"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎముక మజ్జ

From tewiki
Jump to navigation Jump to search

ఎముక మజ్జ అనబడే ఈ మృదువైన అవయవము ఎముకలోపలి భాగములో ఉంటుంది. మనుషులలో, ఎర్ర రక్త కణాలను హెమటోపొసిస్ అనే పద్ధతి ద్వరా పెద్ద ఎముకలలో ఉత్పత్తి చేస్తుంది. ఒక్క మనిషిలో నాలుగు శాతం బరువు ఈ ఎముక మజ్జదే. ఎముక మజ్జలోని హెమటోపొసిస్ భాగము ప్రతి రోజూ 50,000కోట్ల రక్త కణాలను ఉత్పత్తి చెస్తాయి, ఎముక మజ్జలోనుండి వాస్కులేచర్ అనే అవయవము ద్వారా ఆ కణాలు రక్తములోనికి కలుస్తాయి.

ఎముక మజ్జ రకాలు

ఎరుపు, పసుపు మజ్జలు

మనుషలలో రెండు రకాల మజ్జలున్నాయి.

మొదటి రకము 
మెడులా ఒస్సియం రుబ్ర దీనిని ఎరుపు మజ్జ అని కూడా అంటరు ఎందుక్కంటే ఈ మజ్జలో హెమటోపొసిస్ భాగమే ఉంటుది, ఇది ఎర్ర రక్థ సకణాలను, తెల్ల రక్తకణాలు, రక్త పటికలును ఉత్పతి చేస్తుంటాయి.
రెండవది 
మెడులా ఒస్సియం ఫావా లేదా పసుపు, దీనిలో చాలా వరకు కొవ్వుకణాలుంటయి.

ఈ రెండు మజ్జలలో చాలా రక్త నాళాలను కలగి యుంటాయి.

ఎముక మజ్జ పొర (స్ట్రోమా)

ఎముక మజ్జ పొర లేదా స్ట్రోమా రక్త కణాల ఉత్పత్తిలో ప్రత్యక్షముగా పాల్గొనదు, ఇది చాలా వరకు పసుపు మజ్జలోనే వుంటుంది.కానీ ఇది రక్త కణాల ఉత్పత్తి (హెమటోపొసిస్) కి అవసరమైన కొన్ని రకాలదోహక పదార్థమును ఉత్పతి చెయడము ద్వారా రక్త కణాల ఉత్పత్తిలో పరోక్షంగా తోడ్పడుతుంది. ఎముక మజ్జ పొరలోన్నున్న కణాలు.

ఎముక మజ్జ సరిహద్దు

ఎముక మజ్జ సరిహద్దు లేదా బోన్ మెరో బెరియర్ ఎముక మజ్జలోని కణాలను రక్త ప్రసరణలో కలవకుండా అడుకుంటుంది, కేవలము బాగా పరిణితి లేదా అభివృధి చెందిన కణాలు మాత్రమే వాటి ఫైన ఉన్న ప్రొటీన్లసహాయముతో రక్త ప్రసురనలోనికి ప్రవేశిస్తాయి. కాని కొన్ని విభాజ్యకణములు (stem cells) రక్తప్రసురణలో కలుస్తుంటయి.