"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఒలంపస్ మోన్స్

From tewiki
Jump to navigation Jump to search
ఒలంపస్ మోన్స్
మార్స్ మీద ఉన్న ఒలంపస్ మోన్స్ సౌర వ్యవస్థలో అతి ఎత్తైన గ్రహ పర్వతం, ఇది భూమి మీద ఉన్న ఎవరెస్టు పర్వతం మరియు మౌనా కియా పర్వతాలతో పోల్చబడిన చిత్రం.

ఒలంపస్ మోన్స్ (Olympus Mons) అనేది అంగారక గ్రహంపై ఉన్న చాలా పెద్ద డాలు అగ్నిపర్వతం. ఒక కొలత ప్రకారం, ఇది దాదాపు 22 కిలోమీటర్ల (13.6 మైళ్లు) ఎత్తును కలిగియుంటుంది.[1] ఒలంపస్ మోన్స్ సముద్ర మట్టానికి పైన ఎవరెస్టు పర్వతం ఎత్తుకు రెండున్నర రెట్లు ఉంటుంది. ఇది అంగారకగ్రహంపై ఉండే పెద్ద అగ్నిపర్వతములలో పసిది, ఇది మార్స్ యొక్క హెస్పీరియన్ కాలంలో ఏర్పడినది. ఇది ప్రస్తుతం సౌర వ్యవస్థలో కనుగొన్న అతిపెద్ద అగ్నిపర్వతం.

మూలాలు

  1. Plescia, J. B. (2004). "Morphometric Properties of Martian Volcanoes". J. Geophys. Res. 109: E03003. Bibcode:2004JGRE..109.3003P. doi:10.1029/2002JE002031.