"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఔత్సాహిక శాస్త్రజ్ఞులు

From tewiki
Jump to navigation Jump to search

ఔత్సాహికులు (Amateurs) అనగా ఏదైనా రంగంలో విషయాన్ని ప్రధాన వృత్తిగా కాక అదనపు ప్రవృత్తిగా ఆచరించేవారు. ఇందుకు భిన్నంగా అదే వృత్తిగా స్వీకరించినవారిని 'ప్రొఫెషనల్స్'(Professionals) అంటారు. ఈ పదాలు అన్ని రంగాలకూ వర్తిస్తాయి. కాని క్రీడారంగం, ఫొటోగ్రఫీ, విజ్ఞానశాస్త్రం, రేడియో వంటి విషయాల్లో ఈ మాటను ఎక్కువగా వాడుతారు. ఇదే పదం ఆధారంగా ఒక విజ్ఞాన శాస్త్ర రంగంలో నూతనంగా ప్రవేశించిన, అంతగా అనుభవంలేకపోయినా, చాలా ఉత్సాహం కలిగిన వారిని ఔత్సాహిక శాస్త్రజ్ఞులు అనవచ్చును.


ఔత్సాహికులు అంటే ఎవరు? అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయా అభిప్రాయాలకు కొన్ని మినహాయింపులూ ఉంటాయి. [1]

  • సాధారణంగా ఔత్సాహికులు ఆయా రంగంలోకి క్రొత్తగా వచ్చి ఉంటారు. కానీ ఒకే రంగంలో చాలా కాలం పాటు పనిచేసే ఔత్సాహికులు కూడా ఉంటారు.
  • ఔత్సాహికులకు అంతగా అనుభవం, జ్ఞానం ఉండకపోవచ్చును. (ఇది కూడా అన్నిసందర్భాలలో నిజం కాదు. ప్రొఫెషనల్స్ కంటే నిష్ణాతులైన ఔత్సాహికులు ఉంటూ ఉంటారు.)
  • ఔత్సాహికుల వద్ద పరికరాలు అంతంత మాత్రమే ఉంటాయి. (కానీ కొందరు ఔత్సాహికులు ప్రొఫెషనల్స్ కంటే, పరిశోధనాశాలలకంటే మంచి పరికరాలు సాధిస్తారు)

కనుక ఒక రంగాన్ని ప్రధాన వృత్తిగా ఆచరించనివారిని ఔత్సాహికులు అనడం ఉచితం.


ప్రముఖ ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు


మూలాలు

  1. ఇది ఎక్కడో చదివిన విషయం. కాని గుర్తులేదు. ఆధారాలు ఎవరైనా సమకూరిస్తే కృతజ్ఞతలు