ఒకే కుటుంబం

From tewiki
Jump to navigation Jump to search
ఒకే కుటుంబం
(1970 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం నందమూరి తారక రామారావు,
లక్ష్మి,
కాంతారావు,
రాజశ్రీ,
అంజలీదేవి,
నాగయ్య
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ రవి ఆర్ట్ ధియేటర్స్
భాష తెలుగు

ప్రముఖ సినిమానటుడు నాగభూషణం ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాకు తమిళచిత్రం ‘పాపమణిప్పు’ ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్‌.రాధాకి నాగభూషణమే డబ్బింగ్‌ చెప్పాడు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించాడు.

నటీనటులు

  • ఎన్.టి.రామారావు
  • కాంతారావు
  • నాగభూషణం
  • చిత్తూరు నాగయ్య
  • అల్లు రామలింగయ్య
  • ధూళిపాళ
  • నారాయణరావు
  • రాజశ్రీ
  • లక్ష్మి
  • రుక్మిణి
  • నిర్మల

సాంకేతికవర్గం

  • నిర్మాతలు: సి.హెచ్.రాఘవరావు, కె.బసవయ్య
  • సమర్పణ: నాగభూషణం
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.భీంసింగ్
  • పాటలు: దాశరథి, దేవులపల్లి, శ్రీశ్రీ, కొసరాజు
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి

పాటలు

  1. . అందరికి ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి - ఘంటసాల బృందం
  2. ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కథలే - సుశీల
  3. కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలకుక జంట కావాలి -సుశీల, ఎస్.పి. బాలు
  4. నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు రెండిటి నడుమ - ఘంటసాల రచన:శ్రీశ్రీ
  5. మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు -ఘంటసాల
  6. శిల్పాలు శిథిలమైనా .. మంచిని మరచి వంచన నేర్చి నరుడే -ఘంటసాల

వనరులు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు