ఎస్.కె. ఆంజనేయులు

From tewiki
Jump to navigation Jump to search
ఎస్.కె. ఆంజనేయులు
దస్త్రం:SK Anjanetulu.jpg
జననంఏప్రిల్ 8, 1925
మరణంసెప్టెంబరు 11, 2005
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు

ఎస్.కె. ఆంజనేయులు (ఏప్రిల్ 8, 1925 - సెప్టెంబరు 11, 2005) ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.[1]

జననం - ఉద్యోగ జీవితం

ఆంజనేయులు 1925, ఏప్రిల్ 8న జన్మించాడు. 1945లో నిజాం స్టేట్ రైల్వేలో ఉద్యోగంలో చేరాడు.

రంగస్థల ప్రస్థానం

సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాలలో నటించి, దర్శకత్వం చేపట్టిన ఆంజనేయులు, 1962లో సారంగధర నాటకానికి దర్శకత్వం వహించి అనేకసార్లు ప్రదర్శింపజేశాడు. 1987లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన నాటిక రచనా పోటీలలో రాధికా స్వాంతం నాటికకు ప్రథమ బహుమతి, విశాఖ సాహితీ సేవా సమితి ట్రస్ట్ నిర్వహించిన నాటక రచనల పోటీలలో స్మృతి ప్రతీక నాటికకు తృతీయ బహుమతి అందుకున్నాడు. 1952లో లక్ష్మీపతి సహకారంతో హైదరాబాద్ లో విశ్రుతీ నాట్యమండలిని స్థాపించి అనేక నాటకాల్ని ప్రదర్శించాడు. 1955 నుంచి వందకుపైగా నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

నటించినవి

  • శిరోమణి
  • వలయం
  • ఆత్మీయులు
  • రాగరాగిణి
  • పవిత్రులు
  • చావకూడదు
  • నీడలు-నిందలు

మరణం

2005, సెప్టెంబర్ 11హైదరాబాద్ మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.204.