కట్ట వరదరాజ భూపతి

From tewiki
Jump to navigation Jump to search

కట్ట వరదరాజ భూపతి క్రీ.శ.1560 నాటికి చెందిన కవి. ఆయన రాజవంశీకుడైన తెలుగు రాజకవుల్లో ఒకరిగా నిలుస్తున్నారు.

జీవితం

కట్ట వరదరాజ భూపతి విజయనగర సామ్రాజ్య పాలకుల రాజబంధువు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, విజయనగరాన్ని పరోక్షంగా పరిపాలించినవాడూ అయిన అళియ రామరాజుకు వరదరాజ భూపతి పినతల్లి కుమారుడు.

సాహిత్య రంగం

కట్ట వరదరాజ భూపతి సుప్రసిద్ధమైన వైష్ణవక్షేత్రం శ్రీరంగం విశిష్టతను గురించి శ్రీరంగ మహాత్మ్యం అనే కావ్యాన్ని రచించారు. ఇదే కాక పరమ భాగవత చరిత్రము, రామాయణ ద్విపద వంటి కావ్యాలను రచించారు..[1]

రచనలు

మూలాలు

  1. రామకృష్ణకవి, మానవల్లి (1910). ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81 https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/213&action=edit&redlink=1. Retrieved 6 March 2015. Missing or empty |title= (help)