"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కర్నూలు జిల్లా

From tewiki
Jump to navigation Jump to search


లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

కర్నూలు జిల్లా
.
.
Kurnool in Andhra Pradesh (India).svg
దేశంIndia
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
ప్రధాన కేంద్రంకర్నూలు
జనాభా
(2011)
 • మొత్తం40,46,601
 • సాంద్రత229/km2 (590/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
అక్షరాస్యత61.13
పురుషుల అక్షరాస్యత71.36
స్త్రీల అక్షరాస్యత50.81
లోకసభ నియోజక వర్గంకర్నూలు లోకసభ నియోజకవర్గం
జాలస్థలిhttps://kurnool.nic.in/te/
దస్త్రం:Kurnool 02.JPG
బస్టాండు ఎదుట కర్నూలు పట్టణం దృశ్యం

కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజధాని. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు, హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇళ్ళు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లోను నీరు ఒకే మట్టంలో ఉంటుంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది. Lua error in మాడ్యూల్:Mapframe at line 696: attempt to index field 'wikibase' (a nil value).

జిల్లా చరిత్ర

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

జిల్లా చరిత్ర

1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. గియాసుద్దీన్ జయించిన ఈ ప్రాంతానికి ఔరంగజేబు మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు. 1733లో అతని మరణానంతరం పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ మొదటి కర్నూలు నవాబుగా పాలకవంశాన్ని ప్రారంభించారు. ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

దస్త్రం:Abdul wahab khan tomb Kurnool.jpg
1618లో హంద్రీ నది ఒడ్డున నిర్మించిన కొండారెడ్డి బురుజు[1]

1751లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

1733 నుంచి 1838 వరకూ కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబుల యొక్క రాజ్యభాగంగా ఉండేది. ఈ నవాబులు మొదట మొఘల్ సామ్రాజ్యానికి, ఆపైన క్రమంగా మైసూరు సామ్రాజ్యం, హైదరాబాద్ సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీలకు సామంతునిగా వ్యవహరించారు. 1838లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది[2]. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉంది. 1947లో భారత దేశ స్వాతంత్ర్యానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

భౌగోళిక స్వరూపం

ఆర్ధిక స్థితి గతులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలాగే కర్నూలు జిల్లాలో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి.

ఇక్కడ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయాల కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. ఇక్కడ బేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది. ఇళ్లలో ఫ్లోరింగుకు ఉపయోగించే నాపరాయి కూడా ఇక్కడ విరివిగా లభిస్తుంది. ఇక్కడ లభించే సున్నపురాయి ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాణ్యం సిమెంట్ స్దాపించింది.

టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చెప్పుకోదగిన వ్యాపార సంస్థలు. తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టిలో కొంత భాగం కర్నూలు భూభాగంలోనే ఉంది.

కర్నూలు ఎ.పి.ఎస్.ఆర్.టీ.సీ బస్టాండు రాష్ట్రములో మూడో పెద్ద బస్టాండు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రములో రెండో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.

ఖనిజములు

ముగ్గురాయి, రంగురాయి, సీసము మొదలగు ఖనిజములు జిల్లాలో లభ్యమగును. పూర్వము రత్నాలకోట (ప్రస్తుత రామళ్ళకోట), జొన్నగిరి గ్రామాలలో రత్నములు లభ్యమయ్యేవి.[3][4]

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

భౌగోళికంగా కర్నూలు జిల్లాను 54 రెవిన్యూ మండలాలుగా విభజించారు[5]. (గతిశీల పటము)

కర్నూలు జిల్లా మండలాలు
కర్నూలు జిల్లా రెవిన్యూ విభాగాలు

1.కౌతాళం మండలం

2.మకోసిగి మండలం

3.మంత్రాలయం మండలం

4.నందవరము మండలం

5.సి.బెళగల్‌ మండలం

6.గూడూరు మండలం

7.కర్నూలు మండలం

8.నందికోట్కూరు మండలం

9.పగిడ్యాల మండలం

10.కొత్తపల్లె మండలం

11.ఆత్మకూరు మండలం

12.శ్రీశైలం మండలం

13.వెలుగోడు మండలం

14.పాములపాడు మండలం

15.జూపాడు బంగ్లా మండలం

16.మిడ్తూరు మండలం

17.ఓర్వకల్లు మండలం

18.కల్లూరు మండలం

19.కోడుమూరు మండలం

20.గోనెగండ్ల మండలం

21.యెమ్మిగనూరు మండలం

22.పెద్ద కడబూరు మండలం

23.ఆదోని మండలం

24.హోళగుంద మండలం

25.ఆలూరు మండలం

26.ఆస్పరి మండలం

27.దేవనకొండ మండలం

28.క్రిష్ణగిరి మండలం

29.వెల్దుర్తి మండలం

30.బేతంచెర్ల మండలం

31.పాణ్యం మండలం

32.గడివేముల మండలం

33.బండి ఆత్మకూరు మండలం

34.నంద్యాల మండలం

35.మహానంది మండలం

36.శిరివెళ్ళ మండలం

37.రుద్రవరము మండలం

38.ఆళ్లగడ్డ మండలం

39.చాగలమర్రి మండలం

40.ఉయ్యాలవాడ మండలం

41.దొర్నిపాడు మండలం

42.గోస్పాడు మండలం

43.కోయిలకుంట్ల మండలం

44.బనగానపల్లె మండలం

45.సంజామల మండలం

46.కొలిమిగుండ్ల మండలం

47.ఔకు మండలం

48.ప్యాపిలి మండలం

49.డోన్ మండలం

50.తుగ్గలి మండలం

51.పత్తికొండ మండలం

52.మద్దికేర తూర్పు మండలం

53.చిప్పగిరి మండలం

54.హాలహర్వి మండలం

రవాణా వ్వవస్థ

1985 నాటికి ఈ జిల్లాలో 2209 కి.మీ. ప్రభుత్వ రహదార్లు, 2146 కి.మీ. జిల్లా పరిషత్ రహదారులు, 1883 కి.మీ. సమితి రోడ్లు ఉన్నాయి.

జనాభా లెక్కలు

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లా జనాభా
24,07,299, స్త్రీ పురుషుల నిష్పత్తి: 983:1000, అక్షరాస్యత శాతం, 28.42. మూలం.... ఆంధ్రప్రధేశ్ దర్శిని, 1985.

సంస్కృతి

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి గోల్ గుమ్మజ్.
Tomb of Abdul Wahab Khan

పశుపక్ష్యాదులు

1830ల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో కర్నూలు జిల్లా గురించి నాటి విశేషాలు నమోదు చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అడుగుపెట్టింది మొదలు ఆవులకు పాలు తీయడం చూడలేదన్నారు. ఆయన ఈ విషయాన్ని గురించి ఇట్లా వ్రాసుకున్నారు: కడప విడిచిన తర్వాత ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని యితర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టు చున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పశువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరు సీమనుంచి తెచ్చేవారి వద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికేగాని అచ్చటి దున్నలు ఆ భూమిని నిగ్గి దున్ననేరవు. తడవకు 10 నుంచి 20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. సాధారణంగా ఆవులను పాల కోసమో లేక, ఎద్దుల కోసమో పెంచుతూండే అలవాటు వాడుక. ఇది చాలా విచిత్రమైన సంగతిగా చెప్పుకోవాలి[6].

కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంతరించిపోతున్న బట్టమేక పక్షులకు ఆవాసము.

విద్యాసంస్థలు

  • శ్రీ నీలకంఠేశ్వర పారిశ్రామిక శిక్షణా సంస్ట, ఎమ్మిగనూరు
  • రాయలసిమ విశ్వవిద్యాలయ০

ఆకర్షణలు

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు
దస్త్రం:Kurnool 26.JPG
కర్నూలులోని చారిత్రక కొండారెడ్డి బురుజు

కర్నూలులో చూడవలసినవి

ప్రముఖవ్యక్తులు

కొన్ని గణాంకాలు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-23. Retrieved 2007-07-26.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  3. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 545
  4. సురవరం, ప్రతాపరెడ్డి (1949). "Wikisource link to 6 వ ప్రకరణము". Wikisource link to ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వికీసోర్స్. Wikisource page link 337. 
  5. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కర్నూలు జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-27 at the Wayback Machine.. జూలై 26, 2007న సేకరించారు.
  6. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

బయటి లింకులు

మూస:ఆంధ్ర ప్రదేశ్