కార్మిక సంఘాలు

From tewiki
Jump to navigation Jump to search
1912 లో లారెన్స్ టెక్స్టైల్ స్ట్రైక్ సమయంలో సైనికులచే చుట్టుముట్టబడిన ప్రదర్శనదారులు.

పని చేయడానికి అనుకూల వాతావరణం వంటి సమష్టి లక్ష్యాల సాధనకు కార్మిక సమస్యలకు పరిష్కారం కొరకు కార్మికులందరూ కలిసి ఏర్పరుచుకునే సంఘాన్ని కార్మిక సంఘం అని అంటారు.[1] కార్మిక సంఘంలోని సభ్యుల తరఫున సంఘానికి చెందిన నేతలు, కార్మిక ఒప్పందాలకు సంబంధించి యజమానులతో చర్చలు జరుపుతారు. వేతనాలు, పని నిబంధనలు, ఫిర్యాదుల ప్రక్రియ, కార్మికులను పనిలో పెట్టుకునేందుకు సంబంధించిన నిబంధనలు, కార్మికుల పదోన్నతి, ఇతర ప్రయోజనాలు, పనిప్రాంతంలో భద్రత, ఇతర విధానాలకు సంబంధించి సాధారణంగా వీరు చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు, సభ్యులు, యజమానితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొన్ని సమయాల్లో కార్మికేతర సభ్యులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటారు.

తొలుత యూరోప్‌లో ప్రారంభమైన ఈ కార్మిక సంఘాలు పారిశ్రామిక విప్లవం సమయంలో ప్రపంచం మొత్తం ప్రాచుర్యం పొందాయి.అధిక శాతం పనుల్ని సమర్థంగా చేసే నైపుణ్యం కొరవడడంత ఉపాధికల్పన అనేది పూర్తిగా యజమానుల చేతిలోకి వెళ్లిపోయింది. ఫలితంగా చాలా మంది కార్మికులకు పరిశ్రమల్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అదే విధంగా వారికి అతి తక్కువ జీతాలు చెల్లించేవారు. కార్మిక సంఘాల్లో కార్మికులు, వృత్తి నిపుణులు, గతంలో పనిచేసిన కార్మికులు, నిరుద్యోగులు సభ్యులుగా ఉంటారు. " ఉద్యోగ వాతావరణాన్ని మెరుగుపరచి,దాన్ని కొనసాగించమే" కార్మిక సంఘాల ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు.[2]

గడిచిన మూడు వందల సంవత్సరాల కాలంలో వివిధ రూపాల్లో ఏర్పడ్డ ఎన్నో కార్మిక సంఘాలు మరెన్నో రాజకీయ కారణాల వల్ల ప్రభావితమయ్యాయి. కార్మిక సంఘాల యొక్క కార్యకలాపాలు సంఘాన్ని బట్టి మారుతుంటాయి . అయితే స్థూలంగా అవి దిగువ పేర్కొన్న పనులను చేపడతాయి.

 • కార్మిక సంఘ సభ్యులకు ప్రయోజనాల కల్పన తొలిదశలో ఏర్పడ్డ స్నేహ సమాజాలని పిలిచే కార్మిక సంఘాలు తమ సంఘంలోని సభ్యులకు బీమా నిరుద్యోగ భృతి ,అనారోగ్యం,వృద్ధాప్యం, అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చులకు సంబంధించి భద్రతను కల్పించగలిగాయి. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈ కార్యక్రమాలను ఆయా ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. అయితే వృత్తిపరమైన శిక్షణ, న్యాయపరమైన సలహాలు మరియు సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి లాభాలను ఇప్పటికీ కార్మిక సంఘాల్లోని సభ్యులు పొందుతున్నారు.
 • సమష్టి బేరసారాలు : కార్మిక సంఘాలు నిష్కపటంగా,స్పష్టంగా పనిచేస్తూ యాజమాన్య గుర్తింపు పొందినట్లయితే,వారు కార్మికుల వేతనాలు మరియు పనివాతావరణానికి సంబంధించి యాజమాన్యంతో చర్యలు జరుపుతారు.
 • పారిశ్రామిక చర్య: ప్రత్యేక లక్ష్యాల సాధనకు కార్మిక సంఘాలు సమ్మెకు దిగడం లేదా లాకౌట్లను ప్రతిఘటించడం చేస్తాయి.
 • రాజకీయ కార్యకలాపాలు: కార్మిక సంఘాలు తమ సభ్యులు లేదా మొత్తం మీద కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే చట్టాలకు మద్ధతు పలుకుతాయి. దీనికి సంబంధించి ప్రదర్శనలు నిర్వహించడం,లాబీయింగ్‌ చేయడం,వ్యక్తిగతంగా కొంతమంది సభ్యులు లేదా రాజకీయ పార్టీలకు ఆర్థికంగా మద్ధతునిస్తాయి.

చరిత్ర

కార్మిక సంఘాల ఉనికిని 18వ శతాబ్దంలో గుర్తించవచ్చు.ఆ సమయంలోనే పారిశ్రామిక సమాజం శరవేగంగా అభివృద్ధి చెందడంలో సమాజంలోని మహిళలు,చిన్నపిల్లలు, గ్రామీణకార్మికులు,వలసదారులను కొత్త పనివనరులుగా గుర్తించారు. ఫలితంగా పారిశ్రామిక అవసరాలు తీర్చే కొత్త పాత్రల్లో వీరు కుదురుకున్నారు.ఈ వర్గానికి చెందిన నైపుణ్యం లేని,ఓ మాదిరిగా నైపుణ్యం ఉన్న కార్మికులు తమకు తాముగా సంఘటితమై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, తిరగబడే ప్రయత్నం చేయడమే కార్మిక సంఘాల ఏర్పాటుకు నాందివాచకం పలికిందని చెప్పవచ్చు.[2] 19 శతాబ్దం చివరలో క్యాథలిక్‌ చర్చి కార్మిక సంఘాలను ఆమోదించింది. పోప్‌ లియో-13 తన ' మాగ్న కార్టా' - రీరమ్‌ నోవారమ్‌లో కార్మికుల అణచివేత, వివక్షకు సంబంధించి తొలిసారిగా తన గళం విప్పారు.కార్మికులకు కొన్ని హక్కులను కల్పించడంతోపాటు భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మూలాలు మరియు పూర్వ చరిత్ర

మధ్యయుగ కాలంలో యూరోప్‌లో బహూళ ప్రాచుర్యం పొందిన గైడ్స్ యొక్క వారసత్వ రూపమే కార్మిక సంఘాలని కొన్ని సందర్భాల్లో చెప్పవచ్చు.[3] మధ్యయుగం గైడ్లువృత్తిపని నైపుణ్యానికి సంబంధించిన బోధనా పెట్టుబడులను నియంత్రించడం, పని నేర్చుకునే దశ నుంచి సమర్థమైన వృత్తినిపుణులుగా సభ్యులు ఎదగడాన్ని ప్రోత్సహించడం, చిన్నాచితకా పనుల్లో కుదురుకోవడం ఆ తరువాత తమ తమ వృత్తుల్లో మాస్టర్లు, గ్రాండ్‌ మాస్టర్ల స్థాయికి ఎదిగేలా చూడటం ద్వారా తమ సంఘంలోని సభ్యుల జీవన ప్రమాణాల్ని పరిరక్షించేవారు. కార్మిక సంఘాల్లో ఒకేతరహా వృత్తి నైపుణ్యం ఉన్న సభ్యులుండవచ్చు లేదా విభన్న వృత్తుల్లో నిపుణులుగా ఉండవచ్చు. లేదా ఒకే కంపెనీ లేదా పరిశ్రమలో ఉన్న అందరూ సభ్యులు ఆ కార్మిక సంఘంలో సభ్యులుగా ఉండవచ్చు.

కింగ్‌డమ్‌ ఆఫ్‌ బ్రిటన్ లో ఆర్టినెన్స్‌ ఆఫ్‌ లేబరర్స్'‌' అనే చట్టాన్ని తీసుకురావడం ద్వారా కార్మిక సంఘాలు లేదా సమష్టిగా బేరసారాలు జరపడాన్ని 14వ శతాబ్దం మధ్యలో నిషేధించారు. ఆ తరువాత 19వ శతాబ్దం మధ్య వరకు కార్మిక సంఘాలను ఎక్కడ ప్రారంభించినా నిషేధిస్తూ వచ్చారు.

సిడ్నీ మరియు బెట్రైస్‌ వెబ్ లు రచించిన హిస్టరీ ఆఫ్‌ ట్రెడ్‌ యూనియనిజంలో కార్మిక సంఘాలను చారిత్రిక దృక్పథం అనే కోణంలో ఈ విధంగా నిర్వచించారు. తమ పనిలో మరింత నాణ్యమైన పరిస్థితులను మెరుగుపరచడానికి, వాటిని కొనసాగించడానికి జీతం పొందేవారంతా నిరంతరం కలిసి ఉండటమే అని పేర్కొన్నారు.[2] ట్రేడ్‌యూనియన్లకు ఆస్ట్రేలియన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆధునిక నిర్వచనాన్ని ఇచ్చింది. 'ప్రధానంగా సంస్థకు చెందిన ఉద్యోగులతో కూడిన సంస్థ యొక్క ప్రధాన కార్యకలాపం తన సభ్యుల యొక్క ఉపాధికి సంబంధించిన వేతనాలు మరియు పనివాతావరణానికి సంబంధించి యాజమాన్యంతో బేరసారాలు చేయడం' అని పేర్కొంది.[4]

అయితే చరిత్రకారుడు ఆర్‌.ఏ.లీసన్‌ యునైటెడ్‌ ఉయ్‌ స్టాండ్ ‌లో ఈ విధంగా అంటాడు.

Two conflicting views of the trade-union movement strove for ascendancy in the nineteenth century: one the defensive-restrictive guild-craft tradition passed down through journeymen's clubs and friendly societies, ... the other the aggressive-expansionist drive to unite all 'laboring men and women' for a 'different order of things'.

బాబ్ జేమ్స్ ట్రేడ్‌ యూనియన్లకు సంబంధించి ఇటీవల కాలంలో చారిత్రక పరిశోధనల సారమైన క్రాఫ్ట్‌, ట్రేడ్‌ అండ్ మిస్టరీ (2001)లో ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. మధ్యయుగం గైడ్లు, ఫ్రీమాసన్స్‌, ఆడ్‌ఫెలోలు, ఫ్రెండ్లీ సొసైటీలు లేదా ఇతర సోదర సంబంధం గల సంస్థలన్నీ కూడా సమాజ ప్రయోజనాలు ఆశించి సాగిన బృహత్‌ ఉద్యమాలలో భాగం' అన్న భావనను వ్యక్తం చేసింది.

18వ శతాబ్దపు ప్రముఖ ఆర్థికవేత్త ఆడమ్‌ స్మిత్‌ కార్మిక సంఘాల ఆవిర్భావానికి కార్మికుల హక్కులకు సంబంధించి అసమానతల వల్లే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి అంటాడు. ద వెల్త్‌ ఆఫ్‌నేషన్‌, బుక్‌ 1, చాఫ్టర్‌ ఆరులో:

We rarely hear, it has been said, of the combination of masters, though frequently of those of workmen. But whoever imagines, upon this account, that masters rarely combine, is as ignorant of the world as of the subject. Masters are always and everywhere in a sort of tacit, but constant and uniform combination, not to raise the wages of labor above their actual rate[.] When workers combine, masters ... never cease to call aloud for the assistance of the civil magistrate, and the rigorous execution of those laws which have been enacted with so much severity against the combination of servants, laborers, and journeymen.

దీనికి సంబంధించి స్మిత్‌ ఈ విధంగా రాసాడు. చాలా దేశాల్లో చాలా సంవత్సరాలపాటు కార్మిక సంఘాల ఏర్పాటు చట్ట వ్యతిరేకంగా ఉండేది. (సంప్థ యజమానులు లేదా ఉన్నతాధికారులు కార్మికులకు స్థిర వేతనాల్ని నిర్ణయించే విధానాలుండాలని స్మిత్‌ వాదించాడు). కార్మికసంఘాల ఏర్పాటు చేసి వాటిని నిర్వహించే వారికి తీవ్రమైన జరిమానాలు, శిక్షలు విధించేవారు. దీనికి భిన్నంగా కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. ఇవి క్రమేపీ రాజకీయ శక్తిని సంపాదించుకోవడం మొదలు పెట్టాయి. ఫలితంగా కష్టాలను నిర్వహించే చట్టబద్దమైన కార్మిక చట్టం యొక్క ప్రధాన భాగంగానే కాకుండా సంఘాలుగా ఏర్పడ్డ ఉద్యోగులు మరియు యజమానుల మధ్య దృఢమైన సంబంధానికి దారి తీసాయి.

కార్మిక సంఘాలకు సంబంధించిన చట్టబద్ధతపై వ్యతిరేకత వచ్చినప్పుడు టోల్‌పుడెల్‌ మార్టియర్స్ దీన్ని చూపారు.

కార్మిక సంఘాల్లో చేరే హక్కు గురించి యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్ (UDHR‌) ఆర్టికల్‌ 23లోని నాలుగో సబ్‌సెక్షన్‌లో ప్రస్తావించబడిరది. ఆర్టికల్‌ 20లోని సబ్‌సెక్షన్‌ రెండులోనూ దీనికి గురించి చెప్పబడిరది. ఏ ఒక్కరూ కూడా కార్మిక సంఘంలో చేరాలని ఒత్తిడి చేయకూడదు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని, కార్మిక సంఘంలో చేరడాన్ని నిషేధించడం లేదా బలవంతంగా ఆ పనిచేయాలని ( ఉదాహరణకు క్లోజ్డ్‌ షాప్స్‌ లేదా యూనియన్‌ షాప్‌. కింద చూడండి) ప్రభుత్వాలు లేదా పరిశ్రమలు ఒత్తిడి పెట్టినట్లయితే అది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంది. ఏవరైనా కార్మిక సంఘంలో సభ్యత్వం ఉందన్న కారణంగా యజమానులు వివక్ష కనపరిస్తే వాటిని సరిచేయాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో యజమానులు బయటవారి సాయంతో కార్మిక సంఘాల్లో సభ్యత్వాలను నిరోధించడానికి ప్రయత్నిస్తే.. దాన్ని యూనియన్‌ బస్టింగ్‌ అంటారు.

ఐరోపా

ఫ్రాన్స్‌, జర్మనీ మరియు ఇతర యూరోపియన్‌ దేశాల్లో 1870 తరువాతి కాలంలో సోషలిస్టు మరియు డెమెక్రాటిక్‌ పార్టీలు కార్మిక సంఘాల స్థాపన,వాటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. బ్రిటిష్‌ అనుభవాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. మితవాద భావజాలం ఉన్న సరికొత్త యూనియన్లు 19వశతాబ్దం మధ్యకాలంలో పూర్తిగా ఆధిపత్యాన్ని కనపరిచాయి.20వశతాబ్దపు తొలిరోజుల్లో లేబర్‌ పార్టీ ఏర్పడే వరకు కూడా రాజకీయ పక్షాలు నిర్వహించే కార్మిక ఉద్యమాల కంటే కార్మిక సంఘ భావనే బలంగా ఉండేది.

సంయుక్త రాష్ట్రాలలో సంఘాలు

19వ శతాబ్దపు అమెరికన్ యూనియిజం

1800 సంవత్సరాల ప్రారంభంలో పెద్దపెద్ద నగరాల్లో అనేక మంది వ్యక్తులు ఇప్పుడు మనం పిలిచే కార్మిక సంఘాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు వృత్తిపరంగా అనుభవం, నైపుణ్యం కలవారు, తమ పనిని మరింత సమర్థంగా చేయగలవారే. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం సమ్మెలు చేయడానికే. వారి కోరికలు తీర్చడానికి సరిపడ సభ్యులు లేకపోవడంతో ఇలాంటి ఆకర్షణీయమైన ఉద్యమాలను ప్రారంభించిన సంస్థలు అతి తక్కువ కాలంలోనే కుప్పకూలిపోయాయి. ఆ తరువాత మెకానిక్స్‌ యూనియన్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ కార్మికులను సంఘటితం చేయడానికి ప్రయత్నించింది.

1827లో ప్రారంభించిన అమెరికాలోని తొలి కార్మిక సంఘమైన ఈ యూనియన్‌ విభిన్న రకాల వృత్తికార్మికులను సంఘటితం చేసింది. "అమెరికన్‌ కార్మికులకు సంబంధించిన నగర ఆధారిత ఈ సమాఖ్య, కార్మికులకు సంబంధించి వారివారి ట్రేడులకు అతీతంగా ఉమ్మడి సమస్యలుంటాయని గుర్తించింది. వాటిని ఏకీకృత చర్యల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోవచ్చంది."[5] ఫిలడెల్ఫియాలోని వండ్రంగి పనివారు తమ వేతనాలు, పనిగంటల్ని నిరసిస్తూ సమ్మెకు దిగడంతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ సంస్థ చేపట్టే చర్యలకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చంది.


history.com: ఆధారంగా [6]

Besides acting to raise wages and improve working conditions, the federations espoused certain social reforms, such as the institution of free public education, the abolition of imprisonment for debt, and the adoption of universal manhood suffrage. Perhaps the most important effect of these early unions was their introduction of political action.

ఒక సంఘంగా ఉంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో మెకానిక్స్‌ అసోసియేషన్‌ కార్మికులు అర్థం చేసుకున్నారు. పలువురు ఇదే బాటలో నడిచారు. తమ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయన్న ఆశను ఈ సమ్మె ఇతరులలోనూ కలిగించింది. దీనికి ముందు ఎలాంటి సంఘాలు లేకపోవడంతో చాలా మంది ప్రజలు తమ సమస్యల గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. కార్మికులు తమ మనస్సులో మాటలను బహిర్గతం చేయడానికి, వాటిని సాధించుకోవడానికి సమ్మె అనేది ఓ సరికొత్త మార్గమైంది.


కార్మిక సంఘ ఉద్యమంపై ప్రభావం చూపిన మరో సంఘం గ్రాండ్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ సమాఖ్య. 1834లో ఏర్పడ్డ ఈ అసోసియేషన్‌ను తొలి దేశీయ సంస్థగా చెప్పవచ్చు. 1837 దుర్ఘటన కారణంగా ఇది అతి తక్కువ కాలం మనగలిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ పరపతి, ఆర్థిక అవకాశాలకు సంబంధించి మరింత నియంత్రణ ప్రదర్శించడం ద్వారా సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆండ్రూ జాక్సన్‌ భావించాడు. దీన్ని మూసేయించడంలో విజయం సాధించాడు. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకులు పరపతి విధానంలో నిర్లక్ష్య వైఖరిని అవలంభించడంతో.. వెస్ట్రన్‌ ల్యాండ్‌ ప్రాంతంలో తీవ్ర స్పెక్యులేషన్‌కు దారి తీసింది. వాన్‌ బరన్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయయి.

కొన్ని మూసేయడం ప్రారంభించాయి. వ్యాపారాలు తీవ్ర నష్టాలు చవిచూశాయి. వేలమంది ప్రజలు తమ భూములు కోల్పోయారు.[7] ఆర్థిక సాయం అందించే సంస్థలు కుప్పకూలడంతో వ్యాపారాలు కుప్పకూలాయి. ఫలితంగా కార్మికులు నిరుద్యోగులయ్యారు. 1837 దుర్ఘటన ప్రభావం పడిన ఎక్కువ మంది కార్మికులు ఈ యూనియన్‌లో సభ్యులే. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో సంఘ సభ్యులను ఏకీకృతం చేసి ఒకేతాటపై నిలపడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో సంఘం కార్యకలాపాలు నిలిచిపోయాయి. 1840 ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలు ఎక్కిన తరువాత కార్మిక సంఘాలు తిరిగి సమర్థంగా పనిచేయడం ప్రారంభించాయి. గతంలో వాటికి భిన్నంగా ఒకే తరహా వృత్తి చేసే వారిని సభ్యులుగా చేర్చుకునే నేషనల్‌ లేబర్‌ యూనియన్లు ప్రారంభమయ్యాయి.
అంతర యుద్ధ ప్రభావం పనిచేసే వర్గాలపై తీవ్రంగా పడింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పయనించడంతో చాలా మంది కార్మికులకు ఉపాధి లభించింది. ఆర్థిక పురోభివృద్ధి కారణంగా యూనియన్లు గణనీయంగా పెరిగాయి. 1860,70ల తొలినాళ్లలో సుమారు 30 వృత్తులకు సంబంధించిన నేషనల్‌ క్రాఫ్ట్‌ యూనియన్లు ఏర్పడ్డాయి.[6] ఈ సమయంలో ఏర్పడ్డ అత్యంత ప్రభావశీలియైన యూనియనే నేషనల్‌ లేబర్‌ యూనియన్‌(NLU). దీన్ని 1866లో ప్రారంభించారు. అనేక వృత్తులకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు.[8] ఇది చాలా తక్కువ కాలం మనగలిగినప్పటికీ, భవిష్యత్తు అమెరికన్‌ యూనియన్లకు ఎన్‌ఎల్‌యూ బాటలు పరిచింది. ఎన్‌ఎల్‌యూ కనుమరుగైన తరువాత 1860 ప్రాంతంలలో నైట్స్‌ ఆఫ్‌ లేబర్‌ అమెరికాలో పెద్ద లేబర్‌ యూనియన్‌గా అవతరించింది. అయితే ఈ యూనియన్‌ చైనీయులను సభ్యులుగా చేర్చుకోలేదు. నల్లజాతి వారు, మహిళలకు పాక్షికంగా అవకాశం కల్పించారు.[9]

నైట్స్ ఆఫ్ లేబర్

1869లో ఫిలడెల్ఫియాలో యూరియా స్టీఫెన్‌ మరియు మరో ఆరుగురు సభ్యులు కలిసిద నోబుల్‌ అండ్‌ హెలీ ఆర్డర్‌ ఆఫ్‌ ద నైట్స్‌ ఆఫ్‌ లేబర్‌ అనే సంఘాన్ని ప్రారంభించారు.

పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులను వ్యవస్థీకృతం చేయడం, వారిలో అవగాహన పెంచడం, వారికి దిశానిర్ధేశం చేయడమే ఈ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం అని 1878లో లిఖించుకున్న తమ రాజ్యాంగంలో పేర్కొంది.[10] అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక లాభం చేకూర్చాలన్న భావనతో నైట్స్‌ ప్రజలను సమీకరించింది. తాను నిర్ధేశించుకున్న లక్ష్యాల పట్ల చిత్తశుద్ధిని కనపరిచింది. నాణ్యమైన పని, సామాజిక బాధ్యత, విద్య, వసుధైక కుటుంబం అనే భావన, పరిమితత్వం, నియంత్రణ, సంయమనం, సొంతంగా ఎదగడం లాంటివి దీన్ని లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.[11]

1881 వరకు ద నైట్స్‌ఆఫ్‌ లేబర్‌ ఓ రహస్య సోదర సంస్థగానే పనిచేసింది. 1870లో ఆర్థిక ఒడిదుడులు చోటుచేసుకోవడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ యూనియన్‌లో చేరడంతో ఇది నెమ్మదిగా వృద్ధి చెందింది. మిగతా ప్రజలకు, తమకు మధ్య ఓ స్పష్టమైన అంతరం ఉండాలన్న భావనతో కొన్ని నిర్ధిష్ట వర్గాలు, వ్యక్తులకు మాత్రమే తమ సంఘంలో చోటు కల్పించింది. బ్యాంకర్లు, స్పెక్యులేటర్లు, లాయర్లు, మధ్య అమ్మకపుదారులు, జూదగాళ్లు మరియు టీచర్లకు తమ సంఘంలో స్థానం కల్పించలేదు. వీరిని ఉత్పాదేతర వ్యక్తులుగా పేర్కొంటుంటారు. ఎందుకంటే వీరి ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేదు. ఫ్యాక్టరీ కార్మికులు, వాణిజ్యవేత్తలను ఉత్పాదకదారులుగా పేర్కొంటుంటారు. ఎందుకంటే వీరి ఉద్యోగాల్లో భౌతిక ఉత్పాదన ఉంటుంది. పనిని సృష్టించేవారికి వీరు తమ యూనియన్‌లోకి స్వాగతం పలికారు. 1883నాటికి మహిళలు, నల్లజాతి కార్మికులకు నైట్స్‌లో సభ్యత్వం కల్పించారు.[12] అయితే ఆసియావాసుల్ని మాత్రం మినహాయించారు. ఆసియా జనాభా లేకుండా చేయాలని 1885 నవంబరులో నైట్స్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ ముందుకొచ్చింది. చైనీయులను మినహాయించాలంటూ 1882లో చేసిన చట్టాలకు నైట్స్‌ గట్టిగా మద్దతు పలికింది. ఎందుకంటే ఆసియావర్గాలను క్షీణింపచేయడానికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడింది. ఈ చట్టం ప్రకారం కార్మికేతరులు ఎవరైతే అమెరికాలో ప్రవేశించాలనుకుంటారో... వారు ఇమిగ్రేషన్‌కు అర్హులన్న సర్టిఫికేట్‌ను చైనా ప్రభుత్వం నుంచి పొందాల్సి ఉండేది.

అయితే వారు కార్మికేతరులు అన్న విషయాన్ని రుజువు చేసుకోవడం కష్టమయ్యేది. ఎందుకంటే. 1882 నాటి చట్టం 'నైపుణ్యం ఉన్న వారితోపాటు నైపుణ్యం లేని వారు,గనుల్లో పనిచేసే చైనీయులను తొలగించాలని' పేర్కొంది. దీని ఫలితంగా 1882 చట్టానికి అనుగుణంగా చాలా తక్కువ మంది మాత్రమే అమెరికాలో ప్రవేశించగలిగారు.[13] ఎవరైనా ఆసియావాసి అమెరికాను విడిచిపెడితే తిరిగి ప్రవేశించాలంటే తిరిగి సర్టిఫికేట్‌ అవసరమని ఈ చట్టం పేర్కొంది.

ఆసియా వాసులకు తమ యూనియన్‌లోకి స్వాగతం పలకనప్పటికీ, ఈ సంఘంలో చేరిన నల్లజాతి కార్మికులు భారీ సంఖ్యలో నల్లజాతివారిని తెల్లజాతి వారి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. 1866 నాటికి ఈ యూనియన్‌లో మొత్తం 7,00,000 మంది ఉంటే వారిలో అరవై వేల మంది వరకు నల్లజాతీయులున్నారు. పక్షపాతం అనే గోడల్ని తాము బద్ధలుకొట్టినట్లు' నైట్స్‌ చెప్పేవారు. వర్ణవివక్ష అనే పొర చెరిగిపోయి తెల్ల, నల్ల జాతి వారు ఒకే అవసరంకోసం పనిచేస్తుండటమే దీనికి ఉదాహరణ అనే పేర్కొంది. నైట్స్‌ యొక్క భావజాలంతో విసిగివేసారి వారు శ్యాముల్‌ గోంపర్స్‌ స్థాపించిన ద అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌(AFL‌) చేరారు. AFL‌ చేరిన వారంతా నైట్స్‌ నుంచి తమకు తాముగా దూరమైన వారే.

జీతానికి పనిచేసే అమెరికన్‌ కార్మికులంతా ముందు జీతగాళ్లు, ఆ తరువాతే వారు గోడకట్టేవారైనా, వడ్రంగి అయినా, గని కార్మికుడైనా, అని నైట్స్‌ తెలియజెప్పడానికి ప్రయత్నించేది. ఏనాటికైనా సాధ్యమవుతుందా అన్న ఆశ ఏ మాత్రం లేని విషయాల గురించి నైట్స్‌ తెలియజెప్పడానికి ప్రయత్నించిదని అర్థం. కానీ AFL‌ మాత్రం వడ్రంగులు, గోడలు కట్టేవారు ఇలా వారి వారి వృత్తుల ద్వారానే గుర్తించింది. ముందుగా తమ సొంత వృత్తికి సంబంధించిన ఆసక్తులు ప్రధానం అని మిగతా కార్మికుల వ్యవహారం తరువాత అని చెప్పింది.[14] AFL‌లో కేవలం కార్మికులతో ఏర్పడ్డ అసోసియేషన్స్‌కు మాత్రమే అనుమతించేంది. కార్మికులకు మాత్రమే ఇందులో చేరే అవకాశం ఉండేది. అయితే దీనికి భిన్నంగా నైట్స్‌లో చిన్న వ్యాపారాల వారిని కూడా అనుమతించే వారు. చిన్న వ్యాపారం అంటే స్వంతంగా కలిగి, స్వంతంగా నిర్వహించుకునే వ్యాపారం. తన రంగంలో ఇది ఇతరులకు ఏ మాత్రం పోటీ కాదు. స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగా ఉద్యోగులు, వార్షిక ఆదాయం కలిగి ఉన్నవాటిని చిన్న వ్యాపార సంస్థలు అంటారు.[15] నైట్స్‌ ఇలాంటి బృందాల సభ్యులకు తమ అసోసియేషన్‌లో స్థానం కల్పించారు. వారు తమ సంఘంలో ఇమడలేరని భావించి వీరిలో చాలామందిని తొలగించింది. అయితే ALF‌ మాత్రం ఇలాంటి వారికి తమ సంఘంలో తక్షణం స్థానం కల్పించింది. ఈ విధంగా ఏఎఫ్‌ఎల్‌ నైట్స్‌ను దెబ్బతీయగలిగింది. ఎవరైనా ఒక అసోసియేట్‌ నైట్స్‌ సభ్యుడు కాదని చెబితే తక్షణం అతడిని వేధించి మరీ ఏఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు అప్పగించే వారు. చాలా సందర్భంలో నైట్‌గా ఉన్న వారికి సైతం ఈ సంస్థలో పదవులు కట్టబెట్టారు. దీంతో విభిన్న రకాల వ్యక్తులతో ALF‌ బలంగా ఎదగడానికి కారణమైంది.

కొంత మంది నల్లజాతి సభ్యులను తొలగించడం ద్వారా ALFలో భిన్నత్వం లోసుగులు బయట పడ్డాయి. గోపర్స్‌ తన యూనియన్‌లో కేవలం నైపుణ్యమున్న కార్మికులే ఉండాలని కోరుకున్నాడు. అయితే నల్లజాతీయుల్లో చాలా మంది నైపుణ్యం లేని వారిగా పరిగణించే వారు. దీనికి సంబంధించి నల్లజాతీయులను కేవలం వారి జాతి కారణంగా తొలగించలేదని, కేవలం వారు వృత్తిపరమైన నైపుణ్యం లేకపోవడం వల్లనే అనర్హులుగా పరిగణిస్తూ తొలగించామని ALF వివరణ ఇచ్చింది.

జీతాల విషయానికి వస్తే అవి పెరిగాయి. పరిశ్రమల్లో పనిగంటలు తగ్గాయి. కార్మికుల భద్రత కూడా పెరిగినట్లుగానే కనపడింది. అదే సమయంలో ఏఎఫ్‌ఎల్‌ మిలియన్ల కొద్ది కార్మికుల్ని దైన్యస్థితిలోకి నెట్టి తాను మాత్రం బలంగా ఎదిగింది.[16] నల్లజాతీయులు నైపుణ్యం గల కార్మికులైనప్పటికీ వారిని యూనియన్‌ నుంచి తొలగించింది. వలసదారులు, నల్లజాతీయుల్ని తొలగించడానికి ఇది భాషాపరీక్షలు సైతం పెట్టింది. 1940 వరకు కూడా ఇది అమెరికాలో ఓ ప్రభావశీల యూనియన్‌గా పరిగణించారు.

దీన్ని కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌లో విలీనం చేసే నాటికి యూనియన్‌లో మొత్తం పదిమిలియన్ల వరకు సభ్యులుండేవారు.

కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌

1924లో గోపర్స్‌ మృతి తరువాత ఎఎఫ్‌ఎల్‌లో సమస్యలు ఇంకా అలాగే ఉండటంతో జాన్‌ ఎల్‌. లూయిస్‌ సీఐవోను ఏర్పాటు చేశాడు. గోపర్స్‌ పెట్టిన అనేక నిబంధనలు తొలగించాలని చాలా మంది యూనియన్‌ సభ్యులు కోరారు. ఒక వృత్తికి సంబంధించి నైపుణ్యం ఉన్న కార్మికుని కంటే.. పెద్దగా అనుభవం లేని కార్మికునికి మద్దతుగా నిలవాలని వారు కోరారు. ALFలో ఈ విషయంపై 1935లో మొదట గళం విప్పిన వ్యక్తి జాన్‌ ఎల్‌. లూయిసే. ALF‌కు అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసిన కమిటీ ఫర్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌ యొక్క వ్యవస్థాపకుడు. కమిటీ ఫర్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషనే తరువాత దశలో కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌గా మారింది. అమెరికా చరిత్రలోనే కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌ అతి పెద్ద ప్రభావశీల సంఘంగా గుర్తింపు పొందింది.[17] 1930 తరువాత పలువిజయవంతమైన సమ్మెల ద్వారా ఇది పలువురి దృష్టిని ఆకర్షించింది. 1935 సంవత్సరంలో గుడ్‌ ఇయర్‌ టైర్‌ మరియు రబ్బర్‌ కంపెనీల కార్మికులు తమ సొంతంగా యునైటెడ్‌ రబ్బర్‌ వర్కర్స్‌ పేరిట యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రబ్బరు కార్మికులు 1936లో ఉత్పత్తికి తగ్గ జీతాలు లేవంటూ సమ్మెకు దిగారు. 1936లో మొత్తం 48సార్లు సమ్మె జరిగింది. అందులో ఒకసారి సమ్మె చేసే వారంతా ఒకరోజు మొత్తం ఆఫీసులో ఉండిపోయారు. 22 సార్లు పని ఆగిపోయింది. మొత్తం 34,565 మంది సమ్మెలో పాల్గన్నారు. సమ్మె చేసే వారు తమ ప్లాంట్‌లో 24గంటలకంటే ఎక్కువ సేపు అలానే ఉండిపోయారు.[18] కార్మికులు ఏ మాత్రం పనిచేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చొని సిట్‌ డౌన్‌ సమ్మె చేశారు. సమ్మె కాలంలో యజమానులు కొత్తవారిని తీసుకొచ్చి పని చేయించుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే సమ్మెకు దిగిన కార్మికులు ఫ్యాక్టరీల్లో తమతమ సీట్లలో ఉండటమే దీనికి కారణం. ఇది గతంలో ఎన్నడూ జరగని తరహా సమ్మె.

దీనికి ముందు కార్మికులు తమ ఫ్యాక్టరీని వదిలి పికెట్‌ లైన్లలో నిలబడటం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. ఈ సమయంలో యూనియన్‌ను వాల్టర్‌ రూథర్‌ సమర్థంగా నడిపించాడు. 1955 నాటికి ఆయన యూనియన్లో మరింత ఉన్నత పదవులకు చేరుకున్నాడు.

ALF-CIO

ద అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ మరియు ద కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్‌ యొక్క విలీనం 1955 మే ఐదున జరిగింది.న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 16మిలియన్ల మంది కార్మికులు పాల్గన్నారు. ALF‌ మరియు CIOల అధ్యక్షులు జార్జి మీనీ, వాల్టర్‌ రూథర్‌ ఇద్దరు కలిసి సుమారు 20 ఏళ్ల పాటు చేసిన కృషి ఫలితంగా ఈ విలీనం సాధ్యమైంది. ఈ సమావేశంలోనే కొత్త ALF-CIOకు సంబంధించిన కొత్త నామినేటెడ్‌ సభ్యులు చేతులు కలిపారు. రూథర్‌ 37 మంది ఉపాధ్యక్షుల్లో ఒకరిగా బాధ్యతలు చేపట్టఆరు. మీనీ అధ్యక్షునిగా ఎంపికయ్యాడు. 1979లో మీనీ రిటైర్‌మెంట్‌ తరువాత లేన్‌ క్రిక్‌లాండ్‌ ఆ పదిని అధిరోహించారు. 1952లో ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డైట్‌ డి ఐసన్‌హెవర్‌ కొత్త యూనియన్‌ను బహిరంగంగా ఉద్దేశించి ప్రసంగించి శుభాభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇది ప్ర్రపంచంలో అతి పెద్ద కార్మిక సంఘంగా చెలామణి అవుతోంది.

ఐసన్‌ హెవర్‌ టెలిఫోన్‌ ద్వారా అమెరికాను ఉద్దేశించి మాట్లాడుతూ- అమెరికన్‌ జాతి అభివృద్ధిపై యూనియన్‌ సభ్యుల ప్రభావాన్ని ఆయన అభినందించారు. అమెరికాలో కార్మిక తాత్విక భావజాలం అభివృద్ధి చెందడమే యూనియన్‌ సభ్యుల ప్రభావంగా చెప్పుకోవచ్చు.[19] కార్మికుల తాత్విక భావజాలానికి సంబంధించి మూడు కీలక భావనల్ని చేర్చాలని ఐసన్‌హెవర్‌ తెలిపారు. మానవ కోటి యొక్క అంతిమ విలువల్ని నిర్ధారించేది ఆధ్యాత్మికతే, వీటితో పాటు స్వేచ్ఛ, మానవుల హూందాతనం, అవకాశాలు మరియు అందరికి సమ న్యాయమే ఐసన్‌హెవర్‌ చెప్పిన తొలి కీలక భావన.[19] ప్రతి వ్యక్తికి న్యాయబద్ధమైన వేతనంతో ఉద్యోగం పొందడానికి అర్హుడని ఐసన్‌ హెవర్‌ పేర్కొన్నారు.నిర్ధిష్టమైన పనిగంటలు, మంచి పనివాతావరణ కార్మికులను సంతృప్తి చెందేట్లు చేస్తాయన్నారు. ఇక రెండో అంశంలో ఉద్యోగి, యజమాని మధ్య ఆర్థిక ఆసక్తులు పరస్పర ఆధారితంగా ఉండాలన్నాడు.[19] అందరికీ గొప్ప ఆదాయం పొందాలన్న భావనతో అటు ఉద్యోగి, ఇటు యజమాని కలిసి పనిచేయాలని సూచించాడు. కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉంటుందని, అదే సమయంలో కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు యజమాని వారితో ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమైన మార్గమని ఆయన చెప్పారు. ప్రభుత్వాల యొక్క అనవసర జోక్యం లేకుండా యజమానులు, కార్మికుల మధ్య నిజాయితీగా చర్చలు జరిగినట్లయితే కార్మి క సంబంధాలు అత్యుద్భుతంగా ఉన్నట్లు అని మూడో కీలకాంశంగా ఆయన పేర్కొన్నారు.[19]

ఇరువర్గాల మధ్య సహకారమనేది పరస్పరాధారితంగా ఉన్నట్లయితే క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఒక చక్కని ఫలితంతో బయటపడవచ్చని ఐసన్‌హెవర్‌ సూచించాడు. ఐసన్‌హెవర్‌ చేసిన ఈ ప్రసంగంతో యావత్తు అమెరికాకు ఏఎఫ్‌ఎల్‌- సీఐఓ గురించి, దాని లక్ష్యమైన ఉద్యోగాల్లోను, ప్రభుత్వంలోను, మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోను మరియు వారి వారి సమాజాల్లోను కార్మిక వర్గాల స్వరం వినపడేట్లు చేయడం ద్వారా అమెరికా సమాజంలో సామాజిక,ఆర్థిక న్యాయాన్ని చేకూర్చడం అన్న విషయం తెలిసింది.[20]

కొత్త కూటమి దేశవ్యాప్తంగాను, ఖండాతరాల్లోను 56 కార్మిక సంఘాలను ఏర్పాటు చేసింది. కూటమిలో భాగమైన ఈ సంఘాల్లో రెండున్నర మిలియన్ల అమెరికన్‌ కార్మికులు మరో ఎనిమిదిన్నర మిలియన్ల ఇతర అనుబంధ సభ్యులున్నారు. వీరంతా ఒక తరహా ఉద్యోగాలు చేసేవారు కాదు. వీరంతా కూడా వివిధ రకాల వృత్తులు చేసే వారే. డాక్టర్ల నుంచి ట్రక్‌ డ్రైవర్ల వరకు పెయింట్ల నుంచి బ్యాంకర్ల వరకు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కార్మికులు మరియు ALF-CIO యొక్క కార్యక్రమం ఒక్కటే పనిలో ఆర్థిక న్యాయం జాతి పరంగా సామాజిక న్యాయం తీసుకురావడం ద్వారా కార్మికుల జీవన గతిలో మార్పు తేవడం. ఈ కార్య సాధనకు అమెరికాలో కార్మిక ఉద్యమ దశాదిశను మార్చడం.[21]

ALF-CIOకు ఎన్నో లక్ష్యాలున్నప్పటికీ అవి కూటమి యొక్క కార్యసాధనకు దగ్గరగా ఉంటాయి.

అమెరికన్‌ కార్మికులను కార్మిక సంఘాల ద్వారా సంఘటితం చేయడం ద్వారా అమెరికన్‌ కార్మికులకు సంబంధించిన ఒక బృహత్తర ఉద్యమాన్ని నిర్మిస్తాం. మా దేశంలో కార్మికుల కోసం బలమైన రాజకీయ స్వరం వినిపించేట్లు చేస్తాం. మారుతున్న ఆర్థిక నేపథ్యంలో కార్మికులు కొత్త స్వరాన్ని వినిపించే విధంగా మా కార్మిక సంఘాల్లో మార్పుచేర్పులు చేపడతాం. మా సమాజంలోకార్మికుల కొరకు కొత్త స్వరాలు వినపడేట్లుగా కార్మిక ఉద్యమాల దిశను మారుస్తాం.[21]

ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండే ఈ కూటమిలో సభ్యుల సంఖ్య గణనీయంగానే ఉందని చెప్పుకోవచ్చు. విజయవంతంగా 25 సంవత్సరాల పాటు మనుగడ సాగించిన ఈ కార్మికసంఘంలో ఇప్పుడు సభ్యుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 1955లో 16మిలియన్ల మంది సభ్యులుగా ఉంటే 1984నాటికి అది 13మిలియన్లకు చేరుకుంది. సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణం 1957లో టీమ్‌స్టర్స్‌ యూనియన్‌ను కూటమి నుంచి తొలగించడమే. టీమ్‌స్టర్‌ సభ్యులు వ్యవస్థీకృత నేరాల్లో పాల్పంచుకొని బలమైన కార్మిక శక్తిని అడ్డుపెట్టుకొని చేసిన తప్పును యాజమాన్యాల ముందు మరుగున పెట్టేవారు.

టీమ్‌స్టర్స్‌ యొక్క భావజాలం ఇలా ఉండేది.

ప్రతి సభ్యుడు తాను సరైనది అనుకుంటాడో.ఆ పనిని నెరవేర్చాలి. యంత్రాలకు దీటుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలి. సంస్థ సభ్యుల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాల బీజాల్ని నాటకుండా ఉండాలి. టీమ్‌స్టర్‌ సభ్యులు చేసే పనుల్ని శత్రువులు సైతం మెచ్చుకునే విధంగా ఉండాలి. అమెరికాలో ఇప్పుడు మరెప్పుడైనా టీమ్‌స్టర్‌ పెద్ద, బలమైన కార్మిక సంఘంగా నిలపాలి.[22]

టీమ్‌స్టర్స్‌ యొక్క ఈ భావజాలం దాని అధ్యక్షులైన బెక్‌, హెఫా మరియు విలియన్స్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. వీరందరూ కూడా వివిధ రకాల నేరాల కింద జైలుకు పంపబడ్డారు.

1987లో ALF-CIO సభ్యుల సంఖ్య 14 మిలియన్లకు చేరింది. టీమ్‌స్టర్స్‌ యూనియన్‌ను ఈ కూటమిలో తిరిగి చేర్చుకోవడమే దీనికి కారణం.

అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా ALF-CIO చాలా మంది సభ్యులను కోల్పోయింది. 1900 చివర్లో విదేశీ కరెన్సీ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంతో డాలర్‌ విలువలో ఒడిదుడుకులు వచ్చాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్త సంక్షోభం కారణంగా అమెరికా పౌరులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా మరియు ఇతర విదేశాల మధ్య ఉండే విభేదాలను ఐసన్‌హెవర్‌ చెప్పిన మూడో కీలక సూత్రం అయిన నిజాయితీతో కూడిన సంప్రదింపుల ఆధారంగా పరిష్కరించలేం.

స్థిరమైన ఆర్థిక విధానానికి దోహదపడే ఆదర్శవంతమైన పాలసీలుగా భావించే అంతర్జాతీయ వర్తకం, వస్తూత్పత్తి మరియు ఇతర అనేక అంశాలకు సంబంధించి సంస్థాగత విధానాలకు మద్దతుగా నిలుస్తుంది.

అసోసియేషన్‌ మెంబర్ల తరపున హాజరయ్యే ప్రతినిధులు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సమావేశమై ALF-CIO కార్యనిర్వాహక సభ్యులను ఎంచుకుంటారు. ఈ ప్రతినిధులు సమాఖ్య సభ్యుల యొక్క అధికార ప్రతినిధులుగా ఉంటాయి. వీరిని యూనియన్‌లో సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు కొత్త కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకునేందుకు ప్రతినాలుగు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తారు. వీరు కార్మిక సంఘానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు, విధానాలను రూపొందిస్తారు. 45మంది ఉపాధ్యాక్షులతో కూడిన తాజా కార్యనిర్వాహక మండలిలో అధ్యక్షునిగా జాన్‌ జె. స్వేనీ, సెక్రటరీ`ట్రెజరర్‌గా రిచర్డ్‌ ట్రూకా మరియు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆర్లెన్‌ హాట్‌ బాకర్‌ ఉన్నారు.

అమెరికాలో మొత్తం 15.4 మిలియన్ల మంది యూనియన్‌ సభ్యులున్నారు. 11మిలియన్ల మంది ALF-CIOకు అనుబంధంగా ఉన్నారు. కార్మిక సంఘ ఉద్యమం ప్రారంభమైన తరువాత నేటికి ఈ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం వివిధ వృత్తుల్లో ఉన్నవారిని కార్మిక సంఘంలో చేరేట్లుగా ఆహ్వానించడమే. ఇప్పుడు యూనియన్‌లో ఉత్పత్తి, నిర్మాణ కార్మికులు, టీచర్లు, టెక్నీషియన్లు, డాక్టర్లు ఇలా వీరి మధ్య ఉన్న ప్రతి కార్మికుడున్నాడు. బ్రతకడానికి ఏ పనిచేసినా వారికొక యూనియన్‌ అందులోని వారు అదే పనిచేస్తుంటారు.[23] కుటుంబాలను నడపడం ద్వారా జీవితాలకు ఒక దశాదిశా కల్పించే అంశాలకు సంబంధించి యూనియన్‌ సభ్యుల్లో అవగాహన కల్పించడం ALF-CIO యొక్క ప్రధాన పాలసీగా చెప్పవచ్చు. రాజకీయ కారణాల దృష్ట్యా వారి స్వరాన్ని వింటారన్న నమ్మకాన్ని కార్మికులకు ఇస్తారు.

టాక్స్‌ డాలర్లను స్కూళ్లు, రోడ్లు, బ్రిడ్జ్‌లు, ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కుటుంబాలకు మద్దతు పలికే ఉద్యోగాల కల్పన, విద్య ద్వారా కార్మికుల జీవితాలను మెరుగుపరచడం, వృత్తి శిక్షణ, కనీస వేతనాలను పెంచడం, కార్మిక చట్టాలను సంస్కరించడం ద్వారా మంచి ఉద్యోగాలను స్వదేశీయుల కోసం ఉంచడం, అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పారిశ్రామిక పథంలో నడపడం, కార్మికుల పరిరక్షణ సంబంధించి చేసే కృషిని రెట్టింపు చేయడం,సామాజిక భద్రత, ప్రయివేటు పెన్షన్లను బలోపేతం చేయడం, ప్రతి ఒక్కరినీ ఉన్నతస్థాయి వైద్యసేవల్ని అందించడం, కార్పొరేట్‌ సంస్థలు తాము చేపట్టే చర్యలకు మరింత బాధ్యతాయుతంగా ఉండటం వంటివి దీని ప్రాధాన్యతల జాబితాలో ఉన్నాయి.[23]

ALF-CIO రాజకీయ అంశాల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటుంది. ప్రతి రాజకీయ పరిణామానికి సంబంధించి తన సభ్యుల కుటుంబాలకు సమాచారాన్ని ఇస్తుంది. వలంటీర్లు, కార్యకర్తలు, ఎక్కడైన తన సభ్యులు వివిధ అంశాలపై పోరాడుతుంటారో వారికి ఈ సమాచారాన్ని అందిస్తుంటారు.

మెక్సికో

1990 కి ముందు మెక్సికోలో ఉన్న సంఘాలు చారిత్రికంగా రాష్ట్ర వ్యవస్థీకృత విధానంలో భాగంగా ఉండేవి. 1940 -1980 మధ్య కాలంలో, 1940లో మెక్సికన్‌ విప్లవం ముగిసిన తరువాత, 1980 వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే సరళీకృత విధానాలన్నీ కూడా వాషింగ్టన్‌ కనుసన్నల్లోనే జరిగేవి. మెక్సికోలోని కార్మిక సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోయాయి. కానీ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో భాగంగా ఉండేవి. చాలా వరకు అధికార పార్టీ వీటిని నియంత్రిస్తుండేది.[24]

ఈ నలభై సంవత్సరాల కాలంలో కార్మిక సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికులకు మేలు చేయడం కాదు, కేవలం అధికార పక్షంతో ఉన్న సంబంధబంధవ్యాల కారణంగా ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడమే. ఇది 1950-60 కాలంలో మెక్సికన్‌ మిరాకిల్స్‌ పేరిట తారాస్థాయికి చేరుకుంది. ఆదాయాలు పెరగడం, జీవన ప్రమాణాలు పెరిగినప్పటికీ ఇందులో అతి తక్కువ భాగం మాత్రమే కార్మికులకు చేరింది. సంపన్నులు మరింత సంపన్నులయ్యారు.[24]

1980 ప్రాంతంలో ప్రభుత్వం వాషింగ్టన్‌ అనుమతితో ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను( రైలురోడ్డు, కమ్యునికేషన్స్‌) ప్రయివేటు పరం చేయడం ప్రారంభించాయి. కొత్త అధినేతులు కార్మిక సంఘాల పట్ల వ్యతిరేకభావాన్ని చూపించడం మొదలు పెట్టాయి. ప్రభుత్వాలతో సత్సంబంధాలు నెరుపుతున్న కార్మిక సంఘాలు వీరిపై తిరగబడటానికి అసక్తి కనపరచలేదు. సంస్థాపరంగా ఉన్న పాత కార్మిక సంఘాల్లో అవినీతి, హింస, గ్యాంగ్‌స్టర్‌ ధోరణి పెచ్చరిల్లడంతో మరింత స్వతంత్రంగా వ్యవహరించగల కొత్త కార్మిక సంఘాల ఉద్యమాలు వేళ్లూనుకోవడం మొదలు పెట్టింది. 1990 నుంచి ఇలాంటి కార్మిక సంఘాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువశాతం మంది నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే.[24]

ఆస్ట్రేలియా

గారి, ఇండియానాలో ప్రల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఒక 1919 స్ట్రైక్ నాయకుడు.

ACTU లేదా ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ వంటి సంఘాల మద్దతుదారులు 20వ శతాబ్దం మొదలులో తరచుగా కార్మిక ఉద్యమాన్ని నడిపించటం ద్వారా తరచుగా వర్తక సంఘాలకి సహాయపడ్డాయి, ఇది సాధారణంగా బాలకార్మిక వ్యవస్థను అంతం చేసింది, కార్మిక బాధ్రతను అభివృద్ధి చేసింది, సంఘం కార్మికులు మరియు సంఘంగా లేని కార్మికుల కొరకు వేతనాలను పెంచింది, మొత్తం సమాజం యొక్క జీవన ప్రమాణాలను పెంచింది, ఒక వారంలో పని గంటలను తగ్గించింది, పిల్లల కొరకు ప్రభుత్వ విద్యనూ అందించింది మరియు కార్మిక తరగతి కుటుంబాలకు ఇతర లబ్ధిని చేకూర్చింది.[25]

నిర్మాణం మరియు రాజకీయాలు

సంఘం నిర్మాణాలు, రాజకీయాలు, మరియు చట్టపరమైన స్థితి మొదలైనవి ఒక దేశం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటాయి. ఒక నిర్దిష్ట దేశం వివరాల కోసం వర్తక సంఘాల యొక్క జాబితా చూడుము.
2006-03-28 న ఒక స్ట్రైక్ సమయంలో ఆక్స్ఫర్డ్ లో UNISON అనే వర్తక సంఘం యొక్క ర్యాలీ.

కార్మిక సంఘాలు ప్రత్యేకించి ఒక వృత్తి విద్యలో నైపుణ్యం ఉన్న వారితో ఉండవచ్చు (క్రాఫ్ట్‌ యూనియనిజం) లేదా వివిధ రకాల వృత్తి విద్యలకు చెందిన వారితో ( జనరల్‌ యూనియనిజం) కూడినదై ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఓ నిర్ధిష్టమైన పరిశ్రమలో అందరి కార్మికులతో కూడినదై ఉండవచ్చు (ఇండ్రస్టియల్‌ యూనియనిజం). ఈ కార్మిక సంఘాలను తరచుగా స్థానిక కార్మిక సంఘాలుగాను, జాతీయ సమాఖ్యలో యునైటెడ్‌గా విభజించవచ్చు. ఈ సమాఖ్యలు తమకు తాముగా అంతర్జాతీయ సంఘాలైన ఉదాహరణకు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉంటాయి.

స్పష్టమైన ఆదేశాలతో తాను ప్రాతినిధ్యం వహించే కార్మికుల తరఫున యజమానులతో సంప్రదింపులు జరిపే కారణంగా కార్మిక సంఘం న్యాయశాస్త్రవేత్త(కృత్రిమ న్యాయవ్యవస్థ) స్థాయిని పొందవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సంఘాలకు కొన్ని న్యాయపరమైన హక్కులుంటాయి. మరీ ముఖ్యంగా యజమాని లేదా యజమానితో వేతనాలు, పనిగంటలు,ఉపాధికి సంబంధించిన ఇతర విధివిధానాలకు సంబంధించి సమష్టి బేరసారాలు జరిపే హక్కు ఉంటుంది. ఇరువర్గాల మధ్య ఒప్పందానికి రాని పరిస్థితి ఉంటే పారిశ్రామిక చర్య ఉంటుంది. కార్మికులు సమ్మెకు దిగడం లేదా యజమానులు లాకౌట్‌ ప్రకటించడం లేదా మధ్యవర్తిత్వానికి కట్టుబడి ఉండటం. కొన్ని పరిస్థితుల్లో ఈ పరిణామాల నేపథ్యంలో హింస, చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది.

ఇతర పరిస్థితుల్లో కార్మికులకు ప్రాతినిధ్యం వహించే వ్యవహారంలో కార్మికసంఘాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు.దీన్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ఈ హోదా లేకపోవడం వల్ల ఆ కార్మిక సంఘాన్ని గుర్తించకుండా ఉండటం, రాజకీయ, నేర పూరిత నేరాల కింద సంఘ కార్యకర్తలను, సభ్యులను విచారించే అవకాశం ఉంటుంది. చరిత్రక్రమంలోను,నేటి తరంలోనూ ఎన్నో హింసాత్మక ఘటనలు, మరణాలు నమోదయ్యాయి.[26][27]

కార్మిక సంఘాలు రాజకీయ, సామాజిక ఉద్యమాల్లోనూ నిమగ్నమవుతాయి. సోషల్‌ యూనియనిజం వైపు అడుగులు వేసే ఎన్నో కార్మిక సంఘాలు తమ సంస్థాగత బలాన్ని ఉపయోగించడం ద్వారా తమ సభ్యులకు లేదా సాధారణంగా అందరు కార్మికులకు లాభం చేకూరే విధంగా సోషల్‌ పాలసీలకు చట్టబద్ధత కల్పించే విధంగా దిశానిర్ధేశం చేస్తారు. దీంతో పాటు చాలా దేశాల్లో కార్మిక సంఘాలు ఏదైనా రాజకీయ పక్షంతో దగ్గర సంబంధాలను కలిగి ఉంటాయి.

అందించే సేవల విధానం, నిర్వహణ విధానం పరంగా కార్మిక సంఘాలను వివరించవచ్చు. సేవల విధానం అనుసరించే కార్మిక సంఘాలు కార్మికుల హక్కులు, వారికి సేవలందించడం, వివాదాలను పరిష్కరించడం వంటి వాటిపై దృష్టి సారిస్తాయి. నిర్వహణ విధాన కార్మిక సంఘాల్లో పూర్తి సమయం సంఘ నిర్వాహకులుంటారు. ఆత్మవిశ్వాసం పెంపొందించడం, బలమైన సంబంధాలు, కార్మికుల మధ్య నాయకులు, భారీసంఖ్యలో సభ్యులున్న కార్మిక సంఘాల్లో నిందారోపణలకు సంబంధించిన వాస్తవిక అంశాల ప్రచారం వంటివి చేపడతాయి. అనేక కార్మిక సంఘాల్లో ఈ రెండు భావజాలాలు సమ్మిళితమై ఉంటాయి. ఈ రెండు విధానాలకు సంబంధించి చేసిన నిర్వచనాలు ఇప్పటికీ చర్చనీయాంశమే.

వీటి రాజకీయ నిర్మాణం, స్వయంప్రతిపత్తి తదితర విషయాల్లో వైవిధం కనిపించినప్పటికీ సాధారణ ప్రజాస్వామ్య పంథాలోనే వీటి నాయకత్వాలను ఎంచుకుంటారు.

కార్మిక సంఘాల్లో లేని వారి కంటే కార్మిక సంఘాల్లో ఉన్నవారు మంచి వాతావరణం మరియు జీతాలు పొందుతున్నట్లు ఏసీఐఆర్‌ఆర్‌టీ నిర్వహించే ఓ పరిశోధనలో వెల్లడైంది.[28]

బ్రిటన్‌లో లెఫ్ట్‌భావజాలం ఉన్న కార్మిక సంఘాలు ప్రతీకారాత్మక రైట్‌ వింగ్‌ కార్మిక సంఘమైన సాలిడారిటీని ఏర్పాటు చేశాయి. దీనికి రైట్‌ వింగ్‌ బీఎన్‌పీ మద్ధతు పలికింది.

షాప్ రకాలు

దీనికి కార్మికులతో కూడిన కార్మిక సంఘం ఉన్న కంపెనీలు ఈ దిగువ పేర్కొన్న మోడల్స్‌ల ఏదో ఒకదానిని అనుసరిస్తాయి.

 • క్లోజ్డ్‌ షాప్ ‌(యూఎస్‌) దీన్నే ప్రీ -ఎంట్రీ క్లోజ్డ్‌ షాప్‌ అని బ్రిటన్‌లో అంటారు. కార్మిక సంఘంలో సభ్యులైన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తాయి. కంపల్సరీ హైరింగ్‌ అనేది క్లోజ్డ్‌ షాప్‌కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందులో యజమాని కార్మిక సంఘం నుంచి నేరుగా ఉద్యోగులను ఎంచుకుంటాడు. అదేవిధంగా ఉద్యోగులు కూడా యూనియనైజ్‌ యజమానుల వద్దే పనిచేస్తారు.
 • యూనియన్‌ షాప్ ‌(యూఎస్‌) లేదా పోస్ట్‌ ఎంట్రీ క్లోజ్‌ షాప్‌ అని బ్రిటన్‌లో అంటారు. కార్మిక సంఘంలో సభ్యులు కాని వారికి కూడా ఉపాధి కల్పిస్తారు. అయితే నిర్ధిష్ట కాలవ్యవధిలో కొత్త ఉద్యోగులు కార్మిక సంఘంలో చేరాల్సి ఉంటుంది.
 • ఏజెన్సీ షాప్‌ కార్మిక సంఘంలో సభ్యులు కాని వారి ఉపాధి కాంట్రాక్టులకు సంబంధించి బేరసారాలు జరపడానికి సంఘానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కొన్ని సమయాల్లో రాండ్‌ ఫార్ములా అని అంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని పబ్లిక్‌ ఎంప్లాయిస్‌ కొన్ని సమయాల్లో జరిపే చెల్లింపులను ఫెయిర్‌ షేర్‌ చట్టాలు సులభతరం చేశాయి.
 • ఒపెన్‌ షాప్‌ ఉపాధి పొందడానికి లేదా ఉపాధి కల్పించడానికి కార్మిక సంఘ సభ్యత్వం అవసరం లేదు. ఎక్కడైతే కార్మిక సంఘం ఉంటుందో అక్కడ కార్మికులు ఆ సంఘానికి ఏ మాత్రం సహాయసహకారాలు అందించనప్పటికీ సమష్టి బేరసారాల కారణంగా లబ్ధిపొందుతారు. అమెరికాలో జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన రైట్‌ టూ వర్క్‌ చట్టాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఒపెన్‌ షాప్‌ విధానానికి చట్టబద్ధత కల్పించబడింది.

అంతర్జాతీయ సంఘాల యొక్క భిన్నత్వం

కార్మిక చట్టాలనేవి దేశాలను బట్టి మారుతుంటాయి. వీటికి అనుగుణంగానే కార్మిక సంఘాలు పనిచేస్తుంటాయి. ఉదాహరణకు జర్మనీలో ఓపెన్‌ షాపులకు చట్టబద్ధత ఉంది. కార్మిక సంఘాల్లో సభ్యత్వం కల్పించడంలో ఎలాంటి వివక్ష చూపించరాదు. ఇది యూనియన్‌ యొక్క పనితీరును, అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అదనంగా జర్మనీలోని కార్మిక సంఘాలు అమెరికాలోని కార్మిక సంఘాల కంటే భిన్నంగా కార్పొరేట్‌ బోర్డు మీటింగ్‌ల్లో పాల్గొంటూ యజమాన్య పర నిర్ణయాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. (newsletter/files/BTS012EN_12-15.pdf).

బ్రిటన్‌లో 1980ల్లో మార్గరేట్‌ థాచర్‌ ప్రభుత్వం కార్మిక సంఘాలను యూనియన్‌ షాపులను నిరోధించడానికి, మూసేయించడానికి ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టారు. ఓ కార్మికుడు యూనియన్‌లో చేరడానికి సంబంధించి చేసే అన్ని వాదనలు చట్టవ్యతిరేకమయ్యాయి. అమెరికాలో టఫ్‌`హార్ట్లీ చట్టం క్లోజ్డ్‌ షాప్‌లను నిషేధించింది. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించనంత వరకు యూనియన్‌ షాపులకు అనుమతించింది.

దీని అదనంగా కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాల యొక్క సంబంధాలు మారుతూ వచ్చాయి. చాల దేశాల్లో కార్మికుల యొక్క ఆసక్తులను పరిరక్షించాలన్న ఉద్దేశంతో చాలా కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలతో దగ్గర పెనవేసుకొని పోవడంతో పాటు నాయకత్వాన్ని కూడా పంచుకుంటున్నాయి. లెఫ్ట్‌ వింగ్‌, సోషలిస్టు లేదా సోషల్ డెమక్రాటిక్‌ పార్టీలు, కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నాయి.

అమెరికాలో దీనికి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక సంఘాలు డెమక్రాటిక్‌ పార్టీతో జట్టు కట్టినప్పటికీ... కార్మిక ఉద్యమాలకు సంబంధించి ఎవరి గుత్తాధిపత్యం లేదు. బృందాలను ఏర్పరిచే సభ్యులను, వారి నాయకులను గమనించినప్పుడు ఈ విషయం అవగతం అవుతుంది.
ఉదాహరణకు ఇంటర్నేషనల్‌ బ్రదర్‌హుడ్‌ ఆఫ్‌ టీమ్‌స్టర్‌ను గమనించినట్లయితే అనేక సందర్భాల్లో ఇది రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులకు మద్ధతు పలికింది. అదే సమయంలో ప్రొఫెషనల్‌ ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ అసోసియేషన్‌ (పీఏటీసీఓ) 1980లో రోనాల్డ్‌ రీగన్‌కు మద్ధతునిచ్చింది. (అయితే పీఏటీసీఓ నో స్ట్రైక్‌ అన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి సమ్మెకు దిగినప్పుడు అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ వారితిరిగి వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేశాడు. ఎవరైతే ఉద్యోగాల్లో తిరిగి చేరలేదో వారిని విధుల నుంచి తప్పించారు. ఇదే PATCO విధ్వంసం కావడానికి కారణమైంది). బ్రిటన్‌లో కార్మిక ఉద్యమాలన్నీ లేబర్‌ పార్టీతో ముడిపడి ఉంటాయి. ఈ సంబంధం ఎలా ఉంటుందంటే ప్రయివేటీకరణ తదితర అంశాలకు సంబంధించి కార్మికుల యొక్క ఆసక్తులకు అనుగుణంగా పార్టీ నాయకత్వం తన గళాన్ని విప్పుతుంది. వీటన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలిచేది రైట్‌ వింగ్‌ టోరీల విధానాల సానుభూతిపరులతో ఏర్పడ్డ కన్జర్వేటివ్‌ ట్రేడ్‌ యూనియనిస్ట్‌ లేదా సీటీయు. అయితే వీరంతా కూడా కార్మిక సంఘాల నేతలే.

పశ్చిమ యూరోప్‌లో కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్‌ అసోసియేషన్లు కార్మిక సంఘం పాత్రను పోషిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వైట్‌ కాలర్‌ ఉద్యోగులైన ఫిజీషియన్లు, ఇంజినీర్లు లేదా టీచర్లతో వీరు సంప్రదింపులు జరుపుతారు. ఇలాంటి ట్రేడ్‌ యూనియన్లు రాజకీయాలకు అడ్డుచెబుతూ సాధారణవాదులకంటే భిన్నంగా మరింత సరళతరమైన రాజకీయాలను మాత్రమే అనుసరిస్తుంటాయి.[citation needed]

జర్మనీ ఉద్యోగులు, యజమానుల మధ్య సంబంధాలు అసమానంగా ఉంటాయి. పర్యవసానంగా వ్యక్తులకు సంబంధించి బలమైన న్యాయపరమైన పరిరక్షణ ఉండటంతో పనికి సంబంధించిన ఎన్నో నిబంధనలకు సంబంధించి బేరసారాలు చేయడం సాధ్యపడదు. అయినప్పటికీ జర్మన్‌ ఫ్లేవర్‌ లేదా పనికి సంబంధించిన చట్టాల్లో అటు కార్మిక సంఘాల్లోని వారికి ఇటు యజమానులచే రూపుదిద్దుకున్న యాజమాన్య అసోసియనేషన్లకు సమానమైన అధికారులుండటమే వాటి ప్రధాన ఉద్దేశం. ఇది వ్యక్తిగత బేరసారాల కంటే సమష్టి బేరసారాలకు న్యాయపరమైన విస్రృత పరిధిని కల్పిస్తుంది. కార్మిక సంఘాలు న్యాయపరమైన స్థాయిని పొందాలంటే ఉద్యోగుల సంఘాలు యజమానులతో బేరసారాలు జరిపేటప్పుడు ఎదురుదాడి జరుపుతూ పెత్తనం చెలాయించగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి ఉద్యోగ సంఘాలు వేరే ఉద్యోగ సంఘాలతో పోటీ పడుతూ పలుకుబడిని ఇతర సంఘాలు ప్రశ్నిస్తాయి అదేవిధంగా కోర్టు విచారణలో దాన్ని అంచనా వేస్తారు. జర్మనీలో చాలా తక్కువ ప్రొఫెషల్‌ అసోసియన్లు మాత్రమే తమ సభ్యులకు సంబంధించి వేతనాలు, పనివాతావరణం గురించి యజమానులతో బేరసారాలు జరపగలుగుతాయి. మెడికల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ మాబర్గర్‌ బండ్‌, పైలెట్ల అసోసియేషన్‌ వెరినీగంజ్‌ కాక్‌పిట్‌ వంటివి వీటిలో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇంజినీర్లు అసోసియేషన్‌ వీరెన్‌ డాయిచూ ఇంజనీర్‌ ఇంజినీరింగ్‌ వ్యాపారాలకు సంబంధించిన ఆసక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్మిక సంఘంగా వ్యవహరించలేదు.

చివరగా, ఉపాధికల్పనా నియమనిబంధనల్ని బట్టి కార్మిక సంఘాల యొక్క పాత్ర మారుతుంటుంది. వాటికి అనుగుణంగా వారు తమ కార్యకలాపాల్ని చేపడుతుంటారు. పశ్చిమ ఐరోపా‌లోని చాలా దేశాల్లో ఉద్యోగుల వేతనాల్ని ఆయా ప్రభుత్వాలు నిర్ణయిస్తుంటాయి. అమెరికాలో కాస్తంత స్వేచ్ఛాయుత పద్ధతి ఉంటుంది. కొన్ని కనీస ప్రమాణాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వేతనాలు, ఇతర బెనిఫిట్ల విషయాన్ని మార్కెట్‌ శక్తులు, సమష్టి బేరసారాలకు విడిచిపెట్టింది. చరిత్రాత్మకంగా రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా సమష్టి బేరసారాలను క్రమబద్ధీకరించింది. అయితే చాంద్రమాన కొత్త సంవత్సరానికి ముందు జరిగేవే న్యాయబద్ధమైనవి నిరంకుశ నాజీ జర్మనీలో కార్మిక సంఘాలను నిషేధించారు. సోవియట్‌ యూనియన్‌, చైనాల్లో కార్మిక సంఘాలనేవి ఆయా ప్రభుత్వాల యొక్క యదార్థ రూపాలుగా ఉండేవి. ఇవి ప్రభుత్వం సజావుగా నడవడానికి దోహదపడే కార్యక్రమాల్లో పాల్గోనేవి.

విమర్శ

వర్తక సంఘాలు బయటి కార్మికులకి అన్యాయం చేసి లోపలి కార్మికులను, ఉద్యోగ భద్రత కలిగిన వారిని, ఉత్పత్తి చెయ్యబడుతున్న వస్తువులు లేదా సేవల యొక్క వినియోగదారులకు మరియు సంఘిటితం చెయ్యబడిన వ్యాపారాల యొక్క వాటాదారులకి లబ్ధి చేకూరుస్తున్నాయి అని నిందించబడ్డాయి.[29]

సంయుక్త రాష్ట్రాలలో సంఘ భాగస్వామ్యం యొక్క ఖరీదు పెరిగిపోవటం వలన అది పాక్షికంగా కార్మికులను ఆసియా, లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికాలకి పంపటానికి దోహదపడింది, ఇది ఇతర దేశాలకి కార్మికులలో ఒక పోల్చదగిన అనుకూలతను ఇస్తుంది, ఫలితంగా అక్కడ కార్మిక-ఆధారిత పనిని మరింత సమర్ధంగా చేస్తుంది.[30] ప్రముఖ ఆర్తికవేత్త, లైసేజ్-ఫెయిరే క్యాపిటలిజం యొక్క న్యాయవాది అయిన మిల్టన్ ఫ్రైడ్మాన్ సంఘాలుగా ఏర్పడటం అనేది కొద్ది ఉద్యోగాల ఖర్చుతో అధిక వేతనాలను (యూనియన్ సభ్యుల కోసం) ఉత్పత్తి చేస్తుంది అని మరియు ఒకవేళ కొన్ని పరిశ్రమలు సంఘాలుగా ఏర్పడి మరికొన్ని సంఘాలుగా ఏర్పడకపోతే, సంఘాలుగా ఏర్పడని పరిశ్రమలలో వేతనాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పాడు.[31]

వర్తక సంఘాలు జాత్యహంకారం మరియు లింగభేదం పై అసమర్ధమైన ప్రణాలికలు కలిగి ఉన్నాయి, అలానే సంఘంలోని ఒక సభ్యుని పై చర్య తీసుకొనే మరొక సభ్యుడికి మద్దతు ఇవ్వకపోవటంలో సంఘం న్యాయబద్దతను చూపిస్తుంది. ఇది 1987 లో UK లో వీవర్ v NATFHE కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా నిరూపించబడింది, ఇందులో ఒక నల్లజాతి, ముస్లిం స్త్రీ తను పనిచేస్తున్న స్థలంలో సహా-వర్తక సంఘంలోని సభ్యుని పై జాత్యహంకార ఆరోపణ చేసింది. న్యాయస్థానం ఆ సంఘాన్ని కనుగొంది, పిర్యాదుదారుని సహాయం అందించింది, బాధిత సభ్యుని యొక్క హక్కులను రక్షించవలసిన వారి యొక్క బాధ్యతను విస్మరించారని చెప్పింది, మరియు ఈ తీర్పు అదే సంఘంలోని సభ్యుల నుండి జాతి పరమైన లేదా లైంగిక వేదింపులు ఎదుర్కొని మరియు ఏ విధమైన సలహా లేదా సహాయం పొందని వారు ఇచ్చే పిర్యాదులకి ఒక సూచనగా అయింది; పిర్యాదు యొక్క ప్రాముఖ్యంతో సంబంధం లేకుండా ఇది అన్నింటికీ వర్తిస్తుంది.[32]

ప్రపంచవ్యాప్త సంఘం మరియు ప్రాంతం మరియు దేశాల వారీగా

ప్రపంచవ్యాప్త మరియు అంతర్జాతీయ సహకారం

ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సంస్థ బ్రుస్సేల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్, ఈ రోజుకి అది దాదాపుగా 309 అనుబంధ సంస్థలను 156 దేశాలలో మరియు ప్రాంతాలలో కలిగి ఉంది, 166 మిలియన్ల మిళితం చెయ్యబడిన సభ్యత్వాన్ని కూడా కలిగి ఉంది. ఇతర ప్రపంచ వర్తక సంఘ సంస్థలు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ను కలిగి ఉన్నాయి.

నిర్దిష్ట పరిశ్రమ విభాగాలలో లేదా వృత్తిపరమైన సమూహాలలో నిర్వహిస్తున్న జాతీయ మరియు ప్రాంతీయ వర్తక సంఘాలు కూడా ప్రపంచ సంఘ ఫెడరేషన్స్ను ఏర్పరుస్తాయి, ఉదాహరణకి యూనియన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ లేదా ది ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అండ్ ఎంటర్తైన్మెంట్ అలియన్స్.

సంఘం ప్రచురణలు

ప్రపంచంలో ఉన్న వర్తక సంఘ ఉద్యమం గురించి ప్రస్తుత వార్తల యొక్క అనేక మూలాలు మనుగడలో ఉన్నాయి. ఇవి లేబర్ స్టార్ట్ మరియు అంతర్జాతీయ వర్తక సంఘ ఉద్యమం ప్రపంచ సంఘాలు యొక్క అధికారిక వెబ్సైట్ కలిగి ఉన్నాయి.

కార్మిక వార్తల యొక్క మరొక మూలం వర్కర్స్ ఇండిపెండెంట్ న్యూస్, ఇది స్వతంత్ర మరియు సామూహిక రేడియో కార్యక్రమాలకి రేడియో వ్యాసాలను అందించే ఒక వార్తా సంస్థ.

లేబర్ నోట్స్ అనేది సంయుక్త రాష్ట్రాలలో మిగిలి ఉన్న అతిపెద్ద సర్క్యులేషన్ క్రాస్ యూనియన్ ప్రచురణ. ఇది కార్మిక చర్యలు లేదా కార్మిక ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వార్తలను మరియు విశ్లేషణను నివేదిస్తుంది.

ఇవి కూడా చూడండి

సాధారణం
సంఘాల యొక్క రకాలు
యూనియన్ ఫెడరేషన్

సూచనలు

 1. "ర్యాంక్ మరియు ఫైల్" యొక్క నిర్వచనం
 2. 2.0 2.1 2.2 Webb, Sidney (1920). History of Trade Unionism. Longmans and Co. London. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help) ch. I
 3. [1] ట్రేడ్ యూనియన్స్ అండ్ సోషలిజం ఇంటర్నేషనల్ సోషలిస్ట్ రివ్యూ, సంపుటి.1 సంఖ్య.10, ఏప్రిల్ 1901.
 4. "Trade Union Census". Australian Bureau of Statistics. Retrieved 2006-08-05.
 5. ఫోనేర్, ఫిలిప్ షెల్దోన్. సంయుక్త రాష్ట్రాలలో కార్మిక ఉద్యమం యొక్క చరిత్ర. అంతర్జాతీయ ప్రచురణకర్తల సంఘం., 1972.
 6. 6.0 6.1 సంయుక్తరాస్త్రాలలో ఉన్న వర్తక సంఘాలు. 2008. http://www.history.com/encyclopedia.do?articleId=224387 (ఏప్రిల్ 1, 2009న వినియోగించబడింది).
 7. అమెరికా యొక్క గ్రంథాలయం నుండి అమెరిక యొక్క కథ. http://www.americaslibrary.gov/cgi-bin/page.cgi/aa/presidents/buren/panic_2 (ఏప్రిల్ 6, 2009న వినియోగించబడింది).
 8. Ayers, Edward L.; et al. American Passages: A History of the United States. Vol. 1. Harcourt. p. 288. ISBN 978-0-4950-5015-5. Explicit use of et al. in: |first= (help); |volume= has extra text (help)
 9. Kennedy, David (2006). The American Pageant (Thirteenth Edition ed.). New York: Houghton Mifflin Company. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); |edition= has extra text (help)
 10. 1997. "1878 యొక్క నైట్స్ ఆఫ్ లేబర్ రాజ్యాంగం." 1878 యొక్క నైట్స్ ఆఫ్ లేబర్ రాజ్యాంగం 1, సంఖ్య. 1: 1. అకాడెమిక్ సెర్చ్ ప్రీమియర్, EBSCOhost (ఫిబ్రవరి 24, 2009న వినియోగించబడింది).
 11. ఫింక్, లియోన్. వర్కింగ్ మెన్ యొక్క ప్రజాస్వామ్యం: ది నైట్స్ ఆఫ్ లేబర్ అండ్ అమెరికా పాలిటిక్స్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు: ఇల్లినొఇస్ విశ్వవిద్యాలయం యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, 1983.
 12. "నైట్స్ ఆఫ్ లేబర్." కొలంబియా ఎన్సైక్లోపెడియా . అకాడెమిక్ సెర్చ్ ప్రీమియర్, EBSCOhost (ఫిబ్రవరి 24, 2009న వినియోగించబడింది).
 13. చైనీస్ ఎక్సక్లూషణ్ యాక్ట్ (1882). 1989. http://www.ourdocuments.gov/doc.php?flash=true&doc=47 (మార్చ్ 31, 2009న వినియోగించబడింది).
 14. డుబోఫ్స్కి, మెల్వ్యన్. వుయ్ షల్ బి ఆల్: ఏ హిస్టరీ ఆఫ్ ది ఇండస్త్రియాల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్. 2000.(ఏప్రిల్ 6, 2009న వినియోగించబడింది).
 15. Dictionary.com. 2009. http://dictionary.reference.com/browse/small%20business?qsrc=2888 (ఏప్రిల్ 6, 2009న వినియోగించబడింది)
 16. డుబోఫ్స్కి, మెల్వ్యన్. వుయ్ షల్ బి ఆల్: ఏ హిస్టరీ ఆఫ్ ది ఇండస్త్రియాల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్. 2000. http://books.google.com/books?id=DmAer6Nz75kC&pg=PA5&lpg=PA5&dq=Knights+of+Labor+competition+with+AFL&source=bl&ots=-k3A0t8rN6&sig=Xt1W6THNjgswcbTwsHoWszrlqa4&hl=en&ei=rrHbSfXBFJvqlQfFrfiUCA&sa=X&oi=book_result&ct=result&resnum=7#PPP1,M1 (ఏప్రిల్ 6, 2009న వినియోగించబడింది)
 17. జేగేర్, రాబర్ట్ H. The CIO:1935-1955. 1997. http://books.google.com/books?id=ghy45fyXYyoC (ఏప్రిల్ 7, 2009న వినియోగించబడింది).
 18. ఫైన్, సిడ్నీ. సిట్-డౌన్: ది జనరల్ మోటర్స్ స్ట్రైక్ ఆఫ్ 1936-1937. 1936. http://books.google.com/books?id=0TkupxD2njcC&pg=PA123&dq=Rubber+Strike+of+1936 (ఏప్రిల్ 6, 2009న వినియోగించబడింది)
 19. 19.0 19.1 19.2 19.3 పీటర్స్, గెర్హార్డ్. డ్విఘ్ట్ D. యిసేన్హోవేర్. 1999-2009. http://www.presidency.ucsb.edu/ws/index.php?pid=10394 (ఏప్రిల్ 16, 2009న వినియోగించబడింది).
 20. సంఘం వాస్తవాలు. 2009. http://www.aflcio.org/aboutus/faq/ (ఏప్రిల్ 7, 2009న వినియోగించబడింది)
 21. 21.0 21.1 వాట్ వుయ్ స్టాండ్ ఫర్: మిషన్ అండ్ గోల్స్ ఆఫ్ AFL-CIO . 2009. http://www.aflcio.org/aboutus/thisistheaflcio/mission/ (ఏప్రిల్ 20, 2009న వినియోగించబడింది)
 22. ది టీంస్టర్ హిస్టరీ. http://www.teamster.org/history/teamster-history/overview (ఏప్రిల్ 20, 2009న వినియోగించబడింది).
 23. 23.0 23.1 Cite error: Invalid <ref> tag; no text was provided for refs named Union Facts 2009
 24. 24.0 24.1 24.2 డాన్ లా బొట్జ్ US సపోర్టేడ్ ఎకనామిక్స్ స్పర్డ్ మెక్సికన్ ఎమిగ్రేషణ్, pt.1 , ఇంటర్వ్యూ ఎట్ ది రియల్ న్యూస్, మే 1, 2010
 25. ACTU, హిస్టరీ ఆఫ్ ది ACTU (వెబ్సైటు), http://actu.com.au/AboutACTU/HistoryoftheACTU/default.aspx
 26. ICFTU పత్రికా విడుదల -కంబోడియా గురించి.
 27. అమ్నెస్టీ అంతర్జాతీయ నివేదిక 23 సెప్టెంబర్ 2005 - SINALTRAINAL సభ్యుడు జోస్ ఒనోఫ్రే ఏస్కుఇవెల్ లూనా యొక్క భద్రత గురించిన భయం.
 28. పారిశ్రామిక సంబంధాల పరిశోధన మరియు శిక్షణ నివేదిక కొరకు ఆస్త్రేలియన్ కేంద్రం.
 29. కర్డ్ డేవిడ్, క్రుగేర్ అలాన్. 1995 మిత్ అండ్ మెజర్మెంట్: కనిష్ట వేతనం యొక్క నూతన ఆర్ధిక విధానాలు. ప్రిన్స్టన్, NJ. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం.
 30. Kramarz, Francis (2006-10-19). "Outsourcing, Unions, and Wages: Evidence from data matching imports, firms, and workers" (PDF). Retrieved 2007-01-22.
 31. ఫ్రైడ్మ్యాన్, మిల్టన్. ధరల సిద్దాంతం
 32. "ది లీగల్ ఫెర్రేట్.నెట్" http://www.legalferret.net 22-Dec-2008 న పునరుద్దరించబడింది.

మరిన్ని విషయాలు

పుస్తకాలు

 • ది గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ట్రేడ్ యూనియన్స్: ఏ స్టడీ ఆఫ్ అపాతీ అండ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ అండ్ జనరల్ వర్కర్ యూనియన్ రచన జోసెఫ్ గోల్డ్ స్టీన్[1]
 • ది ఎర్లీ ఇంగ్లీష్ ట్రేడ్ యూనియన్స్: డాక్యుమెంట్స్ ఫ్రం హోం ఆఫీస్ పేపర్స్ ఇన్ ది పబ్లిక్ రికార్డ్ ఆఫీస్ రచన ఏ అస్పినల్[2]
 • మగ్నిఫిసెంట్ జర్నీ: ది రైజ్ ఆఫ్ ది ట్రేడ్ యూనియన్స్, రచన ఫ్రాన్సిస్ విలియమ్స్[3]
 • ట్రేడ్ యూనియన్స్ రచన అల్లన్ ఫ్లందేర్స్[4]
 • ట్రేడ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గ్రేట్ బ్రిటన్ రచన B C రోబర్ట్స్[5]
 • యూనియన్ పవర్: ది గ్రోత్ అండ్ చాలెంజ్ ఇన్ పర్స్పెక్తీవ్ రచన క్లాడ్ కాక్బర్న్[6]
 • డైరెక్టరీ ఆఫ్ ఎమ్ప్లాయర్స్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్, జాయింట్ ఆర్గనైజేషన్స్ &c — రచయితలూ ఎవరూ లేరు మరియు పేపర్ బ్యాక్ లో ఉత్పత్తి చెయ్యబడింది. [7]
 • ది హిస్టరీ ఆఫ్ ది TUC (ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్) 1868-1968: ఏ పిక్టోరియల్ సర్వే ఆఫ్ ఏ సోషల్ రివల్యూషన్ — సమకాలీన ముద్రణలు, డాక్యుమెంట్లు మరియు ఛాయాచిత్రాలతో వర్ణించబడింది, లిఒనేల్ బిర్చ్ చే సంపాదకీయం చెయ్యబడింది.[8]
 • Clarke, T. (1978). Trade Unions under Capitalism. Atlantic Highlands, NJ: Humanities Press. ISBN 0-391-00728-9. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • పనిత్చ్, లియో & స్వర్త్జ్, డోనాల్డ్ (2003). ఫ్రొం కాంసేంట్ టు సేర్సియోన్: ది అసాల్ట్ ఆన్ ట్రేడ్ యూనియన్ ఫ్రీడంస్, మూడవ సంపాదకీయం. ఒంటారియో: గరమౌండ్ ముద్రణాలయం.
 • ఫిల్ దైన్ (2007). స్టేట్ ఆఫ్ ది యూనియన్స్: హౌ లేబర్ కెన్ స్త్రెంతెన్ ది మిడిల్ క్లాస్, ఇంప్రూవ్ అవర్ ఎకనోమి, అండ్ రీగైన్ పోలిటికల్ ఇంఫ్లూయెన్స్, మక్ గ్రవ్-హిల్ ప్రొఫెషనల్. ISBN 978-0-07-148844-0

వ్యాసాలు

చలనచిత్రాలు

 • బ్రిటిష్ దర్శకుడు అయిన కేం లోచ్ దర్శకత్వం వహింసిహ్న 2000 చలనచిత్రం బ్రెడ్ అండ్ రోజెస్ లాస్ ఏంజెల్స్ లో మంచి జీతం మరియు పనిచేసే పరిస్థితుల కోసం మరియు ఒక సంఘంలో చేరే హక్కు కోసం క్లీనర్ల యొక్క కష్టాన్ని వర్ణించింది.
 • "హోఫ్ఫా" ఏ డన్ని దేవిటో చలనచిత్రం (1992): శక్తి కొరకు ధరను చెల్లించటానికి సిద్దంగా ఉన్న వ్యక్తి.""జాక్ నికొల్సన్ గివ్స్ ఏ గిగంటిక్ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్" - ది న్యూయార్క్ టైమ్స్
 • స్తుర్ల గున్నర్సన్ మరియు రాబర్ట్ కొలిసన్ తీసిన 1985 లఘు చిత్రం ఫైనల్ ఆఫర్ జనరల్ మోటర్స్తో ౧౯౮౪ సంఘం యొక్క బేరసారాలను చూపిస్తుంది.
 • 1979 చలనచిత్రం నోర్మ రే, మార్టిన్ రిట్ చే దర్శకత్వం వహించబడింది, ఇది క్రిస్టల్ లీ జోర్డాన్ తన యొక్క వస్త్ర కర్మాగారాన్ని సంఘంగా చెయ్యటానికి చేసిన ఒక విజయవంతమైన ప్రయత్నం యొక్క వాస్తవ కథ ఆధారంగా తీయబడింది.
 • ఇతర లఘుచిత్రాలు: మేడ్ ఇన్ L.A. (2007); అమెరికన్ స్తందోఫ్ఫ్ (2002); ది ఫైట్ ఇన్ ది ఫీల్డ్స్ (1997); విత్ బేబీస్ అండ్ బ్యానర్స్: స్టొరీ ఆఫ్ ది ఉమెన్స్ ఎమెర్జెన్సీ బ్రిగేడ్ (1979); హర్లన్ కౌంటీ USA (1976); ది ఇంహేరిటేన్స్ (1964)
 • ఇతర నాటకాలు: 10,000 బ్లాక్ మెన్ నేమడ్ జార్జ్ (2002); మతెవాన్ (1987); అమెరికన్ ప్లేహౌస్ --"ది కిల్లింగ్ ఫ్లోర్"(1985); సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ (1954); ది గ్రేప్స్ ఆఫ్ వ్రత్ (1940); బ్లాక్ ఫ్యూరి (1935)

బాహ్య లింకులు

అంతర్జాతీయం
ఆస్ట్రేలియా
ఐరోపా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

సూచనలు

 1. 1952 లో జార్జ్ అల్లెన్ మరియు అన్విన్ లిమిటెడ్ చే మొదటగా ప్రచురించబడింది (లండన్) మరియు అనేక మార్లు తిరిగి ముద్రించబడింది - ఆర్థూర్ డీకిన్ ముందుమాట వ్రాసారు.
 2. 1949 లో బ్యాచ్ వర్త్ ముద్రణాలయం (లండన్)చే ప్రచురించబడింది.
 3. ఒధంస్ ముద్రనాలయంచే (లండన్) 1954 లో మొదటగా ప్రచురించబడింది.
 4. మొదటగా హచిన్చ్సన్ (లండన్) చే 1952 లో ప్రచురించబడింది మరియు అనేక సార్లు తిరిగి ముద్రించబడింది.
 5. 1956 లో ది స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సన్స్ (లండన్)చే ప్రచురించబడింది మరియు తిరిగి ముద్రించబడింది.
 6. 1976 లో విలియం కిమ్బార్ (లండన్) చే మొదటగా ప్రచురించబడింది ISBN 0718301137
 7. HMSO (హర్ మేజేస్తీస్ స్టేషనరీ ఆఫీసు) చే 1986 న ప్రచురించబడింది ISBN 11 361250 8
 8. 1968 లో జార్జ్ వుడ్కాక్ యొక్క ముందుమాటతో 1968 లో హంలిన్/జనరల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ చే అధిక పేజీలతో ప్రచురించబడింది.