"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కాంతి వ్యతికరణం
రెండు కాంతి తరంగాలు ఒకదాని పై మరొకటి అధ్యారోపణం చెందినప్పుదు ఫలిత కంపన పరిమితి లేదా తీవ్రత అధ్యారోపనం జరిగిన ప్రదేశంలో వివక్త తరంగాల కంపన పరిమితులు లేదా తీవ్రతలు కంటే భిన్నంగా ఉంటుంది. అధ్యారోపణం జరిగిన ప్రాంతంలో తీవ్రత పంపిణీలో కల్గే ఈ మార్పును వ్యతికరణం అంటారు.
సంపోషక వ్యతికరణం
రెండు కాంతి తరంగాలు అధ్యారోపణం చెందినప్పుదు అధ్యాపరోపణం ప్రాంతంలోని ఫలితకంపన పరిమితి వివక్త తరంగాల కంపన పరిమితుల మొత్తానికి సమానం అయితే ఆ వ్యతఇకరణాన్ని సంపోషక వ్యతికరణం అంటారు
వినాశక వ్యతికరణం
రెండు కాంతి కిరణాలు అధ్యారోపణం చెందినప్పుడు ఫలిత అధ్యారోపణ ప్రాంతంలో కంపన పరిమితి వివక్త తరంగాల కంపన పరిమితుల భేదానికి సమానం అయితే, ఆ వ్యతికరణాన్ని వినాశక వ్యతికరణం అంటాం.
నీటి ఉపరితలంపై వ్యతికరణం
నిశ్చలంగా ఉండే నీటి ఉపరితలంపై ఒక సూదిని, పైకి, కిందకి కంపనం చెందే విధంగా చేసినట్లయితే, వ్రుత్తాకార తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలు పురోగమనం గావిస్తాయి. వీటిని తిర్యక్ తరంగాలు అంటాం. సూది పౌనఃపున్యం v తో కంపనం చేస్తే, తరంగం యొక్క తరంగధైర్ఘ్యం V/v గా ఉంటుంది. ఇక్కడ 'V' తరంగం వేగం.