ఓబనపాలెము ( నాగులుప్పలపాడు మండలం)

From tewiki
Jump to navigation Jump to search


ఓబనపాలెము
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

ఓబనపాలెము, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523183. ఎస్.టి.డి కోడ్:08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

నాగులుప్పల పాడు ఉప్పుగుండూరు మాచవరం ఉప్పలపాడు అమ్మనబ్రోలు

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

బస్సు వసతి జిల్లా కేంద్రం ఒంగోలు నుండి మాత్రమే ఉంది.

గ్రామంలో మౌలిక వసతులు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఊరిలో చెఱువు చూడ ముచ్చట గొలుపును.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో మూడు దేవాలయములు ఉన్నాయి. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము, శివాలయము ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

శ్రీ కట్టా రామకృష్ణ

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు అందజేసే అత్యుత్తమ పురస్కారం అయిన, జగజ్జీవనరాం అభినవ కిసాన్ పురస్కారం నకు, ఓబనపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ ఎంపికైనారు. 2014, జూలై-29న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ముఖ్య అథిధిగా పాల్గొన్న సభలో, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ మరియూ వ్యవసాయోత్పత్తుల శాఖా మంత్రి శ్రీ బాలు నాయక్ బల్వాన్ చేతులమీదుగా, ఈయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు వీరు 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని గూడా అందుకున్నారు. [2]

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దర్శి కృషి విఙానకేంద్రం ఆధ్వర్యలో ఇటీవల దర్శిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా, ఒక కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో వీరికి ఉత్తమ రైతు పురస్కారం అందజేసినారు. మినుములో పల్లాకు తెగులుకు తట్టుకుని, అధిక దిగుబడిని ఇచ్చే పాలిష్ రకాలు అభివృద్ధి చేయడం, పెసరలో కొత్త వంగడాలు అభివృద్ధి చేయడం, శనగలో కోతయంత్రం వెరైటీని అభివృద్ధి చేయడంలో వీరి కృషిని గుర్తించి, వీరికి ఈ పురస్కారాన్ని ఒంగోలు లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చేతులమీదుగా అందజేసినారు. [3] వీరు 2016,డిసెంబరు-3న, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, అభ్యుదయ రైతు కోటాలో, వ్యవసాయ పరిశోధన, విస్తరణ కేంద్రం సభ్యులుగా నియమితులైనారు. నూతన వంగడాలతో వ్యవసాయంలో మేలైన ఉత్పత్తులు అందించినందుకు వీరికి ఈ అవకాశం లభించింది. [4]

గ్రామంలోని విశేషాలు

  • gramam lo ekkuva mandi B TECH, MCA,chesi unnata udyogalu chestunnaru. gramam lo telugu desam congress party lu madya rajakeeyam nadustundi. manam bagaleka poyina paravaledu gani pakka vaadu bagu padakudadu ane type manushulu ekkuva. eeee villiage ki vellalante roadlu chettaga untayi.ayna pattinchukune vaadu ledu.evadi gola vadidi.

గ్రామ జనాభాలో ఎక్కువ మంది కమ్మ కులము వారు.

గ్రామ జనాభా

మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం; 2014,జులై-30; 7వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-6; 3వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016,డిసెంబరు-4; 7వపేజీ.