"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఓరుగంటి నీలకంఠశాస్త్రి
Jump to navigation
Jump to search
ఓరుగంటి నీలకంఠశాస్త్రి ఒక ప్రసిద్ధి చెందిన పండితుడు, ఉభయభాషా పారంగతుడు.
Contents
విశేషాలు
ఇతడు జూలై 19 వ తేదీన విజయనగరంలో జన్మించాడు. ఇతడు విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో విద్యను కొనసాగించాడు. సంస్కృత అలంకార, వ్యాకరణశాస్త్రాలు, పూర్వోత్తర మీమాంసలు, తర్కశాస్త్రము, ప్రస్థాన త్రయము సమగ్రంగా అభ్యసించినాడు. ఇతడు 1971 వరకు గుంటూరు హిందూ కళాశాలలోను, 1971-72లో కె.వి.కె సంస్కృత కళాశాలలోను సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. తరువాత గుంటూరు పి.జి.కాలేజీలో తెలుగు శాఖలో యు.జి.సి.గౌరవాచార్యునిగా పనిచేశాడు[1].
రచనలు
ఇతని రచనలు అనేకం భారతి వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతని రచనలలో కొన్ని:
- తల్లి విన్కి (లలితా సహస్రనామ వివృతి)
- తిక్కయజ్వ హరిహరనాథతత్త్వము
- శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
- సూతసంహిత
- అక్షర సమామ్నాయము
- లోచనము
- కళ్యాణలీల మొదలైనవి.
బిరుదములు
- వ్యాకరణ విద్యా ప్రవీణ
- ఉభయ భాషా ప్రవీణ
- వేదాంత పారీణ మొదలైనవి.
మూలాలు
- ↑ కె. సుధాకరరావు (12 June 1981). "శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 68 సంచిక 70). Retrieved 12 February 2018.