"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కర్ర

From tewiki
Jump to navigation Jump to search
టేకు కర్ర ఉపయోగించి కర్రసాము చేస్తున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి వెనుక వైపు ఉన్న అనేక టేకు చెట్ల వరుసను టేకు కర్ర అంటారు.

చేతితో పట్టుకునేందుకు అనువుగా, చక్కగా, పొడవుగా, స్థూపకారంలో ఉన్న కొట్టి వేయబడిన వృక్ష సంబంధిత మొదలను, కొమ్మలను కర్రలంటారు. కర్రను ఆంగ్లంలో స్టిక్ అంటారు.

నివాసం కొరకు

పూరిల్లు, పందిర్లు నిర్మించేటపుడు అనేక కర్రలు అవసరమవుతాయి. వీటి నిర్మాణానికి ఎక్కువగా చక్కగా, పొడవుగా పెరిగే అవిసె కర్రలను ఉపయోగిస్తారు, అవిసె కర్రలు తక్కువ బరువు ఉండటం వలన ఈ కర్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

కంచె కర్ర

పంట రక్షణ కొరకు, హద్దులు గుర్తు పట్టటం కోసం పొలం చుట్టూ నాటిన చెట్లను కర్ర అంటారు. ఉదాహరణకు పొలం చుట్టూ నాటిన తాటి చెట్లను తాటికర్ర అంటారు.

కర్ర సాము

ప్రధాన వ్యాసం కొరకు చూడండి కర్ర సాము

కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చూడండి

మొద్దు

కర్ర బిళ్ళ

గుంజ

బయటి లింకులు