"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కర్నాటి రఘురాములు గౌడు

From tewiki
Jump to navigation Jump to search
కర్నాటి రఘురాములు గౌడు
జననంకర్నాటి రఘురాములు గౌడు
1956
మహబూబ్ నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం,గుండ్లగుంటపల్లి గ్రామం
వృత్తిఉపాధ్యాయులు
ప్రసిద్ధిశతక కవి
మతంహిందూ

కర్నాటి రఘురాములు గౌడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శతక కవి[1].ఇతను జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామంలో 1956లో జన్మించారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. బోధించేది సాంఘికశాస్త్రం ఐనా, తెలుగు భాషన్నా, తెలుగు సాహిత్యమన్న మక్కువ. ఆ ఇష్టమే వీరిని కవిగా మలిచింది. జిల్లా కరువు పరిస్థితులు, వీరి గ్రామ సమీపాన కల అభయాంజనేయ స్వామి ప్రభావం కూడా వీరు కవిగా మారడానికి కారణమయ్యాయి. విద్యార్థి దశలోనే పద్యాలు రాయడం ప్రారంభించారు. తొలినాళ్ళలో సీస పద్యాలు రాశారు. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి సూచనలు, జిల్లాకే చెందిన మరో కవి రాకొండ శేఖర్ రెడ్డి ప్రోత్సాహం వీరిని కవిగా మరో మెట్టు పైకి ఎదిగించాయి. ఒక వైపు కవిగా రచనలు చేస్తూనే మరో వైపు భగవద్గీత ప్రచారం, భాగవత సేవ మొదలగు భక్తి ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. భక్తకవిగా అనేక భక్తి శతకాలను రచించారు.

విద్యాభ్యాసం

ఊర్కొండపేటలో ప్రాథమిక విద్య, కల్వకుర్తిలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. 1980లో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేశాడు. దూర విద్యలో ఎం.ఏ., ను పూర్తి చేశాడు.

ఉద్యోగ జీవితం

రఘురాములు గౌడు సెక్యూరిటి గార్డుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1975 నుండి 1979 వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉపాధ్యాయ శిక్షణలో సీటు వస్తే ఉద్యోగాన్ని వదిలి 1980లో శిక్షణలో చేరి పూర్తి చేశాడు. 1981 నుండి రెండు సంవత్సరాల పాటు జడ్చర్ల పట్టణంలోని ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1982లో నిర్వహించబడిన ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అప్పటి కల్వకుర్తి సమితిలోని సిరసనగండ్ల పాఠశాలలో చేరాడు. ప్రస్తుతం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

అవార్డులు

 • 2003లో మిడ్జిల్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
 • 2005లో మహబూబ్ నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
 • 2006లో గీతామిత్ర అవార్డు
 • 2014లో నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికయ్యారు[2].

రచనలు

 • ఉర్కొండ ఆంజనేయస్వామి శతకం
 • శ్రీరామ శతకం
 • హనుమాన్ కందపద్య చాలీసా
 • జీవాత్మ శతకం
 • రఘురామ వరద శతకం
 • గడభీర రామ శతకం
 • రఘురామదాసు భజన కీర్తనలు
 • హనుమంతుడి ఆదర్శం
 • చదువుల శతకం (2014)

మూలాలు

 1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్ సెంటర్ పేజి, తేది: 02.01.2014
 2. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో చివరి పేజి(16), తేది.04.09.2014

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).