"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కవి

From tewiki
Jump to navigation Jump to search

దస్త్రం:Kavi-Te.ogg కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.

చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి

కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...

తిక్కన

జంట కవులు

ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.

భారత కవులు

సంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు భారత కవులు.

రామాయణ కవులు

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.

అన్నమయ్య

శివ కవులు

శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.

ప్రబంధ కవులు

16 వ శతాబ్దిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు అల్లసాని పెద్దన.

పద కవులు

శతక కవులు

వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు .

శ్రీశ్రీ

జాతీయోద్యమ కవులు

భావ కవులు

ఆవంత్స సోమసుందర్

అభ్యుదయ కవులు

వంగపండు ప్రసాదరావు

దిగంబర కవులు

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ

తిరుగబడు కవులు

విప్లవ కవులు

గుర్రం జాషువా

నయాగరా కవులు

చేతనావర్త కవులు

గరిమెళ్ల సత్యనారాయణ

అనుభూతి కవులు

పైడి తెరేష్ బాబు

స్త్రీవాద కవయిత్రులు

దళితవాద కవులు

ముస్లిం మైనార్టీవాద కవులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).