"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎన్. సి. కారుణ్య

From tewiki
(Redirected from కారుణ్య)
Jump to navigation Jump to search
కారుణ్య
జననం (1986-03-01) మార్చి 1, 1986 (వయస్సు 35)[1]
హైదరాబాదు
వృత్తిగాయకుడు

ఎన్. సి. కారుణ్య (ఆంగ్లం:N. C. Karunya)సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. ఇతడు ఇండియన్ అయిడల్ (సీజన్ 2) లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తొలి జీవితం

కారుణ్య 1 మార్చి 1986 తేదీన హైదరాబాద్ లో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. నాలుగు సంవత్సరాల వయసునుండే సంగీతంలో శిక్షణ పొందాడు. మామయ్య ఎన్.సి.మూర్తి వద్ద 14 సంవత్సరాలకే కఠోరమైన శిక్షణ పొందాడు. ఇతడు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. చిన్నతనంలోనే చిరు సరిగమలు పేరుతో ఆల్బమ్ చేసాడు. దీనిని చిరంజీవి ఆవిష్కరించారు. తర్వాత ఈటీవీ లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురి ని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. సోనీ టెలివిజన్ లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ రెండవ సంచికలో పాల్గొని అశేష జనావళికి ప్రీతి పాత్రుడై రెండవ విజేతగా నిలిచాడు.

సినిమా పాటలు

 1. వంశం
 2. లగే రహో మున్నాభాయ్ (హిందీ, 2006)
 3. అశోక్ (2006)
 4. సైనికుడు (2006): ఓరుగల్లుకే పిల్లా
 5. చిరుత (2007)
 6. కంత్రి (2008): 123 నేనొక కంత్రి
 7. మర్యాద రామన్న (2010): అమ్మాయి కిటికీ పక్కన
 8. ఖలేజా (2010): ఓం నమో శివరుద్రాయ
 9. ఆరెంజ్ (2010): ఓల ఓలాల
 10. శక్తి (2011): యమగా ఉందే
 11. తీన్ మార్ (2011): వయ్యారాల జాబిల్లి
 12. సీమ టపాకాయ్ (2011): ధీరే ధీరే ధీరే దిల్లే
 13. భమ్ బోలేనాథ్ (2015): వన్స్ అపాన్ ఏ టైమ్, సేటుగర్

మూలాలు

 1. "ఎన్. సి కారుణ్య". littlemusiciansacademy.com. Archived from the original on 11 జూన్ 2019. Retrieved 9 July 2017. Check date values in: |archive-date= (help)