ఔషధ ప్రయోగం

From tewiki
Jump to navigation Jump to search


పరిచయం

Rispolept tablets.jpg

ఆంగ్లంలో మెడిసిన్ , సింపుల్ డ్రగ్ , ఫార్మాస్యూటికల్ డ్రగ్ అని , తెలుగులో మందు , ఔషధం అని పిలుస్తారు . ఏదైనా వ్యాధిని విశ్లేషించిన తరవాత అంటే రోగనిర్ధారణ జరిగిన తర్వాత చికిత్సకు , నివారణకు , వ్యాధిని నిరోధించడానికి మందు ఉపయోగిస్తారు . వైద్యరంగంలో వ్యాధి నివారణకు ఎన్నో చికిత్సలున్నప్పటికీ మందులే కీలకమైనవి . వైద్తశాస్త్రంలో నిరంతర అభివృద్ధిలో భాగంగా మందుల పాత్ర ప్రధానమైనవి . వ్యాధి నివారణకు సరైన విధంగా నిర్వహించడంలో మందులు చాల అవసరం .

మందు/ఔషధం - నిర్వచనం

ఐరోపాలో , EU(యురేపియన్ యూనియన్) చట్టం ప్రకారం ఏదైనా మందుల ఉత్పత్రి నుంచి వెలువడిన మందు / ఔషధం అనే పదాలను ఈ విధంగా నిర్వచించింది .

 • మానవులలో వ్యాధి చికిత్సకు లేదా నివారించగలిగే లక్షణాలను కలిగి ఉన్న ఏదైనా పదార్థం లేదా పదార్థాల కలయిక;
 • వైద్యంలో వ్యాధి చికిత్సలో భాగంగా శారీరక విధులను పునరుద్ధరించడం, సరిచేయడం , సవరించడం లేదా వైద్య నిర్ధారణ చేయడం కొరకు ఉపయోగించే లేదా ఇవ్వబడే రసాయన పదార్థాల యొక్క ఏదైనా పదార్థం లేదా రసాయన పదార్థాలు కలయిక .

వర్గీకరణ

మందుల వర్గీకరణలో ప్రధానంగా కెమికల్ సింథసిస్ , బయోలాజికల్ మెడిసన్స్ అని ప్రధానంగా చేయొచ్చు . ఇవి కాకుండా ఔషధాలను అనేక విధాలుగా వర్గీకరించారు . కీలకమైన విభాగాలలో

 1. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ : నియంత్రణ స్థాయి ద్వారా, ఒక pharmacist/ ఔషధ నిపుణుడు వైద్యుడు, వైద్య సహాయకుడు లేదా అర్హతగల నర్సు ఆదేశాల మేరకు మాత్రమే పంపిణీ అయ్యేవి)
 2. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ : వినియోగదారులు తమకు తామే ఆర్డర్ చేయగల మందులు.
 3. సాంప్రదాయిక చిన్న-అణువుల డ్రగ్స్ : సాధారణంగా రసాయన సంశ్లేషణ నుండి తీసుకోబడిన బయోఫార్మాస్యూటికల్స్ నుంచి తయారు చేయబడినవి . వీటిలో ఉన్న సంయోగకారి ప్రోటీన్లు టీకాలు, చికిత్సా పద్ధతిలో ఉపయోగించే రక్త ఉత్పత్తులు ( IVIG వంటివి ), జన్యు చికిత్స, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ,సెల్ థెరపీ మున్నగు వాటిల్లో ఉపయోగిస్తారు .

మందులను వర్గీకరించడానికి వున్న ఇతర మార్గాలు - చర్య విధానం, పరిపాలన మార్గం, జీవ వ్యవస్థ ప్రభావిత లేదా చికిత్సా ప్రభావాల ద్వారా కూడా వర్గీకరించవచ్చు .సాధారణంగా విస్తృతమైన .విస్తృతంగా ఉపయోగించే ఔషధాల వర్గీకరణ వ్యవస్థ ను గురించి అనాటమికల్ థెరప్యూటిక్ కెమికల్ వర్గీకరణ వ్యవస్థ[1] (ATC వ్యవస్థ) అనే ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన ఔషధాల జాబితాను అందుబాటులో ఉంచుతుంది.

ఔషధాల వినియోగం

వృద్ధ అమెరికన్లలో మాదకద్రవ్యాల వాడకం అనే సంస్థ ఒక అధ్యయనం చేయపట్టింది . దాని ప్రకారం 2005 - 2006 మధ్య 71 సంవత్సరాల వయస్సు గల 2377 మంది వ్యక్తుల సమూహంలో జరిపిన సర్వేలో , కనీసం 84% మంది ఒక ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ,కనీసం 44% మంది ఒక ఓవర్-ది-కౌంటర్ (OTC) డ్రగ్స్, కనీసం 52% మంది ఆహారమీ ఔషధంగా తీసుకున్నారని అధ్యయనంలో తెలిసింది . 2010 - 2011 మధ్య కాలంలో సర్వే చేయబడిన 2245 మంది వృద్ధ అమెరికన్ల సమూహంలో (సగటు వయస్సు 71),కనీసం 88% ప్రిస్క్రిప్షన్ డ్రగ్ , కనీసం 38% ఓవర్-ది-కౌంటర్ , కనీసం 64% ఆహారమీ ఔషధంగా తీసుకుంటున్నారని తెలిపింది . [2] ఆ మందుల ప్రయోగం , విధానం గురించి , తీరు ఇలా ఎన్నో విషయాల విశ్లేషణ ఇందులో పొందుపరచబడి ఉంది .

ఔషధాల ధర

ఔషధ ఆవిష్కరణ , ఔషధాల అభివృద్ధి అనేది ఔషధ కంపెనీలు, వైద్య శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చేపట్టిన సంక్లిష్టమైన ఖరీదైన ప్రయత్నాలు. ఆవిష్కరణ నుండి వాణిజ్యీకరణ వరకు ఈ సంక్లిష్ట మార్గం ఫలితంగా భాగస్వామ్యాలుగా మారి ఔషధ అభ్యర్థులను అభివృద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ముందుకు తీసుకురావడానికి ఒక ప్రామాణిక పద్ధతిగా మారాయని చెప్పవచ్చు .ప్రభుత్వాలు సాధారణంగా ఏ ఔషధాలను విక్రయించవచ్చో, ఎలా విక్రయించవచ్చో అనే విషయాలను కొన్ని అధికార పరిధులలో, ఔషధాల ధరలను నియంత్రిస్తాయి.ఇవన్నీ కూడా WHO పరిధిలో ఉండటంతో పాటు ఆయాదేశాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి .

సాధారణ ఔషధాల వర్గం

 1. యాంటిపైరెటిక్స్ : జ్వరాన్ని తగ్గించడం (పైరెక్సియా / పైరెసిస్)
 2. అనాల్జెసిక్స్ : నొప్పిని తగ్గించడం ( నొప్పి నివారణలు)
 3. యాంటీమలేరియల్ మందులు : మలేరియా చికిత్స
 4. యాంటిబయాటిక్స్ :
 5. యాంటిసెప్టిక్స్ : కాలిన గాయాలు, కోతలు , గాయాల దగ్గర సూక్ష్మక్రిమి పెరుగుదల నివారణ
 6. మూడ్ స్టెబిలైజర్స్ : లిథియం, వాల్ప్రోమైడ్
 7. హార్మోన్ రీప్లేస్మెంట్స్ : ప్రీమెరిన్
 8. స్వీయ గర్భనిరోధకాలు : ఎనోవిడ్, "బిఫాసిక్" పిల్ , "త్రిఫాసిక్" పిల్
 9. ఉద్దీపనలు(Stimulants) : మిథైల్ఫేనిడేట్, యాంఫేటమిన్
 10. మత్తుమందులు : మెప్రోబమేట్, chlorpromazine, reserpine, chlordiazepoxide, డైయాజిపాం, alprazolam
 11. స్టాటిన్స్ : లోవాస్టాటిన్, ప్రవాస్టాటిన్ , సిమ్వాస్టాటిన్ link=|ఎడమ|thumb

మూలాలు

  1. https://en.wikipedia.org/wiki/Anatomical_Therapeutic_Chemical_Classification_System. Missing or empty |title= (help)
  2. Qato DM; Wilder J; Schumm L; Gillet V; Alexander G (1 April 2016). "Changes in prescription and over-the-counter medication and dietary supplement use among older adults in the united states, 2005 vs 2011". JAMA Internal Medicine. 176 (4): 473–482. doi:10.1001/jamainternmed.2015.8581. PMC 5024734. PMID 26998708.