"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కందికొండ యాదగిరి

From tewiki
Jump to navigation Jump to search
కందికొండ యాదగిరి
జననంఅక్టోబర్ 13
నాగుర్లపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా
విద్యఎం. ఎ పాలిటిక్స్, ఎం. ఎ తెలుగు
పూర్వ విద్యార్థులుఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిసినీ గీత రచయిత, కవి, కథకుడు

కందికొండగా పిలువబడే కందికొండ యాదగిరి ప్రముఖ సినీ గీత రచయిత, కవి, కథకుడు.[1][2]

జీవిత విశేషాలు

కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్), యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు

ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాసారు. అంతేకాకుండా తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.

ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.

గేయ రచయితగా

 • ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
 • 143
 • ఆంధ్రావాలా (2004): గిచ్చి గిచ్చి, మల్లెతీగరోయ్, కొక్కొ కోలమిస్స
 • అల్లరి పిడుగు
 • ఆప్తుడు
 • ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెళ్ళి
 • చక్రం
 • ఎంజాయ్
 • ఆడుతూ పాడుతూ
 • షాక్
 • రణం
 • పోకిరి
 • సీతారాముడు
 • స్టాలిన్‌
 • తొలి చూపులోనే
 • పొగరు
 • చిన్నోడు
 • రిలాక్స్
 • భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
 • ఆదిలక్ష్మి
 • నువ్వంటే నాకిష్టం
 • జూనియర్స్
 • ధన 51
 • దొంగ దొంగది
 • అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి
 • మున్నా
 • లవ్ యు బంగారమ్ (2014): రెండు కళ్ళు సాలవట
 • మా అబ్బాయి (2017): కదిలే కదిలే, ఆ చందమామ

మూలాలు

 1. నమస్తే తెలంగాణ. "పాటకు కొత్త పరిమాళాలద్దిన కందికొండ". Retrieved 30 September 2017.
 2. http://telugucinemacharitra.com/%E0%B0%97%E0%B1%80%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1/

ఇతర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).