"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కమ్మర
![]() | This article has an unclear citation style.మే 2013) ( |
![]() | This page is a new unreviewed article. This template should be removed once the page has been reviewed by someone other than its creator; if necessary the page should be appropriately tagged for cleanup. (మే 2013) |
విశ్వకర్మీయుల/విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము.ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బలు తినాల్సిందే. భగభగ మండే కొలిమి ముందు కూర్చుని వేడిని లెక్క చేయక రైతుకు అవసరమైన పనిముట్లు చేస్తాడు. కమ్మరి కొలిమి రాజేసి ఇనప ముక్కలతో కొడవళ్ళు గునపాలు నాగళ్ళు చేస్తాడు. కొడవళ్ళకు కక్కు కొడతాడు.రెడీమెడ్ పనిముట్లు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇనుముతో రకరకాల పనిముట్లు తయారు చేసే కమ్మరి కి పని పోయింది.రైతులు గతంలో మాదిరి కొలిమి దగ్గరకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు చేయించుకొనే ఓపిక ఇప్పుడు లేదు. దాంతో వారు రెడీమెడ్ పనిముట్లు తీసుకొని తమ పనులు గడుపుకొంటున్నారు. అనావృష్టి, అతివృష్టితో రైతులు వ్యవసాయం చేయకపోవడంతో వ్యవసాయ పనిముట్లుతయారు చేసే కమ్మరి పని పోయింది.వీరు ఇప్పుడు ప్రవేటు ఫ్యాక్టరీలలో కార్మికులయ్యారు.కదిరి ప్రాంతంలో ముస్లిములు ఎక్కువమంది కమ్మరి పని చేస్తున్నారు.ఆధునిక యంత్ర పనిముట్లు రావడం వల్ల కమ్మరి వృత్తి పూర్తిగా అంతరించిపోవుటకు సిద్దమైంది. ట్రాక్టర్లు రావడం వల్ల నాగళ్లు, పొలాన్ని దున్నేందుకు ఉపయోగం లేకుండా పోయాయి. వరి కోత మిషన్లు రావడం వల్ల కోసే కోడవలి కూడా ఉపయోగపడకుండా ఉంది.కొలిమి దగ్గర ఉండి ఇనుప సామాన్ల తయారీలో ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా సౌకర్యం కల్పించాలి అని వీరి డిమాండు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కులస్తులు సాంప్రదాయ కమ్మరులు. వీరు ఆంధ్రప్రదేశ్ బి.సి.జాబితాలో 21వ కులంగా చేర్చబడినారు.
పూర్వం ఈ వృత్తిని చేసికొని బతికే సంచార జాతి ఇంకొకటి వున్నది. వారిని 'బైట కమ్మరులు అంటారు. వీరు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 10వ కులం. వీరు కమ్మరి పనికి కావల్సిన పని ముట్లతో ఊరూరు తిరుగుతుంటారు. వీరు ఊర్లోకి రాకుండా ఊరి బైటనే కొలిమి పెట్టుకుని కొద్ది రోజులు ఉండి వెళ్ళి పొతారు. వీరికీ విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి పోలిక కానీ సంబంధంకానీ లేదు.
మూలాలు
- Wikipedia references cleanup from మే 2013
- All articles needing references cleanup
- Articles covered by WikiProject Wikify from మే 2013
- All articles covered by WikiProject Wikify
- Unreviewed new articles from మే 2013
- All unreviewed new articles
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- కులాలు
- వృత్తులు