"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కాప్రా చెరువు

From tewiki
Jump to navigation Jump to search
కాప్రా చెరువు
దస్త్రం:Kapra Cheruvu.jpg
కాప్రా చెరువు
స్థానంహైదరాబాద్, తెలంగాణ భారతదేశం
భౌగోళికాంశాలు17°29′44″N 78°33′10″E / 17.49558°N 78.55278°E / 17.49558; 78.55278
సరస్సు రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం113 ఎకరం (46 హె.)
సరాసరి లోతు547.873 మీ. (1,797.48 అ.)
గరిష్ఠ లోతు551.614 మీ. (1,809.76 అ.)
ఉపరితల ఉన్నతి1,759 అ. (536 మీ.)
స్థావరాలుకాప్రా, సైనిక్ పురి మరియు ఏ.ఎస్.రావు నగర్


కాప్రా చెరువు (ఒపేరా చెరువు) గ్రేటర్ హైదరాబాదుకు ఈశాన్యభాగంలో సైనిక్ పురి సమీపంలో ఉన్న చెరువు.[1] ఈ చెరువు పొడవు 1254 మీటర్లు ఉంటుంది. పాలాలకు సాగునీరు అందించడంలోను, భూగర్భ జలాల పరిరక్షణలోను ఈ చెరువు ఒకప్పుడు కీలక భూమికను పోషించింది. అంతేకాకుండా ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా కూడా నిలిచింది.

నిర్మాణం

ఈ కాప్రా చెరువు రామకృష్ణాపురం చెరువు, నాగారంలోని అన్ననారాయణ్ చెరువు, యెల్లారెడ్డిగూడ యాదిబాయిగుంటకు అనుసంధానించబడి ఉంటుంది.

చరిత్ర

ఒక దశాబ్ధం క్రితం కాలుష్యరహితంగా ఉన్న ఈ చెరువు గతకొంతకాలంగా కలుషితమయింది. దాన వీర శూర కర్ణ సినిమా షూటింగ్‌ సమయానికి కాప్రా చెరువు 204 ఎకరాల విస్తీర్ణంతో ఉండేది.[2] ఇప్పుడు 123 ఎకరాలకు కుంచించుకు 2002లో నిర్వహించిన సర్వే ప్రకారం, 113 ఎకరాలలో ఉన్న చెరువు యొక్క ప్రాంతం, భూ ఆక్రమణల కారణంగా 70 ఎకరాలకు తగ్గింది.[3] ప్రస్తుతం ఈ చెరువు గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉంది. దాదాపు 160 గంగపుత్రుల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

మూలాలు

  1. "Kapra Lake in Hyderabad is now a cesspool".
  2. విశాలాంధ్ర (18 November 2012). "కాప్రా చెరువు కనుమరుగు!". టి.మల్కయ్య, కాప్రా. Retrieved 14 December 2017.
  3. "Save Kapra Lake". The Hans India.