"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎల్లారెడ్డి (కామారెడ్డి జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search
ఎల్లారెడ్డి
—  జణనగణన పట్టణం, రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి స్థానం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 18°11′55″N 78°00′41″E / 18.198640°N 78.011390°E / 18.198640; 78.011390
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండలం ఎల్లారెడ్డి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 7,493
 - స్త్రీల సంఖ్య 7,430
 - గృహాల సంఖ్య 3,131
పిన్ కోడ్ 503122
ఎస్.టి.డి కోడ్

ఎల్లారెడ్డి,తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలానికి చెందిన జనణగణన పట్టణం.[1].

ఇది కామారెడ్డి జిల్లాకు 42 కి.మీ.దూరంలో ఉంది.[2]కామారెడ్డి జిల్లా ఏర్పడకముందు ఎల్లారెడ్డి పట్టణం/ గ్రామం, నల్గొండ జిల్లా,కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో,ఇదే పేరుతో ఉన్న మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఎల్లారెడ్డి గ్రామాన్ని, కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా,కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఎల్లారెడ్డి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎల్లారెడ్డి మండలంలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణ జనాభా మొత్తం 14,923. ఇందులో 7,493 మంది పురుషులు కాగా, 7,430 మంది మహిళలు ఉన్నారు.పట్టణంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1761. ఇది ఎల్లారెడ్డి (సిటి) మొత్తం జనాభాలో 11.80% గా ఉంది.పట్టణ పరిధిలో స్రీల సెక్స్ నిష్పత్తి 993 సగటుతో పోలిస్తే 992 గా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.66% కాగా, మహిళా అక్షరాస్యత 65.49% గా ఉంది.[3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో మొత్తం 3,131 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎల్లారెడ్డి పురపాలక సంఘం అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలో రహదారులను నిర్మించడానికి, ఇతర వసతులు సమకూర్చటానికి పురపాలక సంఘం పరిధిలోని ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం కలిగిఉంది.[3]

మూలాలు

  1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Kamareddy.pdf
  2. "Distance between Kamareddy and Yellareddy is 36 KM / 22.9 miles". distancebetween2.com. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-26.
  3. 3.0 3.1 "Yellareddy Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-26.

వెలుపలి లంకెలు

మూస:యెల్లారెడ్డి మండలంలోని గ్రామాలు