"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఓదెల మల్లన్న దేవాలయం

From tewiki
Jump to navigation Jump to search
ఓదెల మల్లన్న దేవాలయం
ఓదెల మల్లన్న దేవాలయం
ఓదెల మల్లన్న దేవాలయం
ఓదెల మల్లన్న దేవాలయం is located in Telangana
ఓదెల మల్లన్న దేవాలయం
ఓదెల మల్లన్న దేవాలయం
తెలంగాణలో ఉనికి
భౌగోళికాంశాలు :18°27′18.96″N 79°26′48.07″E / 18.4552667°N 79.4466861°E / 18.4552667; 79.4466861Coordinates: 18°27′18.96″N 79°26′48.07″E / 18.4552667°N 79.4466861°E / 18.4552667; 79.4466861
ప్రదేశము
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:పెద్దపల్లి జిల్లా
ప్రదేశం:ఓదెల
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం

ఓదెల మల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామంలో ఉన్న దేవాలయం.[1] తెలంగాణాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయం పెద్దపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయ నిర్మాణక్రమం, స్తంభ వర్ణ శిలల శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలంలోనే నిర్మింపబడి, క్రీ.శ.1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మింపబడింది.[2]

చరిత్ర

ఈ దేవాలయంలోని శివలింగానికి పంకజ మహాముని తపస్సు చేశాడనీ, అర్ధరాత్రి సమయాల్లో ఋషులు కూడా శివలింగానికి పూజలు చేసేవారట. కాలక్రమేణ శివలింగంపై పుట్ట పెరిగి అడవిగా మారిన ఆ ప్రాంతాన్ని చింతకుంటు ఓదెలు అను రైతు వ్యవసాయం చేస్తూ పుట్టను చెదరగొట్టగా నాగలి కర్రు తగిలి శివలింగం బయల్పడిందని, నాగలి తాకిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లుగా చెబుతారు.[3] శ్రీబ్రమరాంభ సమేత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, ఖండేశ్వరస్వామి, మేడుదులదేవి, కేతమ్మల విగ్రహాలున్నాయి. రైతు ఓదెలు పేరుతో ఈ ఓదేలు గ్రామం వెలిసింది.[4]

జాతర

ప్రతి ఏడాది ఉగాది రోజున మొదలయ్యే జాతర, జూలై నెలలో జరిగే పెద్దపట్నం, అగ్రిగుండం బ్రహ్మోత్సవాలతో ముగుస్తుంది. మహాశివరాత్రికి మూడురోజులపాటు కల్యాణోత్సవాలు, స్వామివారి ఊరేగింపు ఉంటాయి. ఉదయం నుంచే సామూహిక రుద్రాభిషేకం, రథోత్సవం, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహిస్తారు.[5]

మూలాలు

  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "ఓదెల మల్లన్న క్షేత్రం". Archived from the original on 16 July 2018. Retrieved 2 June 2018.
  2. డైలీహంట్, ఈనాడు. "మహిమాన్వితం మల్లన్న క్షేత్రం". www.dailyhunt.in. Retrieved 2 June 2018.
  3. ఆంధ్రజ్యోతి, ప్రత్యేకం (21 May 2018). "రాముడు కొలిచిన శివుడు". పెద్దపల్లి, ఆంధ్రజ్యోతి. Retrieved 2 June 2018.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (21 February 2017). "శివరాత్రికి ముస్తాబవుతున్న ఓదెల మల్లన్న". Retrieved 2 June 2018.
  5. ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "నాగేటి సాళ్లల్ల ఉద్భవించిన లింగం". Archived from the original on 4 March 2019. Retrieved 7 March 2019.