ఓలేటి వెంకటేశ్వర్లు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Voleti Venkateswarlu.jpg
వోలేటి వెంకటేశ్వర్లు

ఓలేటి వెంకటేశ్వర్లు (జ: 1928 ఆగష్టు 27 - మ: 1989 డిసెంబరు 29) ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.[1]

జీవిత విశేషాలు

ఆయన 1928 ఆగష్టు 27తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. గుడివాడలో చతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో కాకినాడలో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలో చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో శ్రీపాద పినాకపాణి వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా తంజావూరు బాణీని గ్రహించారు.[2]

ఆకాశవాణి లో

ఆయన 1956లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసరుగా సంగీత శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన "సంగీత శిక్షణ" అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మూర్తి త్రయంతోపాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నై పిళ్ళై వంటి విద్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య కీర్యనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థులవారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు. విజయవాడ కేంద్ర కార్యక్రమాలలో ప్రసిద్ధి చెందిన "భక్తిరంజని" కార్యక్రమంలో త్యాగరాజు దివ్యనామ కీర్యనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీతం లోని బాణీని విడువకుండా చక్కని సాంప్రదాయ శైలిలో పాడేవారు.[2]

మూలాలు

  1. ప్రసారప్రముఖులు పుస్తకం, రచయిత:డా. ఆర్. అనంతపద్మనాభరావు, పేజీ సంఖ్య 44
  2. 2.0 2.1 Voleti Venkateswarulu (1928-89)

ఇతర లింకులు