"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎం.వి.మైసూరా రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
ఎం. వి. మైసూరా రెడ్డి
ఎం.వి.మైసూరా రెడ్డి


పదవీ కాలము
2010-2012 (తెలుగుదేశం)

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-28) 28 ఫిభ్రవరి 1949 (వయస్సు 72)
ఎర్రగుంట్ల మండలం (నీడిజువ్వి]]
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (2011 - 2016)

బహుముఖ ప్రజ్ఙాశాలి డాక్టర్ ఎం. వి. మైసూరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర హోంమంత్రిగానూ. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసి మంచి వక్త, రాజకీయ చతురునిగా పేరు తెచ్చుకున్నారు.

నేపధ్యము

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, నిడిజువ్వి గ్రామంలో 1949 ఫిబ్రవరి 28 న రైతు కుటుంబంలో జన్మించారు. మేనమామ ప్రోత్సాహంతో వైద్యవిద్యను చదివి ప్రాక్టీసు ప్రారంభించాడు. ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి మైసూరారెడ్డి స్వగ్రామం కాగా, మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. తొలుత ఎర్రగుంట్ల సమితి అధ్యక్షునిగా, అనంతరం కమలాపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేదురుమిల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌లో జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌తో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో 2004లో తెదేపాలో చేరారు. అదే ఏడాది తెదేపా తరపున కడప పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. 2006లో ఆయనకు తెదేపా రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చింది. జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే రెండు రోజుల ముందు ఆయన వైకాపాలో చేరారు. జగన్‌ జైలులో ఉన్న సమయంలో పార్టీని వెన్నుంటి ఉండి నడిపించారు. తొలుత మైసూరాకు పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వగా తర్వాత ప్రాధాన్యత తగ్గించారు. దీంతో మైసూరా కూడా పార్టీకి దూరమవుతూ వచ్చారు.

రాజకీయ ప్రస్థానము

వైద్య వృత్తిని మానేసి 1981 లో రాజకీయాలలోకి ప్రవేశించారు. పంచాయితీ ఎన్నికలలో కమలాపురం సమితి ప్రెసిడెంటుగా గెలుపొందారు. తర్వాత శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో 25 సంవత్సరాలు కొనసాగారు. 1983 శాసనసభ ఎన్నికలలో ఓటామిపాలై 1985, 1989, 1999 ఎన్నికలలో విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థి వీరశివారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగానూ, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో రవాణామంత్రిగానూ పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బయటికివచ్చి ప్రస్తుతము వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర సంఘము సభ్యుడిగా అతి కీలక బాధ్యతలు చేపట్టారు. 2016 లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.

బయటి లంకెలు