"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం
ఏడుపాయల దుర్గమ్మ | |
---|---|
![]() ఏడుపాయల క్షేత్రం | |
భౌగోళికాంశాలు : | 18°02′00″N 78°06′00″E / 18.0333°N 78.1000°ECoordinates: 18°02′00″N 78°06′00″E / 18.0333°N 78.1000°E |
ప్రదేశము | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మెదక్ జిల్లా |
ప్రదేశం: | నాగసానిపల్లె |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | దుర్గమ్మ |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూమతము |
ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో ఏడు పాయల నదీ ఒడ్డున వెలిసి, వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరుపొందింది.[1]
Contents
చరిత్ర
ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది.
విగ్రహంలోని విశేషం
నల్లసరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారుంటారు. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది.
జాతర
ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించకుంటారు. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది.
మూలాలు
- ↑ ఏడుపాయల దుర్గమ్మ. "వరాలిచ్చే వనదేవత ఏడుపాయల దుర్గమ్మ!". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 28 October 2017.