"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఏ.వి.యం. ప్రొడక్షన్స్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Jeevitham cinema poster.jpg
ఏ.వి.యం.వారి మొదటి తెలుగు సినిమా జీవితం పోస్టరు.

ఏ.వి.యం.ప్రొడక్షన్స్ (A.V.M.Productions) దక్షిణ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి. 1907 జూలైలో జన్మించిన ఎ.వి.మొయ్యప్పన్ 1938లో ‘అల్లి అర్జున్’తో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టి 1940లో ప్రగతి స్టూడియోస్ ఆరంభించాడు. 1945 నవంబర్ 14న శాంథోంలో ఎ.వి.యం. స్టూడియో ప్రారంభించి తరువాత వడపళనికి మార్చాడు. 1950లో ‘జీవితం’ చిత్రం మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందకిపైగా సినిమాలను ఈ సంస్థ నిర్మించింది. వీటిలో పలు విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. 1979లో మొయ్యప్పన్ మరణించిన తరువాత అతని కుమారులు శరవణన్, కుమరన్, మురుగన్ బాలసుబ్రహ్మణ్యంలు చిత్ర నిర్మాణం కొనసాగిస్తున్నారు.

నిర్మించిన సినిమాలు

బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.