"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కాకునూరి సూర్యనారాయణ మూర్తి

From tewiki
Jump to navigation Jump to search
Dr. Kakunuri Suryanarayana Murthy
డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి
జననం(1967-08-16)ఆగస్టు 16, 1967
గ్రామం : కాకునూర్, మండలం : కేశంపేట, మహబూబ్ నగర్ : జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిసహాయ ఆచార్యులు
ప్రసిద్ధిఆధ్యాత్మిక ప్రవచనకర్త
మతంహిందూ
తండ్రికాకునూరి నార్ల వెంకటరమణ శాస్త్రి
వెబ్‌సైటు
http://ksnmurthy.blogspot.in/

కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త. వృతి రీత్యా కళాశాల సహాయ ఆచార్యులు.

జీవిత విశేషాలు

బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు శ్రావణ శుద్ధ ఏకాదశి ప్లవంగ నామ సంవత్సరం1967 ఆగస్టు 16న జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కాకునూర్ వీరి స్వగ్రామం ఇప్పుడు ఈ గ్రామం రంగారెడ్డి జిల్లాలో ఉంది. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ లాక్షణికుడైన కాకునూరి అప్పకవి వంశానికి చెందిన వారు కావడంతో సహజంగానే వీరిది పండిత వంశం.

విద్యాబ్యాసం

తండ్రిగారైన బ్రహ్మశ్రీ కాకునూరి నార్ల వెంకట రమణ శాస్త్రి గారు క్రమ పాఠి వేదపండితులు కావడంతో వీరి విద్యాభాస్యం తండ్రి గారి వద్దనే కొనసాగింది. కృష్ణ యజుర్వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రం వీరికి తండ్రిగారి వద్దనుండి అబ్బిన వారసత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే పురాణప్రబోధ పరీక్షలో తన పదమూడవ యేటనేమొదటి తరగతిలో ఉత్తీర్ణులై చిన్న నాటి నుండే తనలోని ప్రవచన కాలనీ లోకానికి చాటి చెప్పారు. కాకానురి సూర్యనారాయణ మూర్తి గారు తెలుగు, జ్యోతిష్యం, వాణిజ్య శాస్త్రం, ఇలా మూడు భిన్న మార్గాలలో స్నాతకోత్తర విద్య పూర్తి చేసి, తెలుగులో ప్రాచీనాంధ్ర సాహిత్యంపై మక్కువతో ప్రాచీన కావ్యాలు - ఉపాఖ్యాన రామకథ అనే అంశంఫై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేసి గత రెండున్నర దశాబ్దాల నుండి బద్రుక కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా శాఖాధిపతిగా తెలుగు భాషకు సేవలందిస్తున్నారు

సాహిత్య ప్రస్థానం

కాకునూరి సూర్యనారాయణ మూర్తి బహుగ్రంథ కర్తలు. ఉపాఖ్యాన రామకథ, కాకనూరి రామాయణం, మన సంస్కారాలు, యదార్థ వాల్మీకి రామాయణము, హిందూ దేవతలు - నైవేద్యాలు అనే వాటితో పాటు ఇండియన్ హెరిటేజ్ & కల్చర్ అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా రచించి హిందూ ధర్మంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సుప్రసిద్ధ మూసి పత్రికలో పది సంవత్సరాలు క్రమం తప్పకుండా యాత్ర అనే పేరిట వంద వ్యాసాలు ప్రకటించారు. ఇదికాక దిన, వార, మాస పత్రికలలో వీరి వ్యాసాలు లెక్కకు మిక్కిలిగా ప్రచురింపబడ్డాయి.

ఆధ్యాత్మిక ప్రస్థానం

ఒక దశాబ్దం నుండి ప్రతి రోజు వివిధ టివి చానళ్లు వీరి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతిరోజూ ప్రసారం చేస్తున్నాయి. ఉదయం 05.30 నిమిషాలకు ఎన్ టివి ఉదయం 07.00 గంటలకు, భక్తి టివిలో ఉదయం 07.00 గంటలకు శుభదినం, ఉదయం 08.00 ఈటీవీలో జాతక దోషాలు పరిహారాలు, సాయంత్రం 08.00 గంటలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో భక్తి చైతన్యం అనే పేరిట కార్యక్రమాలు ప్రసారం అవుతుండగా, వీటికి తోడు ధర్మసందేహాలు ఆదివారం దూరదర్శన్ యాదగిరిలో 09.00 గంటల నుండి 10.00 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే భక్తి టివిలో కూడా వీరి ధర్మసందేహాలు కార్యక్రమం సుప్రసిద్దం. వేలాదిగా వీరి సంక్షిప్త ప్రసంగ పాఠాలు యూట్యూబ్ లో చూడవచ్చు. రామోపాసకులైన వీరి తండ్రి గారి మార్గంలోనే, వీరు ప్రయాణిస్తూ తమ గ్రామంలో రామాలయం, హనుమదాలయం నిర్మించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు.

ప్రవచనాల జాబితా

 1. NTVలో ఉదయం 05 .30 శుభదినం
 2. భక్తి టీవీలో ఉదయం 07.00 అర్చన శుభదినం
 3. ఈటివిలో ఉదయం 08.30 జాతకదోషాలు - పరిహారాలు
 4. దూరదర్శన్ లో ప్రతి ఆదివారం ఉదయం 07.30 అగ్నిపురాణం.
 5. దూరదర్శన్ లో సోమ,మంగళ ,బుధ వారాల్లో 08,00 లకు పురాణ గాధా లహరి, భక్తి చైతన్యం పురాణం కథలకు ఆధునిక వ్యాఖ్యానం.
 6. ధర్మసందేహాలు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 1000 ఎపిసోడ్స్.

రచనల జాబితా

 1. రామకథ
 2. కాకునూరి రామాయణం
 3. మన సంస్కారాలు
 4. హిందూ దేవతలు నైవేద్యాలు
 5. యదార్థ వాల్మీకి రామాయణము

అందుకున్న పురస్కారాలు

 • ఉత్తమ ఆచార్య - లైన్స్ క్లబ్
 • ఆధ్యాత్మిక యాత్రికులు - అభినందన సంస్థ
 • జ్యోతిష బందు - జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ
 • జ్యోతిష భూషణ - జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ

ఇతర లింకులు

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).