిసిన ఉదాహరణ

బయటి లింకులు