ఎన్.వి. రమణయ్య

From tewiki
Jump to navigation Jump to search
ఎన్.వి. రమణయ్య
దస్త్రం:NV. Ramanaiah.jpg
జననంజూలై 10, 1935
మరణంజనవరి 16, 2018
జాతీయతభారతీయుడు
వృత్తిఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు

ఎన్.వి. రమణయ్య (1935 జూలై 10 - 2018 జనవరి 16) ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు.[1]

జననం

రమణయ్య 1935, జూలై 10న ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో జన్మించాడు. బింగినిపల్లి, ఒంగోలు, నెల్లూరు, విజయనగరంలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు.

సామాజిక కార్యకర్తగా

డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు విఆర్ కళాశాల కార్యదర్శిగా, డి.ఎస్.యు. కార్యదర్శిగా పనిచేసాడు. చేతన, నవవికాస్ సంస్థల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాడు.

సాహిత్య సేవ

ఉన్నవ రచనలు, హేతువాద రచనలు, అక్షర, శంకరన్, మధుమురళి బాలమురళి, పరిశోధన, బతుకుచిత్రం, ఏకాంతసేవ మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు.

మరణం

ఈయన 2018, జనవరి 16న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

  1. ప్రజాసాహితి మాసపత్రిక, ఫిబ్రవరి 2018, జనసాహితి ప్రచురణ, పుట.4.