కార్ల్ సాగాన్

From tewiki
Jump to navigation Jump to search
Carl Sagan
జననం(1934-11-09)1934 నవంబరు 9
Brooklyn, New York
మరణం1996 డిసెంబరు 20(1996-12-20) (వయస్సు 62)
Seattle, Washington, U.S.
నివాసంUnited States[1]
జాతీయతAmerican
రంగములుAstronomy and planetary science
విద్యాసంస్థలుCornell University
Harvard University
చదువుకున్న సంస్థలుUniversity of Chicago
ప్రసిద్ధిSearch for Extra-Terrestrial Intelligence (SETI)
Cosmos: A Personal Voyage
Cosmos
Voyager Golden Record
Pioneer plaque
Contact
Pale Blue Dot
ముఖ్యమైన పురస్కారాలుOersted Medal (1990)
NASA Distinguished Public Service Medal (twice)
Pulitzer Prize for General Non-Fiction (1978)
National Academy of Sciences Public Welfare Medal (1994)

కార్ల్ ఎడ్వర్డ్ సాగాన్ (1934 నవంబరు 9-1996 డిసెంబరు 20)ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు,ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ (సృష్టి సంబంధమైన శాస్త్రము), ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, ఇంకా ఇతరేతర జీవ శాస్త్ర విషయాలను పాప్యులరైజ్ చేసిన ( జనబాహుళ్యంలో ఆసక్తిని రేకెత్తించడంలో ) విజయం సాధించిన ఘనుడు. కార్ల్ జీవిత కాలంలో, 600 కంటే ఎక్కువ సైంటిఫిక్ పేపర్స్, పాప్యులర్ ఆర్టికల్స్ రాశాడు. 20 పుస్తకాలకి పైగా అతడు రచయితగానో, సహ రచయితగానో లేక సంపాదకుడిగానో ఉన్నాడు. కార్ల్ రచనల్లో సంశయాత్మక పరిశీలనా, శాస్త్రీయ దృక్పథం ప్రతిపాదించబడ్డాయి. ఎక్సో బయాలజీకి ఆద్యుడు అతడే. కార్ల్ ఎక్స్ ట్రా టెరెస్ట్రియల్ (అధి భౌతిక) ఇంటిలిజెన్స్ (ఎస్.ఇ.టి.ఐ.)పరిశోధనలను ప్రోత్సహించాడు.

[2] సాగాన్ రాసిన పాప్యులర్ సైన్సు పుస్తకాలు అతడికి ఎంతో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి. 1980లో అవార్డు గెలుచుకున్న టెలివిజన్ సిరీస్ Cosmos: A Personal Voyageకి అతడే వ్యాఖ్యాత, సహ-రచయిత [2] కూడా. 'ఎబుక్ టు ఎకంపెనీ ది ప్రోగ్రామ్' అనే పుస్తకం కూడా ప్రచురింపబడింది. సాగాన్ కాంటాక్ట్ అనే నవల కూడా రాశాడు. ఈ కథ ఆధారంగా అదే పేరు మీద 1997 సినిమా తీశారు.

బాల్య జీవితం

కార్ల్ సాగాన్ బ్రూక్లిన్, రష్యన్ జ్యూయిష్ కుటుంబంలో న్యూయార్క్[3]లో జన్మించాడు. తండ్రి శామ్ సాగాన్, రష్యా నించి వలస వచ్చిన గార్మెంట్ వర్కర్ (బట్టల పని చేసేవాడు). కార్ల్ తల్లి రేచల్ మోలీ గ్రూబర్ ఇంటిపట్టునే ఉండేది. రేచల్ కి జన్మనిచ్చిన తల్లి ఖైయా క్లారా పై గల అపారమైన గౌరవం వల్లనే కార్ల్ కి ఆ పేరు పెట్టారు. సాగాన్ ఆమెని తలుచుకుని "నేనెన్నడూ చూడని నా తల్లి" అనేవాడు.[4] సాగాన్ రాహ్వే ఉన్నత పాఠశాల (ఉన్నత పాఠశాల), రాహ్వే, న్యూజెర్సీలో 1951[4]లో చదివాడు.

అతడికి ఒక కారోల్ అనే సోదరి ఉంది. వీరి కుటుంబం బ్రూక్లిన్ ప్రక్కనే ఉన్న బెన్సన్ హర్స్ట్ లో అట్లాంటిక్ సముద్రానికి దగ్గరగా తమ వసతికి సరిపోయే ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేవారు. సాగాన్, తాము పునరుద్ధరింపబడిన యూదు సంతతికి చెందిన వారమనీ, ఉన్న మూడు ప్రధానమైన యూదు జాతులలోనూ తమది ఉదార వైఖరి కలిగిన జాతి అనీ చెప్పుకున్నాడు. సాగాన్, అతడి సోదరీ కూడా తమ "తండ్రి మరీ అంత మత ఛాందసీకుడు కాదనీ, తమ తల్లి మాత్రం దైవాన్ని విశ్వసించేదనీ , తమ ఆరాధనా మందిరంలో చురుకైన పాత్ర వహించేదనీ , కోషర్ మాంసం [4]:12మాత్రమే వడ్డించేదనీ" చెప్పుకొస్తారు. పరిస్థితులు కడు దయనీయంగా మారిన నేపథ్యంలో, సాగాన్ తండ్రి థియేటర్ గేట్ కాపలావానిగా ఉద్యోగంలో చేరాడు.

చాలా విషయాల్లో పూర్తి "వ్యతిరేకం"గా సాగే సాగాన్ తల్లిదండ్రులు ఇద్దరితోనూ కీ డేవిడ్ సన్ కి అత్యంత సన్నిహిత పరిచయం ఉంది. దాని ఫలితమే సాగాన్స్ "ఇన్నర్ వార్" అనే గ్రంథం. తర్వాత కాలంలో సాగాన్ కి పరిశోధనల పై కలిగిన ప్రేరేపణకు మౌలిక కారణం "బాలికగా ఆగర్భ దారిద్ర్యం అనుభవించి"న తన తల్లేనని అన్నాడు. 1920[4]:2 దశకంలో ఆమె న్యూయార్క్ నగరంలో WWI సమయంలో దాదాపు ఇల్లు లేకుండా గడపడం జరిగింది. యువతిగా ఉన్నప్పుడే ఆమెకు మేథోపరమైన మహత్వ కాంక్షలు ఎన్నో ఉండేవి. కానీ అవన్నీ పేదరికం కారణంగా, ఆమె ఒక మహిళగా ఉన్నందున, వివాహిత మహిళగా ఉన్నందున, అందులోనూ యూదు మతానికి చెంది ఉన్న కారణంగానూ అవన్నీ సామాజిక నిర్బంధాల్లో భంగపరచబడ్డాయి. అందుకే డేవిఢ్ సన్, ఆమె అసంపూర్తి స్వప్నాలను పూర్తి చేస్తాడని అప్పటినించీ ఆమె తన ఏకైక సంతానం, కార్ల్ పై కోటి ఆశలు పెంచుకుంది[4]:2." అని రాశాడు.

డేవిడ్ సన్ రాసిన దాన్ని బట్టి, కార్ల్ కి "అద్భుతాలను గమనించే ఆసక్తి" తండ్రి నించే సంక్రమించింది. తండ్రి "జార్ నించి తప్పించుకుని వచ్చిన నెమ్మదైన, సుతిమెత్తని హృదయం గల శరణార్థి". అతడికి తీరిక చిక్కినప్పుడల్లా పేదవారికి యాపిల్స్ పంచుతూనో, న్యూయార్క్ లో "గందరగోళ" గార్మెంట్ (బట్టల)పరిశ్రమ[4]:2 లేబర్ మేనేజ్ మెంట్ లో తలెత్తే వత్తిళ్లను సర్దుబాటు చేయడంలోనో గడుపుతూ ఉండేవాడు. అద్భుతమైన మేధ, నక్షత్రాల గురించీ, డైనోసార్ల గురించీ అంత చిన్న పిల్లవాడి ఊహలూ" కార్ల్ నోటి వెంట వింటుంటే తండ్రికి పిల్లవాడి పట్ల భయమూ, భక్తీ రెండూ కలిగేవి. కొడుకు కుతూహలవశాత్తూ అడిగే ప్రశ్నలను, "ఎదిగే వయసులో ఇలాగే ఉంటారు"[4]:2 అనుకుంటూ తండ్రి దాటేసుకుని పోయేవాడు. తర్వాత కాలంలో రచయితగా, శాస్త్రవేత్తగా సాగాన్ శాస్త్రీయ విషయాలని ఉదహరించడానికి తరుచూ తన చిన్ననాటి జ్ఞాపకాలనే గుర్తు చేసుకునేవాడు. "విస్మరించిన పూర్వీకుల ఛాయలు" [4]:9 (షాడోస్ ఆఫ్ ఫర్ గాటెన్ యాన్సెస్టర్స్) లో అలాంటి జ్ఞాపకాలు సాగాన్ చాలా పేర్చాడు. తర్వాత తర్వాత తన ఆలోచనల మీద తన తల్లిదండ్రుల ప్రభావం ఎలా సాగిందో సాగాన్ వివరించాడు:

నా తల్లిదండ్రులు శాస్త్రవేత్తలు కారు. వారికి సైన్సు గురించి ఓనమాలు కూడా తెలియవు. కానీ ఏకకాలంలో సంశయ, విస్మయ భేదాలను వారు నాకు పరిచయం చేసిన వైనం గొప్పది. అందువల్లే సమన్వయం సాధ్యం కాని రెండు విభిన్న ధోరణులను ఎలా సమన్వయం చేసుకోవాలో నాకు అర్థమైంది. సరిగ్గా, శాస్త్రీయ దృక్పథానికి కావలసిన కీలకాంశం అదే" [5]

1939 విశ్వ ప్రదర్శన

సాగాన్ తనకు నాలుగైదు ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకు ఎదురైన అద్భుతమైన అనుభూతుల్లో ఒకదాన్ని గురించి గుర్తు చేసుకున్నాడు. సాగాన్ తల్లిదండ్రులు అతణ్ణి 1939లో న్యూయార్క్ లో జరిగిన "విశ్వ ప్రదర్శన"కి తీసుకుని వెళ్లారు. ఆ ప్రదర్శనలో ఉంచిన ప్రదర్శక సామాగ్రి అతడి జీవితాన్ని ఒక మలుపు తిప్పాయి. ప్రదర్శనిలో "రేపటి అమెరికా" అనే పేరుతో చైతన్యవంతంగా కదులుతూ ఉండే దేశ పటాన్ని ప్రదర్శించారు. అతడు ఇంకా గుర్తు చేసుకుంటూ, "అందులో జాతీయ రహదారులూ (హై వేస్), క్లోవర్ లీవ్స్ (రద్దీ తట్టుకోవడానికి వేర్వేరు ఎత్తుల్లో జరిగిన అనేక రహదార్ల నిర్మాణం), ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల భవనాలకు జనాన్ని తీసుకుని వెళ్లే మోటర్సూ, అందమైన చర్చి గోపురాలూ, ఫ్లైయింగ్ బట్రెస్ (పెద్ద పెద్ద భవనాలకు అండగా ఉండడానికి చేసే వాస్తు పరమైన) నిర్మాణాలూ, — అవన్నీ చూడడానికి ఎంత బావున్నాయో!"[4]:14 అని గుర్తు చేసుకున్నాడు. ప్రదర్శించిన మిగతా వస్తువుల్లో, ఒక ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఫ్లాష్ లైట్ వెలగడానికి ఎలా పటపట శబ్దం చేసిందో కూడా అతడికి గుర్తు ఉంది. ఇంకా ఫోర్క్ నించి వెలువడుతున్న సన్నటి రాగం ఆసిలోస్కోప్ (డోలాయమాన స్థితి ప్రదర్శించే పరికరం)లో ఎలా తరంగం సృష్టించి, దాన్ని వెనక్కూ, ముందుకీ కదిలించిందో కూడా అతడికి గుర్తుంది. అతడు అప్పుడే భవిష్యత్తులో మీడియా టెక్నాలజీ (సమాచార, సాంకేతిక వ్యవస్థ)లో రేడియో స్థానాన్ని టెలివిజన్ ఆక్రమిస్తుందనే విషయాన్ని కూడా గ్రహించాడు. సాగాన్ ఇలా వ్రాశాడు:

నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఊహించలేనన్ని విస్మయాలు ఈ ప్రపంచం నిండా అనంతంగా నిండి ఉన్నాయి. స్వరం చిత్రంలా మారిపోవడం, కాంతి శబ్దంగా మారడం ఎలా సంభవిస్తోంద?" [4]:14ని నాకెంతో ఆశ్చర్యంగా ఉండేది.

ఆ ప్రదర్శనలో అందర్నీ అమితంగా ఆకర్షించిన దృశ్యం 'ఫ్లషింగ్ మీడోస్ (ప్రాంతం పేరు)లో టైం కేప్స్యూల్ ని పూడ్చి పెట్టడం'. 1930నాటి కొన్ని మెమెంటోలు కూడా అందులో ఉంచారు. రాబోయే సహస్రాబ్దుల్లో ఈ భూమి మీద జనించబోయే మన వారసులు దాన్ని బయటకు తెచ్చుకుంటారన్నమాట. "ఈ టైం కేప్స్యూల్ నన్నెంతో రోమాంచితం చేసింద"ని కార్ల్ పేర్కొన్నాడని డేవిడ్ సన్ రాసుకొచ్చాడు. పెద్దవాడయ్యాక, సాగాన్ తన సహచరులతో కలిసి అలాంటి కేప్స్యూల్స్ నే తయారు చేశాడు. కానీ ఇది గ్యాలక్సీలోకి కూడా దూసుకుని వెళ్ళగలిగే సామర్థ్యంతో నిర్మితమైంది. 'పయనీర్ ప్లేక్', వాయేజర్ గోల్డెన్ రికార్డు [4]:15 రికార్డుల ప్రకారం, మరిచిపోలేని తన విశ్వ ప్రదర్శన జ్ఞాపకాల ప్రభావం కారణంగానే వాటిని అతడు అలా నిర్మించగలిగాడు.

రెండవ ప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాగాన్ కుటుంబం తమ యూరోప్ లో ఉన్న తమ బంధువుల గురించి చాలా కలత చెందింది. వారి అపార్ట్ మెంట్ కి దగ్గరగా ఉన్న బీచ్ లోనే జరిగిన యుద్ధం జరగడం అతడికి ఇంకా స్మృతి పథంలో మెదులుతూనే ఉండేది. హిట్లర్ పంపిన "వుల్ఫ్ ప్యాక్" జలాంతర్గాములు వాణిజ్య నౌకలను వినాశనం చేస్తున్నప్పటి భయానక శబ్దాలు మరీ వాళ్ల ఇంటి ప్రక్కనే జరిగినట్టు జరిగాయి. పిల్లలు బీచ్ వెంబడే నడుస్తూ, నౌకా శిథిలాలూ, మానవుల శరీర భాగాలూ, ఇసుక మీద పడి ఉండడం చూసి, చలించిపోయేవారు. సాగాన్ కి అసలు ఆ యుద్ధం ఎందుకు జరుగుతోందో అర్థమయ్యింది కాదు. అతను ఇలా రాసుకొచ్చాడు, "అవును, మా బంధువులు సామూహిక హత్యకు గురయ్యారు. హిట్లర్ మా ఇంట్లో అందరి నోళ్లలోనూ తరచుగా నానుతుండేవాడు.... కానీ ఇంకో వైపు, ఆ భయంకరమైన యుద్ధ పరిణామంగా నేను ఘోరంగా అవమానాల పాలు అవుతుండేవాణ్ణి". అతని సోదరి, కారోల్ ఈ విధంగా చెప్పింది "మా అమ్మ అందరి కన్నా ఎక్కువగా కార్ల్ రక్షింపబడాలని కోరుకునేది... రెండవ ప్రపంచ యుద్ధమూ, సామూహిక హత్యల[4]:15 పేరూ చెప్పి ఆమె అనూహ్యమైన కష్టకాలం చవి చూసింది". తన జీవితంలో తీవ్ర సంఘర్షణా సమయంలో ఐరోపా తమ బంధువులు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, మనసు అనుభవించి సంక్షోభాన్నిసాగాన్ "పిశాచం వెంటాడిన ప్రపంచం" (ది డెమన్ హాంటెడ్ వరల్డ్) (1996)అనే పుస్తకంలో ఉల్లేఖించాడు. కానీ తనకి ఉన్న [5] ఆశావహ దృక్పథం ఆసరాగా ఆ సంక్షోభాన్ని లెక్క చెయ్యకుండా ఉండడానికే అతడు అన్ని వేళలా ప్రయత్నించాడు.

డేవిడ్ సన్ తన పుస్తకంలో "కంటికి ఎదురుగా జరుగుతున్న విషయాలు కార్ల్ కి కనిపించకుండా చేయడం వల్ల అతడు ఆశావాదిగా ఉంటాడని అతడి తల్లి ఆశించింది" అంటూ రాశాడు. అయితే భావావేశపరంగా, ఆశావహ దృక్పథం అతడికి గొప్ప బలమైతే, ఆలోచనాపరంగా, అది గొప్ప లొంగుబాటు. 50 సంవత్సరాలు వచ్చినా, అతడికి రాజకీయ సాధుత్వమే తప్ప కరుకుదనం లేకపోయింది. అది అతణ్ణి మానసిక అంధుడిగా మార్చింది. చివరికి కళ్లు తెరిచేనాటికి అతడి మానసిక ఈడెన్ తోటలో డ్రాగన్ ని ఎదుర్కోవలసి వచ్చింది, అది "అణ్వస్త్ర యుగం, అతి భయంకర వినాశనం"[4]:15.

ప్రకృతిని గురించి సవాలక్ష ప్రశ్నలు

ప్రాథమిక పాఠశాలలో చేరిన వెంటనే, అతడు ప్రకృతిని ఎంతో లోతైన పరిశీలిస్తూ, ప్రశ్నల వర్షం కురిపిస్తుండేవాడు. మొదట్లో సాగాన్ సార్వజనిక (పబ్లిక్) గ్రంథాలయానికి ఒంటరిగా వెళ్లి వచ్చే రోజులను తల్చుకున్నాడు. అతడికి ఐదు సంవత్సరాలు ఉండి ఉంటాయేమో, తల్లి అతడి కోసం గ్రంథాలయ కార్డు తెచ్చి ఇచ్చింది. "నక్షత్రాలు అంటే ఏమిటి?" అని సందేహం సాగాన్ కి కలిగింది. తన స్నేహితులు గానీ, తల్లిదండ్రులు గానీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు.

సాగాన్ ఈ విధంగా చెప్పాడు ..."అందుకని నేను గ్రంథాలయ సంరక్షకుని దగ్గరికి వెళ్లేవాడిని. నక్షత్రాల మీద పుస్తకం ఇవ్వమని కోరేవాడిని ... నా ఆసక్తికి బదులుగా నా చేతికి అందిన ఆ పుస్తకం పేజీలు తిప్పుతుంటే అంతులేని ఆశ్చర్యం! "సూర్యుడు ఒక నక్షత్రం!అంతే కాదు, పైగా మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం. నక్షత్రాలు అన్నీ సూర్యుళ్లే !. కానీ చాలా ఎక్కువ దూరాల్లో ఉన్నాయి కాబట్టి, అవి చిన్న దీపాల్లాగా కనిపిస్తున్నాయి, అంతే ...!" ఈ కోణంలో నించి చూసేసరికి విశ్వ కొలమానం ఒక్కసారిగా కంటికి ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. అది ఒక విధమైన అతీత స్థాయికి చెందిన మార్మిక అనుభూతి! ఒక దివ్యానుభవం! పరమాద్భుతం ! ఆ స్కేలు నన్ను ఎన్నటికీ వదల లేదు. ఎన్నటికీ...! ఒక్క క్షణం కూడా వదల లేదు". [4]:18

అతడికి ఆరు, ఏడు ఏళ్లు ఉన్నప్పుడు, తన సన్నిహిత మిత్రునితో కలిసి న్యూయార్క్ సిటీలో ఉన్న అమెరికన్ ప్రాకృతిక చరిత్ర పురావస్తు ప్రదర్శనశాలకి తరుచూ వెళ్తుండేవాడు. అక్కడ ఉన్న హెడెన్ ప్లానెటోరియమ్ కి వెళ్లి, మ్యూజియమ్ లో ప్రదర్శనకు పెట్టిన విశ్వానికి సంబంధించిన ఉల్కా పాతపు అవశేష వస్తువులనూ, డైనోసార్స్ నీ, జంతువులనూ సహజమైన ఆకృతుల్లో చూశాడు. సాగాన్ అప్పటి సందర్శనల గురించి ఇలా రాశాడు:

"నేనైతే జీవం ఉట్టిపడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ జంతువుల్నీ, వాటి నివాస స్థలాలనీ చూసి నిశ్చేష్టుణ్ణి అయ్యాను. "మసక వెలుతురులో అంటార్కిటిక్ ఐస్ లో పెంగ్విన్స్...గొరిల్లాల కుటుంబం, అందులో మగది గుండెలు బాదుకుంటోంది...! మరో చోట బూడిద రంగులో మెరుస్తూ పదీ, పన్నెండు అడుగుల పొడుగు ఉండే ఓ అమెరికన్ ఎలుగుబంటి దాని వెనుక కాళ్ల మీద నించుని, కళ్లల్లో కళ్లు పెట్టి నా వంకే సూటిగా చూస్తూ నించుంది!" [4]:18

సాగాన్ తల్లిదండ్రులు అతడికి సైన్స్ విషయాల్లో ఎక్కువగా ఆసక్తి ఉంటోందని గమనించి అతడికి రసాయన శాస్త్రానికి సంబంధించిన సెట్స్, చదువుకునేందుకు మరింత పఠన సామాగ్రీ తెచ్చి పిల్లవాని చదువుకి చేతనైనంత సాయం చేసేవారు. సాగాన్ కి ప్రధానంగా అంతరిక్షం మీద అంత ఆసక్తి జనించడానికి కూడా మూల కారణం అతడు ఎడ్గార్ రైస్ బర్రోస్ రచించిన సైన్సు ఫిక్షన్ కథలు చదవడమే. దానితో అంగారక గ్రహం (మార్స్) వంటి ఇతర గ్రహాల మీద కూడా జీవం ఉండి ఉండవచ్చనే ఊహలు అతడి మనసులో ప్రాణం పోసుకున్నాయి. రే స్పాంజెన్ బర్గ్ అనే జీవిత చరిత్రకారుడు సాగాన్ గురించి వర్ణిస్తూ, "సాగాన్ అంత చిన్ననాటి నించే గ్రహాలకు సంబంధించిన రహస్యాలను అర్థం చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నించేవాడు. ఆ నిరంతర ప్రయత్నమే అతడి జీవితానికి చోదక శక్తి అయింది. ఉండి ఉండీ అతడి బుద్ధిలో చటుక్కున మెరిసి మాయమౌతూ, అతడి సూక్ష్మ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉండేది. ఆ అన్వేషణ ఎన్నటికీ మరువలేనిది"[5]

విద్యా వికాసం - విస్తృత శాస్త్రీయ వ్యాపకం

సాగాన్ చికాగో విశ్వవిద్యాలయంలో చేరి,[6] రేయర్సన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నించి 1954లో జనరల్ మరియు విశిష్ట శ్రేణుల్లో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఏ.)పట్టా పొందాడు. బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ 1955లోనూ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ 1956 లోనూ పూర్తి చేశాడు. ఖగోళ శాస్త్రంలోనూ, ఖగోళ భౌతిక శాస్త్రంలోనూ అతడు 1960లో డాక్టరేట్[7] పట్టా పొందాడు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే సాగాన్ హెచ్.జె.ముల్లర్ దగ్గర లేబొరేటరీ జెనెటిసిస్ట్ (ఉత్పత్తి శాస్త్ర అధ్యయనవేత్త) గా చేరాడు. 1960 నుండి 1962 వరకూ సాగాన్ బెర్క్ లీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మిల్లర్ ఫెలోగా ఉన్నాడు. 1962 నుండి 1968 వరకూ, అతడు మెసాచుసెట్స్, కేంబ్రిడ్జిలో ఉన్న స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీలో పనిచేశాడు.

1971లో న్యూయార్క్ లో కార్నెల్ విశ్వవిద్యాలయంలో చేరే వరకు, సాగాన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1968 వరకూ ఉపన్యాసాలు ఇచ్చాడు మరియు పరిశోధన చేశాడు. అతడు పూర్తికాలిక ప్రొఫెసర్ పదవిలో చేరాడు. అతడు అక్కడ గ్రహ సంబంధమైన అధ్యయనం నిర్వహించే ప్రయోగశాలకి డైరెక్టర్ గా వ్యవహరించాడు. 1972 నుండి 1981 వరకూ, సాగాన్ కార్నెల్ లో రేడియో ఫిజిక్స్ మరియు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నాడు.

అమెరికన్ అంతరిక్ష కార్యక్రమం (స్పేస్ ప్రోగ్రామ్) ఆరంభం నించీ సాగాన్ దానితో ముడిపడే ఉన్నాడు. 1950 తర్వాత నాసాకు సలహాదారుగా పనిచేశాడు. చంద్రుడి మీద దిగబోయే అపోలో అంతరిక్ష యాత్రికులకు ముందుగా సూచనలు అక్కడ అతడు నిర్వర్తించవలసిన బాధ్యతల్లో ఒకటి. సౌర వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేయడానికి ప్రయోగించబడిన ఎన్నోరోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ రోదసిలో నిర్వహించవలసిన ప్రయోగాలను సిద్ధం చేయడం ద్వారా సాగాన్ సైన్సు రంగానికి తన విలువైన సేవలు అందించాడు. సౌర మండలాన్ని వీడి అనంత దూరాలకు సాగిపోయే రోదసీ నౌక (స్పేస్ క్రాఫ్ట్)లో మార్చబడని విధంగా ఒక విశ్వజనీనమైన సందేశం అవశ్యంగా ఉండి తీరాలనీ, ఒకవేళ అంటూ గ్రహాంతరవాసులే ఉండి, దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే వారి మేథకి అది సులభగ్రాహ్యంగా అందాలనీ సాగాన్ ఆలోచించాడు. సాగాన్ అలా అంతరిక్షంలోకి పంపించిన మొట్ట మొదటి పదార్థపరమైన సందేశం : ఒక బంగారు పూతగల గుండ్రని పళ్లెం ఆకారంలో గల గోల్డెన్ అనోడైజ్డ్ ప్లేక్. దాన్ని 1972లో అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లిన పయొనీర్10లో అమర్చారు. మరో సంవత్సర కాలంలోనే అదీ 1973లోనే పయొనీర్ 11 లో కూడా మరో ప్లేక్ కాపీ వెళ్లింది. అతడు తన డిజైన్స్ ని మరింత వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ ఈ దిశగా ముందుకు సాగాడు. అతడు వాయేజర్ గోల్డెన్ రికార్డ్ ని మరింత విస్తారంగా మెరుగుపరిచి, దానిలో మరిన్ని సందేశాలను ఇమడ్చడంలో అతడు మరువలేని కృషి చేశాడు. ఆ రికార్డులో నిక్షిప్తమైన సందేశం 1977లో అంతరిక్ష రహస్యాలు పరిశోధించే వాయేజర్ స్పేస్ ప్రోబ్స్ లో ఒకటిగా విశ్వంలోకి వెళ్లింది. పరిశోధనలకు కావలసిన ధనానికి సంబంధించి సాగాన్ తరుచూ రోబోటిక్ పరిశోధనల[8] కంటే కూడా చాలా ఎక్కువగా స్పేస్ షటిల్, స్పేస్ స్టేషన్స్ మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందని బలంగా చెప్పేవాడు.[8]

1996లో అతడికి మైలోడిస్పాస్టిక్ సిండ్రోమ్ తిరగబెట్టి న్యుమోనియా వచ్చింది. ఆ తర్వాత అతడు కొద్ది నెలల్లోనే చనిపోయాడు. అతడు మరణించే వరకూ కూడా కార్నెల్ సాగాన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1968 వరకూ ఉపన్యాసాలు ఇచ్చాడు. పరిశోధన చేశాడు.లో "సంక్లిష్ట చింతన" (క్రిటికల్ థింకింగ్) మీద ఉపన్యాసాలు ఇచ్చాడు.

శాస్త్రీయ విజయాలు

శుక్ర గ్రహ ఉపరితల అత్యధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి జరిగిన పరిశోధనల్లో సాగాన్ చేసిన పరిశోధనలు చాలా కీలకమైనవి. 1960 ల వరకూ శుక్ర గ్రహ ఉపరితల పరిస్థితులు ఇలా ఉండవచ్చని తెలిపే మౌలిక ఆధారాలు ఏవీ లేవు. సాగాన్ ఆ తనకున్న అధ్యయన ఆధారాల బట్టి, ఊహించి అక్కడి పరిస్థితులు, ఇదిగో, ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కొన్ని సంభావ్యతలను ఒక నివేదిక రాసి పెట్టాడు. దానికున్న శాస్త్రీయ విలువ ఆధారంగానూ, సైన్సు ప్రచారంలో భాగంగానూ, ఆ రిపోర్టుని తదనంతరం "టైం లైఫ్ బుక్", ప్లానెట్స్ అనే గ్రంథంలో ప్రచురించారు. సాగాన్ వరకూ చెప్పాలంటే, శుక్రుడు ఒక శుష్క గ్రహం. పైగా మనమంతా ఊహించినట్టు దాని ఉపరితలం చక్కగా నిగనిగలాడుతూ, నునుపుగా లేదు! అందుకు పూర్తి భిన్నంగా 500 సెల్సియస్ (900 ఫారన్ హీట్ డిగ్రీలు)డిగ్రీలతో 500 °C (900 °F)ఉష్ణోగ్రత అక్కడి ఉపరితలాన్ని పేల్చి పారేస్తూ ఉంటుందని సాగాన్ కనుక్కున్నాడు. సాగాన్ ఇలాంటి అంచనాకి రావడానికి అక్కడ నించి వెలువడుతున్న రేడియో ఉద్గారాలే మూలాధారం. నాసా జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాలకి విజిటింగ్ సైంటిస్ట్ గా, శుక్ర గ్రహానికి వెళ్లిన మొదటి మారినర్ యాత్రలకు సాగాన్ నమూనాల విషయంగానూ, ప్రాజెక్ట్ నిర్వహణ విషయంగానూ ప్రధాన అంశాల్లో తన సహకారాన్ని అందించాడు. 1962లో మారినర్ 2 శుక్ర గ్రహ ఉపరితల సంబంధమైన సాగాన్ అంచనాలను నిర్థారించింది.

అలాగే శని గ్రహ చంద్రుడైన టైటాన్ ఉపరితలం మీద తరళ సంయోగ పదార్థాలతో సముద్రాలు కదలాడుతూ ఉండి ఉండవచ్చనీ, ఇంకా బృహస్పతి చంద్రుడైన యూరోపా ఉప ఉపరితలంలో నీటి సముద్రాలు ఉండి ఉండవచ్చనీ సాగాన్ ఊహలు సాగించాడు.[9] ఈ నిర్ధారణ వల్ల యూరోపా ప్రాణులు నివసించడానికి చాలా బలమైన ఆధారంగా ఉంది. యూరోపా ఉప ఉపరితలంలో నీటి సముద్రాలు ఉన్నాయని గెలీలియో అంతరిక్ష నౌక కూడా పరోక్షంగా ఆ తర్వాత నిర్థారించింది. ఇంకా సాగాన్, టైటాన్ మీద కనిపించిన ఆ కపిల వర్ణపు పొగమంచు రహస్యాన్ని కూడా ఛేదించాడు. అది కొన్ని రకాల సంక్లిష్ట సహజ పరమాణువులతో కూడిన పొగమంచనీ, అది చంద్రుని మీద కురిసే నిరంతర వర్షాల కారణంగా ఏర్పడిందనీ వెల్లడించాడు.

శుక్ర, బృహస్పతి గ్రహాలతో బాటు అంగారక గ్రహం మీద మారే ఋతువుల మార్పిడికి సంబంధించిన లోతైన పరిశోధనలు కూడా అతడి వల్లనే వెలుగులోకి వచ్చాయి. శుక్ర గ్రహం మీద వాతావరణం చాలా వేడిగా ఉంటుందనీ, ఉపరితలం వైపుకి వెళ్తున్న కొద్దీ వత్తిళ్లు సాంద్రతరమవుతాయనీ సాగాన్ స్థిరీకరించాడు. అలాగే భూ ఉపరితలం వేడెక్కడం మానవుడు తనకు తానుగా కోరి తెచ్చుకుంటున్న అనర్థమని కూడా సాగాన్ గ్రహించగలిగాడు. ఈ సంగతిని శుక్ర గ్రహం దాని సహజ గతిలో ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతుండడంతో పోల్చాడు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నడుస్తున్న ఈ భూగ్రహ వాతావరణం మెల్లగా జీవ-నాశకంగా తయారవడానికే దారితీస్తుందనీ పరిశీలించాడు. సాగాన్ తన కార్నెల్ విశ్వవిద్యాలయం సహచరుడు ఎడ్విన్ ఎర్నెస్ట్ సాల్ పీటర్ తో కలిసి బృహస్పతి మేఘాల్లో జీవ సంబంధమైన సూచనలు ఏమైనా ఉండి ఉండాలని గట్టి నమ్మికతో పరిశోధించాడు. ఎందుకంటే అతడి విశ్వాసాన్ని బలపరిచేలా గ్రహానికి సంబంధించిన వాతావరణంలో చేరిన సహజ సేంద్రియ పరమాణువుల సమ్మేళనం అంత విస్తారంగానూ ఉంది మరి. అంగారక గ్రహ ఉపరితలం మీద వస్తున్న రంగు మార్పిడి గురించి ముందు జరిగిన పరిశీలనలనూ అతడు అధ్యయనం చేశాడు. వారు నమ్మినట్లుగా ఆ మార్పులు ఋతువులకు సంబంధించినవి గానీ, ఓషధుల మార్పులకు సంబంధించినవీ కాదనీ కనుగొన్నాడు. బహుశా ఆ రంగు ఏర్పడడానికి కారణం ఉపరితలం మీద ప్రచండంగా వీచే గాలి తుఫానుల వల్ల చెలరేగి వాతావరణం అంతటా పరుచుకున్న ధూళి తప్ప మరేం కాదని సిద్ధాంతీకరించాడు.

రసాయన మూలకాల నుంచి రేడియేషన్[10] ద్వారా ఎమినో యాసిడ్స్ ఉత్పన్నం చేయవచ్చుననే ప్రయోగాత్మక నిరూపణలతో సహా గ్రహాంతరవాస జీవుల గురించి జరిగిన పరిశోధనల్లో సాగాన్ పేరు ప్రఖ్యాతంగా వినిపిస్తుంది.

సాగాన్ సేవలకు 1994లో "ప్రజా సంక్షేమ పదకం" (పబ్లిక్ వెల్ఫేర్ మెడల్)కూడా అందుకున్నాడు. ఆ పదకం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు [11]"ప్రజా సంక్షేమం కొరకు సలిపిన విశిష్టమైన శాస్త్రీయ పరిశోధనల" కోసంగా ఉద్దేశించబడింది.

శాస్త్ర దృక్పథ సమర్థన

సంస్థ యొక్క ఫౌండింగ్‌లో ప్లానెటరీ సొసైటీ మెంబర్స్‌కుడివైపు కూర్చున్న వ్యక్తి కార్ల్‌ సాగన్‌

ఆలోచనలను వెలిబుచ్చడంలో సాగాన్ గొప్ప సమర్థుడు. విషయాన్ని విడమర్చి చెప్పడంలో నేర్పరి కావడం వల్ల అంతరిక్షానికి సంబంధించి అతడు మాట్లాడే లోతైన విషయాలు కూడా సామాన్య జనం అర్థం చేసుకోగలిగేవారు. అతడు మానవ జాతి విలువనీ, అర్హతనూ నొక్కి చెప్పేవాడు. అదే సమయంలో విశ్వంలో నించి చూస్తే భూమి ఎంత అప్రధానమైనదో కూడా వివరిస్తుండేవాడు. 1977లో రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లండన్ లోని రాయల్ ఇన్స్టిట్యూషన్ లో రాయల్ ఇన్స్టిట్యూషన్ క్రిస్ట్ మస్ ఉపన్యాసాలు ఒక సిరీస్ లో ఇచ్చాడు. ఆన్ డ్రుయాన్ తో కలిసి అతడు సహ రచయితగా, అతిథిగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తూ, జాకబ్ బ్రొనౌస్కీ విరచిత ది ఎసెంట్ ఆఫ్ మ్యాన్ కి రూప కల్పన చేసి, PBSCosmos: A Personal Voyage టెలివిజన్ కి పదమూడు భాగాల సిరీస్ ని అందించాడు.

సాగాన్ గ్రహాంతర వాస జీవనం కోసం సాగే అన్వేషణల్ని బలంగా సమర్థించాడు. వింత జీవాకృతుల్లో ఉండడానికి అవకాశం ఉన్న గ్రహాంతర వాసులు వెలువరించే సంకేతాలు రేడియో టెలిస్కోపుల ద్వారా వినమని సైంటిఫిక్ కమ్యూనిటీని అతడు అర్థించాడు. ఆ విషయంలో అతడు ఎంత పట్టు పట్టాడంటే, 1982లో అతడు సైన్సు జర్నల్ లో ప్రచురించిన "సెటి" (SETI)అభ్యర్థనా పత్రాన్ని తెచ్చి దాని మీద ఏడు మంది నోబెల్ ప్రైజ్ విజేతలతో సహా 70 మంది శాస్త్రవేత్తలతో ఆ విషయంలో అతడు ఎంత పట్టు పట్టాడంటే, 1982లో అతడు సైన్సు జర్నల్ లో ప్రచురించిన సెటి (SETI)అభ్యర్థనా పత్రాన్ని తెచ్చి దాని మీద ఏడు మంది నోబెల్ ప్రైజ్ విజేతలతో సహా 70 మంది శాస్త్రవేత్తల సంతకాలు సేకరించాడు. వైరుధ్యాలతో కూడుకుని ఉన్న ఈ శాస్త్ర రంగం అంత గౌరవప్రదంగా ఈ విషయం పట్ల తమ ఐక్యతను ప్రదర్శించింది. డా. ఫ్రాంక్ డ్రేక్ ఆర్సిబో సందేశం రాస్తుంటేనూ సాగాన్ సహకరించాడు. అది ఒక రేడియో సందేశం. ఆ సందేశం ఆర్సిబో రేడియో టెలిస్కోప్ నించి 1974 నవంబరు 16 నాడు అంతరిక్షంలోకి పంపబడింది. అది గ్రహాంతర వాసులకు భూమి గురించి ఎరుక పరిచే నిమిత్తమే వదలిన సందేశం.

సాగాన్ ప్రొఫెషనల్ ప్లానెటరీ రిసెర్చి జర్నల్ ఇకారస్కి ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా ఉన్నాడు. ప్లానెటరీ సొసైటీకి అతడు సహ సంస్థాపకుడు. ఈ సొసైటీ అంతరిక్షం పట్ల ఆసక్తి ఉన్న వారు ఉంటారు. ఇందులో 100,000కి పై సంఖ్యలో 149 దేశాల నించి చేరిన సభ్యులు ఉంటారు. అతడు "సెటి" బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో సభ్యునిగా కూడా ఉన్నాడు. సాగాన్ అమెరికన్ ఆస్ట్రొనామికల్ సొసైటీ ప్లానెటరీ సైన్స్ విభాగానికి ఛైర్మన్ గానూ,అమెరికన్ జియో ఫిజికల్ యూనియన్ ప్లానెటోలజీ విభాగానికి అధ్యక్షుడిగానూ, అలాగే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్స్ ఆస్ట్రోనమీ సెక్షన్ కి ఛైర్మన్ గా తన విలువైన సేవలు అందించాడు.

జాతుల మధ్య అంతర్యుద్ధం శిఖరాగ్ర స్థాయిని చేరుకున్న తరుణం అది. గణిత శాస్త్ర అంచనాల ప్రకారం వాతావరణం అణ్వాయుధాలు ప్రయోగం వల్ల భూమికి ప్రస్తుతం ఉన్న ఆ సున్నితమైన సంతులిత స్థాయి జారిపోవచ్చునని అర్థం చేసుకున్న సాగాన్ పరమాణు యుద్ధం వల్ల జరగబోయే ఘోర అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేపట్టాడు. రిసెర్చి పేపర్ లాగా రాసిన ఆ రిపోర్టు "TTAPS" పేరుతో ఐదుగురు ప్రఖ్యాత సైంటిస్టుల ద్వారా రాయబడింది. వారిలో సాగాన్ ఒకడు. అందులో "ఎస్" అక్షరం సాగాన్ ని సూచిస్తుంది. అంతే కాక, న్యూక్లియర్ యుద్ధం[12] తర్వాత గ్లోబల్ : "న్యూక్లియర్ వింటర్" (శీతాకాలం) రావచ్చుననే మరో శాస్త్రీయ సిద్ధాంతానికి సంబంధించి కూడా అతడు అంచనా వేశాడు. అలాగే "ఏ మనిషీ ఊహించని ఓ దారి" (ఎ పాత్ వేర్ నో మ్యాన్ థాట్) అనే గ్రంథానికి సహ రచయితగా ఉన్నాడు :"న్యూక్లియర్ వింటర్", "ది ఎండ్ ఆఫ్ ది ఆర్మ్స్ రేస్ " (ఆయుధ స్పర్థ చివరలో), అనే ఈ రెండు గ్రంథాలూ న్యూక్లియర్ శీతాకాల లక్షణాల మీద నిశితమైన అవగాహన కల్పిస్తాయి.

జీవ ఆవిర్భావం మొదలుకుని, విశ్వంలో మన భూగోళపు ఉనికి వరకూ అనేక దృక్పథాలూ, శాస్త్రీయ విషయాలూ ఎన్నో విషయాలు ఈ "కాస్మోస్"లో వివరించబడ్డాయి. 1980 లో ఈ విషయాలను పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ లో ధారావాహిక కార్యక్రమంగా ప్రసారం చేశారు. అది "ఎమ్మీ", "పీ బోడీ" అవార్డులు గెలుచుకుంది. ఈ కార్యక్రమాన్ని తర్వాత 60 దేశాల్లో 500 మిలియన్ల ప్రజలు[2][13] వీక్షించారు. బహుళ సంఖ్యలో ప్రేక్షకులు తిలకించిన PBS [14] కార్యక్రమంగా ఆ సీరియల్ చరిత్రలో తన స్థానం పదిలపరుచుకుంది.[14]

ప్రజల్లో సైన్సు పట్ల ఆసక్తి నెలకొనేలా సాగాన్ పాప్యులర్ సైన్స్ రచనలు కూడా చేశాడు. "కాస్మోస్" (అంతరిక్షం)అలాంటి పుస్తకమే. సాగాన్ "ఎ పర్సనల్ వాయేజ్" లోని కొన్ని సిద్ధాంతాలను ఇది మరింతగా విస్తరించినట్టు కనిపిస్తుంది. ఆ పుస్తకం ఆంగ్లం[15]లో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. ఇతడు రచించిన "ది డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ : స్పెక్యులేషన్స్ ఆన్ ది ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటలిజెన్స్"కి పులిట్జర్ ప్రైజ్Broca's Brain: Reflections on the Romance of Science కూడా వచ్చింది. సాగాన్ రచనల్లో బాగా అమ్ముడుపోయిన మరో సైన్సు ఫిక్షన్ నవల "కాంటాక్ట్ ". కానీ ఆ పుస్తకం ఆధారంగా 1997లో జోడీ ఫాస్టర్ తో మోషన్ పిక్చర్ అడాప్టేషన్ సినిమా నిర్మించేదాకా అతడు బ్రతికిలేడు. ఆ సినిమా 1998 హ్యూగో అవార్డ్ ని గెలుచుకుంది.

అతడు కాస్మోస్ కి కొనసాగింపుగా "పేల్ బ్లూ డాట్" (పాలిపోయిన నీలి చుక్క)ని కూడా రాశాడు. అది అంతరిక్షంలో మానవ భవితని గురించిన ఊహాత్మక దృశ్యాన్ని ఇస్తుంది. ది న్యూయార్క్ టైమ్స్ 1995లో బ్లూ డాట్ ని గొప్ప పుస్తకంగా ఎంపిక చేసింది. సాగాన్ జనవరి 1995[16] లో పిబిఎస్ చార్లీ రోజ్ కార్యక్రమంలో కనిపించాడు.[16] సాగాన్ స్టీఫెన్ హాకింగ్ రాసిన "ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్" కి పరిచయ వాక్యాలు కూడా రాశాడు. సైన్సుని ప్రజల మనసుల్లో నింపడానికి విశేషమైన కృషి చేసిన వాడిగా సాగాన్ సైన్సు చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. సామాన్య ప్రజానీకం కూడా సరైన శాస్త్ర బద్ధమైన సంశయాత్మక దృక్పథంతో విషయాలను పరిశీలించాలనీ, సూడోసైన్స్ ప్రచారం చేసే మిథ్యా అపోహలు, అవాస్తవమైన ధోరణుల మీద విశ్వాసం పెంచుకోకుండా చూడాలనే అతని తపన అంతా. ఆ ప్రయత్నాలన్నీ మనకు "డిబంకింగ్" ఆఫ్ ది బెట్టీ అండ్ బార్నీ హిల్ అబ్డక్షన్ లో కనిపిస్తుంది.[17] సాగాన్ మరణించిన దశాబ్ది సందర్భంగా అతడి దగ్గర చదువుకున్న విద్యార్థి డేవిడ్ మోరిసన్, సాగాన్ తో తనకున్న వ్యక్తిగత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. సాగాన్ గ్రహ పరిశోధనలకు సంబంధించి అందించిన విశేషమైన సహకారం, జన సామాన్యానికి సైన్సు గురించిన అవగాహన, ఆయన బలంగా ప్రతిపాదించే సంశయాత్మక దృక్పథం వంటి అమూల్యమైన విషయాల గురించి అతడు స్కెప్టికల్ ఎంక్వైరర్ [17] అనే పుస్తకంలో పదిలపరిచాడు.

సాగాన్ జనవరి 1991లో "కువైట్ ఆయిల్ మంటలు అంత ఎత్తుకు ఎగిసి మండి పడడం వల్ల దక్షిణ ఆసియా వ్యవసాయానికి పెద్ద దెబ్బ తగులబోతోంద"...ని ఊహా సిద్ధాంతం చేశాడు. "డెమన్ - హాంటెడ్ వరల్డ్" లో అతడు తన ఆలోచన తప్పనీ , అది సరైన అంచనా కాదనీ ఒప్పుకున్నాడు: "అది మిట్ట మధ్యాహ్న సమయం . పర్షియన్ గల్ఫ్ లో ఉష్ణోగ్రత 4°–6° డిగ్రీల సెల్సియస్ కి పడిపోయింది. అక్కడ నించి బయల్దేరిన పొగ స్ట్రాటోస్పియర్ ఎత్తుల వరకూ పోలేదు.[18] అందుకు ఆసియా బ్రతికిపోయింద"ని స్పష్టం చేశాడు.[19][20][21][22] 2007లో అత్యాధునిక కంప్యూటర్ మోడల్స్ ని కువైట్ ఆయిల్ మంటలకు అన్వయించి చూశారు. ఆ అధ్యయనంలో వెల్లడి అయిన వాస్తవం ఏమిటంటే, ఏదో ఒకటీ అరా చోట్ల అంటుకుని మంటలు వచ్చే సందర్భంలో వెలువడే పొగ స్ట్రాటో ఆవరణాన్ని చేరుకోగలిగినంత సామర్థ్యం కలిగి ఉండదు. అడవులకు అడవులు తగలబడిపోతూ ఉంటేనో, లేకపోతే అణ్వస్త్ర దాడుల ఫలితంగా నగరాలకి నగరాలు అంటుకుని మూకుమ్మడిగా పరశురామ ప్రీతి అయిపోతుంటేనో మాత్రమే ఆ పొగ [19][20][21][22] స్ట్రాటో ఆవరణంలోకి చేరుతుంది.

సాగాన్ తర్వాత సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం సాగించిన అన్వేషణలో భూమికి దగ్గరగా ఉన్న పదార్థాల ప్రభావం భూమి మీద కూడా పడుతుంది [23] అనే నిర్ధారణకు వచ్చాడు. మిగతా వారు - "పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబులు తయారు చేసి వాటిని ఉపయోగించి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహ శకలం "నియో" కక్ష్యని మార్చేయవచ్చు కదా" అన్నారు. కానీ అదే సిద్ధాంతంలో ఉన్న రెండో కొస గురించి సాగాన్, తన "డిఫ్లెక్షన్ డైలమా" (తిప్పికొట్టే సంశయం) బయటపెడుతూ, "భూమికి చేరువ కాబోతున్న గ్రహ శకలాన్నిభూమికి దూరంగా పంపగల సత్తా మనం సంపాదించగలిగిన రోజున మరో గ్రహ శకలాన్ని భూమి కక్ష్య లోకి ఆకర్షించగలుగుతాం కూడా కదా. అది నిజంగా భయంకర వినాశనమూ, "డూమ్స్ డే బాంబ్" (సృష్టి ముగింపుకి వచ్చే జలప్రళయాన్ని)[24][25] కోరి ఆహ్వానించి తెచ్చుకోవడమే కాదా!" అన్నాడు.

బిలియన్స్ అండ్ బిలియన్స్

దస్త్రం:Sagan Viking.jpg
మార్స్‌ పై దిగబోతున్న వికింగ్‌ లాండర్‌ పోర్బ్స్‌ మోడల్‌తో సాగన్‌ వికింగ్‌ను లాండ్‌ చేయడానికి సాధ్యమయ్యే సైట్‌ను మైక్‌ కార్‌ మరియు హాల్‌ మసుర్‌స్కితో కలిసి పరిశీలిస్తున్న సాగన్‌

కాస్మోస్ తర్వాత నుండి అతడు టునైట్ షో లలో జానీ కార్సన్ తో కలిసి తరుచూ టి.వి. ప్రసారాల్లో కనిపించే సాగాన్ గుర్తింపుకి "బిలియన్స్ అండ్ బిలియన్స్" అనే కాచ్ ఫ్రేజ్ (ఆకర్షణీయమైన పదబంధం) జత కట్టింది. ఆ పదబంధాన్ని [26]కాస్మోస్ ధారావాహికల్లో ఎప్పుడూ ప్రయోగించలేదని సాగాన్ చెప్పాడు.[27] దానికి కొంచెం దగ్గరగా "కాస్మోస్" లో "బిలియన్స్ అపాన్ బిలియన్స్" అనే పదబంధాన్ని అతడు వాడాడు.

A galaxy is composed of gas and dust and stars—billions upon billions of stars.

— Cosmos, chapter 1, page 3[28], in Carl Sagan

తరుచూ బిలియన్స్ పదం ఉపయోగించేటప్పుడుశ్రోతల మనసుల్లో [26] ఆ పదం సరిగ్గా ముద్రించుకోవడానికి అతడు "b" అక్షరాన్ని విలక్షణంగా నొక్కి పలికేవాడు. అది "మిలియన్స్" అనే పదంలా వినపడకూడదని అతడు అంత బరువుగా, విశిష్టంగా ఉచ్చరించేవాడు. చిన్నవిగా తోచే ఇలాంటి విషయాల్లో కూడా సాగాన్ చూపించే విలక్షణత జానీ కార్సన్[29], గారీ క్రోగర్, మైక్ మెయర్స్, బ్రాన్సన్ పిన్ కోట్, పెన్ జిల్లెట్, హ్యారీ షీరర్ వంటి హాస్య ప్రదర్శకులను కూడా ఆకట్టుకుంది. ఫ్రాంక్ జప్పా "బి ఇన్ మై వీడియో" లో సాగాన్ "b" ఉచ్చారణని వ్యంగ్యం చేసి "ఆటమిక్ లైట్" అనే పేరుతో చూపెట్టాడు.[26] ఇదంతా సాగాన్ సరదాగానే తీసుకున్నాడు. చివరికి అతడు రాసిన చివరి పుస్తకం పేరు "బిలియన్స్ అండ్ బిలియన్స్" . బిలియన్స్ అండ్ బిలియన్స్ పుస్తకం మొదట్లోనే ఈ కాచీ ఫ్రేజ్ మీద ఓ వ్యంగమైన చర్చ కనిపిస్తుంది. అందులో కార్సన్ ఓ అమెచ్యూర్ (అంతగా పరిణతి లేని)ఖగోళ శాస్త్రజ్ఞుడిగా కనిపిస్తాడు. కార్సన్ వేసిన ఈ వ్యంగ్య పాత్ర తరుచూ [26] వాస్తవ సైన్సు దృక్పథాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది.

సాగాన్ ఊహకి అందిన విశ్వానికి సంబంధించిన బృహద్విశాల దేశ కాలాలు (స్పేస్ అండ్ టైం)పరమాశ్చర్యంలో ముంచెత్తగలిగేవి. అతడి మాటల్లోనే చూస్తే, "విశ్వంలో ఉన్న మొత్తం నక్షత్రాలు లెఖ్కగడితే, అవి భూగోళం మీద ఉన్న సముద్ర తీరాల్లోని ఇసుక రేణువులన్నింటికన్నా ఇంకా అధికంగా ఉంటాయి"అన్నాడు. సాగాన్ ఉదహరించిన ఇంత ప్రసిద్థికెక్కిన ఉదాహరణా జనంలో విస్తారమైన అపోహలు రేకెత్తించింది. ఎందుకంటే ఈ క్రింద ఉదహరించిన ధారావాహిక 8: "దేశకాలాల్లో ప్రయాణాలు"లో భూమిని "Cosmos: A Personal Voyage క్రిటికల్ బ్రాంచ్ పాయింట్ ఆఫ్ హిస్టరీ" (చరిత్రలో ఒక సంక్లిష్ట భాగంగా మారబోయే కేంద్ర బిందువు)గా అభివర్ణించాడు కాబట్టి ఈ సంగతి జనం మేథకి సరిగ్గా గ్రాహ్యం కాలేదు.

అందులో ఏమన్నాడూ అంటే - "భూగోళం మీద ఉన్న సముద్రతీరాల్లోని ఇసుక రేణువులు ఎంత అసంఖ్యాకమో అంతరిక్షంలో ఉన్న ఆ ప్రపంచాలన్నీ కూడా అంత అసంఖ్యాకమే. అక్కడ ఉన్న ప్రపంచాలు కూడా మన ప్రపంచం అంత వాస్తవమే! వాటిల్లో ప్రతి ఒక్కటీ కూడా అక్కడ సంభవించిన సంఘటనలూ, సందర్భాలూ, సంగతుల నేపథ్యంలోనే అవి అలా వర్థిల్లుతుంటాయి. వాటి భావి కాలాన్ని అవి ప్రభావితం చేయగలుగుతాయి. అగణ్య లోకాలూ, అసంఖ్యాక క్షణాలూ, అపరిమేయ దేశ కాలాదులూ. ఇప్పుడు మనం ఉన్న ఈ గ్రహం, ఈ క్షణం కూడా చరిత్రలో ఒక సంక్లిష్ట భాగంగా మారబోయే కేంద్ర బిందువై ఉంది. ప్రస్తుతం, ఈ క్షణాన మనం మన ప్రపంచంతో ఏం చేసుకుంటామా అనే విషయం మీదనే రాబోయే శతాబ్దాలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్షణాలు భవిష్యత్తులో మన వారసుల గమ్యాలని అత్యంత శక్తివంతంగా ప్రభావితం చెయ్యబోతున్నాయి. మన నాగరికతల్ని ధ్వంసం చేసుకోవాలన్నా, ఆఖరికి మన జాతినే సమూలంగా వినాశనం చేసెయ్యాలన్నా, ఆ శక్తి కూడా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది."

సాగాన్ యూనిట్లు

ఆయనకు సరదాపూర్వకంగా ఒక నివాళి ఇచ్చారు. సాగన్‌ ను నాలుగు బిలియన్లకు సమానమైన ఒక యూనిట్ ఆఫ్ మేసర్మెంట్ ‌గా నిర్వచించారు. ఎందుకంటే, బిలియన్స్‌ అండ్‌ బిలియన్స్‌ గా చెప్పాలంటే ఇలాంఇ ఏ సంఖ్యా సూచిక అయినా, రెండు బిలియన్లు ప్లస్‌ రెండు బిలియన్లుగా ఉండాలి.[30][31]

సామాజికాంశాలు

భారీ సంఖ్యలో గ్రహాంతర నాగరికతలు పుట్టుకొస్తాయని డ్రేక్‌ ఈక్వేషన్‌ సూచిస్తోందని సాగన్‌ విశ్వసించారు. పలు తర్కబద్దమైన అంచనాల ఆధారంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ అలాంటి నాగరికతలకు సంబంధించి ఏ ఆధారాలూ లేవన్న విషయాన్ని ఫెర్మి పారడాక్స్‌ ఎత్తిచూపింది. సాంకేతికంగా ఉన్నతమైన నాగరికతలు తమను తాము శరవేగంగా నాశనం చేసుకుంటున్నాయన్న దానికి ఇది సూచన. మానవాళి తనను తాను నానం చేసుకునేందుకు అవకాశమున్న పలు మార్గాలను అన్వేసించడం, వాటిని ప్రచురించడంలో అతని ఆసక్తిని ఇది బాగా ఎగదోసింది. తద్వారా కటసిలిజం ప్రమాదాలను మానవాళి విజయవంతంగా అధిగమించి, అంతరిక్షంలో సుదూరాల దాకా విస్తరించే జాతిగా మారుతుందని ఆయన ఆశించారు. మానవ నాగరికతను అంతం చేయడంలో న్యూక్లియర్‌ హెలోకాస్ట్‌ శక్తి సామర్ధ్యాలపై సాగన్‌కు ఉన్న అంతులేని ఆందోళలనలను ప్రఖ్యాత సినిమా కాస్మోస్‌ సీక్వెల్‌లోని చివరి ఎపిసోడ్‌ హు స్పీక్స్‌ ఫర్‌ ఎర్త్‌లో చూపించారు. ఎయిర్‌ ఫోర్స్‌ సైంటిఫిక్‌ సలహా బోర్డు నుంచి అప్పటికే రాజీనామా చేసిన సాగన్‌, తనంతట తానే తన టాప్‌ సీక్రెట్‌ క్లియరెన్స్‌ను వియత్నాం యుద్ధానికి నిరసనగా సరెండర్‌ చేశారు.[32] 1981 జూన్‌లో మూడో భార్య (రచయిత్రి ఆన్‌ డ్రుయెన్‌)ను వివాహం చేసుకున్నాక, సాగన్‌ రాజకీయంగా చురుగ్గా మారారు. ముఖ్యంగా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ నేతృత్వంలోని న్యూక్లియర్‌ ఆర్మ్స్‌ రేస్‌ను వ్యతిరేకించారు.

1983 మార్చిలో రీగన్‌ వ్యూహాత్మక డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ను ప్రకటించారు. న్యూక్లియర్‌ మిస్సైల్స్‌ ద్వారా ఎదురయ్యే దాడి నుంచి సమర్ధంగా రక్షించుకోవడానికి మల్లీ మిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ ఇది. వెంటనే దీనిని స్టార్‌వార్స్‌ కార్యక్రమంలో అనువదించారు. సాగన్‌ ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇలాంటి వ్యవస్థను పూర్తి ఖచ్చితత్వంతో రూపొందించడం వాస్తవంలో అసాధ్యం అని అన్నారు. శత్రువుతో డెకాయ్‌లు, ఇతర మార్గాల ద్వారా పోరాడటానికి అయ్యే ఖర్చు కంటే ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. దీని నిర్మాణం వల్ల యునైటెడ్‌ స్టేట్సకు సోవియట్‌ యూనియన్‌కు ఉన్న న్యూక్లియర్‌ బ్యాలెన్స్‌ పూర్తిగా అసాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

అణ్వస్త్ర పరీక్షల పై సోవియట్‌ నాయకుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ ఏకపక్ష నిషేధాన్ని ప్రకటించారు. ఇది 1985 ఆగస్టు 6న ప్రారంభమైంది. హిరోషిమా పై అణుబాంబు దాడి జరిగిన తర్వాత సరిగ్గా 40 ఏళ్లకు ఇది జరిగింది. అయితే రీగన్‌ పరిపాలకులు ఈ నాటకీయ పరిణామాన్ని, ప్రచారపు ఎత్తుగడగా అభివర్ణించారు. దీనిని అనుసరించేందుకు నిరాకరించారు. దీనికి స్పందనగా అమెరికాలోని అణ్వాయుధ వ్యతిరేక మరియు శాంతి పరిరక్షణ కార్యకర్తలు నెవెడా టెస్ట్‌సైట్‌లో నిరసన ప్రారంభించారు. 1986లో ఈస్టర్‌ ఆదివారం నాడు ప్రారంభమైన ఈ నిరసన, 1987 వరకూ కొనసాగింది. సాగన్‌తో సహా వందలమందిని అరెస్టు చేశారు. సాగన్‌ను రెండు విభిన్న సందర్భాల్లో అరెస్టు చేశారు. టెస్ట్‌సైట్‌లోని చైన్‌లింక్‌ ఫెన్స్‌ పై పాకినందుకు ఒకసారి అరెస్టు చేశారు.

వ్యక్తిగత జీవితం మరియు నమ్మకాలు

సాగన్‌ మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. 1957లో బయాలజిస్ట్‌ లిన్‌ మార్గులిస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి డోరియాన్‌ సాగన్‌ మరియు జెరెమి సాగన్‌ సంతానం; 1968లో ఆర్టిస్ట్‌ లిండా సాల్జ్‌మన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి సంతానం నిక్‌ సాగన్‌; 1981లో రచయిత్రి ఆన్‌ డ్రుయెన్‌ను వివాహమాడారు. వీరి సంతానం అలెగ్జాండ్రా రాచెల్‌ (సాషా) సాగన్‌ మరియు శామ్యూల్‌ డెమోక్రిటిస్‌ సాగన్‌. 1996లో సాగన్‌ మరిణించేవరకూ ఆయన వివాహ బంధం ఆన్‌ డ్రుయెన్‌తో కొనసాగింది.

తాను చూసిన, తమ తెలివితేటల్ని తామే అధిగమించే ఇద్దరు వ్యక్తుల్లో సాగన్‌ ఒకరని, ఇసాక్‌ ఇసమోవ్‌ అన్నారు. మరొకరు కంప్యూటర్‌ సైంటిస్ట్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిపుణుడు మర్విన్‌ మిన్‌స్కీ.[33]

సాగన్‌ తరచుగా మతం గురించి, సైన్స్‌కు మతానికి ఉన్న సంబంధం గురించి రాస్తూ ఉండేవారు. దేవుడు సర్వశక్తిమంతుడని ఉండే సహజమైన అభిప్రాయాలను ఆయన విమర్శించేవారు. ఉదాహరణకు:

కొంతమంది ప్రజలు దేవుడంటే, పెద్ద ఆకారంతో, పల్చటి చర్మంతో, తెల్లటి పొడవాటి గడ్డంతో, ఆకాశంలో కూర్చుని జీవులను లెక్కపెడుతూ ఉంటాడని అనుకుంటారు. ఇతరులు - ఉదాహరణకు బారుచ స్పినోజా మరియు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటివారు విశ్వాన్ని పాలించే భౌతిక సూత్రాల సమాహారమే దేవుడని భావించారు. ఎక్కడో ఉన్న మానవాతీత శక్తులు భూమ్మీద జీవజాలాన్ని నియంత్రిస్తాయనడానికి ఎవరి దగ్గరైనా సాక్ష్యాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ వాస్తవంలో ఉన్న భౌతిక సూత్రాలను కాదనడం మాత్రం పిచ్చితనం.[34]

మరో రచనలో సాగన్‌ బల్లగుద్ది వాదిస్తూ మరీ రాసిన అంశం:

దేవుడు పెద్ద ఆకారంతో, పొడవాటి గడ్డంతో, ఆకాశంలో కూర్చుని జీవులను లెక్కబెడుతున్న తెల్ల మనిషి అనుకోవడం నవ్వు తెప్పించే అంశం. కానీ ఒకవేళ విశ్వంలో ఉన్న భౌతిక సూత్రాలను మనిషి నిర్మించింది దేవుడి వల్లే అయితే, కచ్చితంగా దేవుడు ఉన్నట్లే. ఈ దేవుడు భావోద్వేగ పరంగా అసంతృప్తికి గురయ్యాడు, గురుత్వాకర్షక సిద్ధాంతం కోసం ప్రార్థన చేయడం ఏ మాత్రం సమంజసం అనిపించుకోదు.[35]

ఏదేమైనా సాగన్‌ తానొక ఏథీస్ట్‌ను కాదని అంటాడు. ఒక ఏథీస్ట్‌కు నాకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి అని చెప్పారు.[36] 1996లో ఆయన మత నమ్మకాల గురించి ఒక ప్రశ్నకు జవాబుగా నేనొక ఎగొనొస్టిక్‌ అని తెలిపారు.[37] విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆలోచనలన నిరూపించడం గానీ, నిరూపించలేకపోవడం గానీ కష్టమని సాగన్‌ అభిప్రాయపడ్డారు. విశ్వానికి అంతు లేదని శాస్త్రీయం‌గా కనుగొనడమే దీనిని సవాల్‌ చేసే చెప్పుకోదగ్గ అంశమని అంటారు.[38] అతడి భార్య అభిప్రాయం ప్రకారం సాగన్‌ నమ్మకం లేని వ్యక్తి.

When my husband died, because he was so famous and known for not being a believer, many people would come up to me—it still sometimes happens—and ask me if Carl changed at the end and converted to a belief in an afterlife. They also frequently ask me if I think I will see him again. Carl faced his death with unflagging courage and never sought refuge in illusions. The tragedy was that we knew we would never see each other again. I don't ever expect to be reunited with Carl.[39]

2006లో ఆన్‌ డ్రుయెన్‌, 1985లో సాగన్‌ యొక్క గ్లాస్గో డిఫోర్డ్‌ లెక్చర్స్‌ ఇన్‌ నేచురల్‌ థియాజీని ఓ పుస్తకంగా రూపొందించారు.The Varieties of Scientific Experience: A Personal View of the Search for God సహజమైన ప్రపంచంలో దైవత్వం గురించి తన అభిప్రాయాలను సాగన్‌ ఇందులో విపులంగా పంచుకున్నారు.

1988లో సిడిసి ఉద్యోగులతో మాట్లాడుతున్న కార్ల్‌ సాగన్‌ (రేర్‌)

సాగన్‌ స్కెప్టిక్‌ విషయంలో విశాలంగా ఆలోచిస్తానని చెప్పుకుంటారు. అసాధారణ క్లెయిమ్‌లు అసాధారణ సాక్ష్యాలను కోరుకుంటాయి అని కాస్మోస్ ‌లో ఆయన ప్రఖ్యాత కొటేషన్‌లో చెప్పారు.[40] ఇది మార్సెల్లో ట్రుజ్జి స్టేట్‌మెంట్‌ అసాధారణ క్లెయిమ్‌లకు అసాధారణ ప్రూఫ్స్‌ ఉండాలి కు దగ్గరగా ఉంది. ట్రుజ్జి కమిటీ ఫర్‌ ది సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ క్లెయిమ్స్‌ ఆఫ్‌ ద పారానార్మల్‌కు సహ స్థాపకుడు‌.[41] ఈ ఆలోచన పియెరి సిమన్‌ లాప్లెస్‌ (1749-1827) నుంచి వచ్చింది. ఈయనఫ్రెంచ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త మరియు ఆస్ట్రోనామర్‌. ఈయన అసాధారణ క్లెయిమ్‌కు ఉండాల్సిన సాక్ష్యం, దాని కొత్తదనానికి తగిన మోతాదులో ఉండాలి అన్నారు.[42]

జీవితం చివరి దశలో, సాగన్‌ యొక్క పుస్తకాలు ప్రపంచం గురించి ఆయన స్కెప్టికల్‌ మరియు సహజత్వ ఆలోచనలను విపులంగా పేర్కొన్నాయి. వాదనలను పరీక్షించడానికి, తప్పుడు వాదనలను అడ్డుకోవడానికి ఆయన కొన్ని టూల్స్‌ను ఉపయోగించారు.The Demon-Haunted World: Science as a Candle in the Dark శాస్త్రీయ‌ పద్ధతుల్లో నిశితంగా ఆలోచించడం ద్వారా ఇలా చేయొచ్చని ఆయన సూచించారు. ఈ సమాహారం ఆయన మరణించిన తర్వాత 1997లో ప్రచురణ అయింది. ఇందులో సాగన్‌ రాసిన వ్యాసాలు,Billions and Billions: Thoughts on Life and Death at the Brink of the Millennium అబార్షన్‌ మీద ఆయన అభిప్రాయాలు, ఆయన స్కెప్టిక్‌, ఎగోనొస్టిక్‌, విశాల ఆలోచనల గురించి ఆయన వితంతు భార్య ఆన్‌ డ్రుయెన్‌ రాసిన అభిప్రాయాలు ఉన్నాయి.

ఆంథ్రో ప్రొసెంట్రిజమ్‌ గురించి మనుషుల యొక్క ఆలచనా ధోరణని సాగన్‌ హెచ్చరించారు. జంతువుల ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ గురించి ఆయన కార్‌నెల్‌ విద్యార్థులకు సలహా ఉపాధ్యాయుడిగా వ్యవహరించారు. కాస్మోస్‌ చాప్టర్‌ బ్లూస్‌ ఫర్‌ ఎ రెడ్‌ ప్లానెట్‌లో, ఒకవేళ మార్స్ ‌పై జీవితం ఉంటే, మనం మార్స్‌తో చేయగలిగింది ఏమీ లేదని నేను నమ్ముతున్నాను. మార్స్‌ మార్షియన్స్‌కు చెందిన గ్రహం. మార్షియన్స్‌ కూడా మైక్రోబ్స్‌ అని పేర్కొన్నారు.[43]

సాగన్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ మరిజువానాను వాడేవారు. సేయుడోనింమిస్టర్‌ ఎక్స్‌తో కలిసి 1971లో మారిహూవానా కనుగొనబడింది అనే పుస్తకంలో కానిబస్‌ స్మోకింగ్‌ గురించి సాగన్‌ ఓ వ్యాసం రాశారు.[44][45] ఈ వ్యాసంలో, మారిజువానా తనలో స్పూర్తిని పెంచడానికి ఉపయోగపడిందన్నారు. తన యొక్క పనుల్లో, ఇంటలెక్చువల్‌ అనుభవాల్లో ఇది ఉపయోగపడిందని రాశారు. ఆయన మరణం తర్వాత, అతడి స్నేహితుడు లెస్టర్‌ గ్రిన్‌స్పూన్‌ ఈ విషయాన్ని సాగన్‌ ఆత్మకథ రాసిన కియే డేవిడ్‌సన్‌కు చెప్పారు. ఈ ఆత్మకథ కార్ల్‌సాగన్‌ ఒక జీవితం 1999లో ప్రచురణ జరిగింది. సాగన్‌ జీవితంలో ఈ కోణంపై మీడియా ఎక్కవ దృష్టి పెట్టింది.[46][47][48]

1994లో, యాపిల్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌స తమ పవర్‌ మెకింతోష్‌ 7100 ఉత్పత్తికి కోడ్‌ నేమ్‌ను కార్ల్‌ సాగన్‌ అని పెట్టారు. ఈ ఉత్పత్తి అమ్మకాల వల్ల బిలియన్లు మరియు బిలియన్లు సంపాదించవ్చని యాపిల్‌ భావించింది.[3] ఈ పేరును కేవలం అంతర్గతంగానే ఉపయోగించారు. కానీ సాగన్‌ దీనిని ఒక ఉత్పత్తి ఎండార్స్‌మెంట్‌గా భావించి సీజ్‌ అండ్‌ డెసిస్ట్‌ ఉత్తరం పంపించారు. ఆపిల్‌ ఇంజినీర్లు అంతర్గత కోడ్‌ పేరును BHAగా మార్చారు. అంటే భట్‌ హెడ్‌ ఆస్ట్రోనామెర్‌ అని అర్థం.[49][50] తర్వాత సాగన్‌ ఆపిల్ ‌పై లిబెల్‌ కోసం దావా వేశారు. ఇది ఫెడరల్‌ కోర్టులో పరువు నష్టం దావా వంటిది. కోర్టు ఆపిల్‌ యొక్క వాదనను విని, వ్యతిరేకంగ సాగన్‌ యొక్క ఆరోపణలను కొట్టేసింది. ఇది చదివే వ్యక్తి అర్థం చేసుకున్న విధానం పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. యాపిల్‌ దీనిని హాస్యాస్పదంగా, సాటిరికల్‌ పద్దతిలో వాడిందని పేర్కొంది. డిఫెండెంట్‌ ప్లెయిన్‌టిఫ్‌ యొక్క రిప్యుటేషన్‌ను లేదా పోటీతత్వాన్ని ఒక ఆస్ట్రోనోమెర్‌గా అర్థం చేసుకోలేదని. భట్‌ హెడ్‌ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒక నిపుణుడైన శాస్త్రవేత్త‌ ఇలా చేయకూడదని పేర్కొంది.[49][51] తర్వాత సాగన్‌ యాపిల్ ‌పై మరో దావా వేశారు. ఈసారి తన అసలు పేరును, ఇష్టాన్ని వాడుకున్నందుకు మరోసారి ఇందులో ఓడిపోయారు.[52] సాగన్‌ రూలింగ్‌కు అప్పీలు చేసుకున్నారు.[53] 1995లో కోర్టు బయటు సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. తర్వాత యాపిల్‌ యొక్క ట్రేడ్‌మార్క్‌ మరియు పేటెంట్స్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. యాపిల్‌ డాక్టర్‌ సాగన్‌ అంటే చాలా గౌరవం ఉంది. ఆయనను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ చిరాకుకు గురిచేయాలనే ఉద్దేశం ఆపిల్‌కు ఎప్పుడూ లేదు అని ఆ ప్రకటన సారాంశం.[54]

2001లో స్టాన్లీ కుబ్రిక్‌ యొక్క సినిమాఏ స్పేస్‌ ఒడిస్సీకి స్వల్ప సలహాదారుగా సాగన్‌ పని చేశారు.[4] ఈ సినిమాలో అతీతశక్తుల గురించో, మరో మానవాతీత అంశాల గురించో ప్రస్తావించొద్దని ఆయన సూచించారు.[55]

సాగన్‌ మరియు ఎగిరే పళ్లేలు (UFOలు)

1964లో జాక్స్‌ విల్లెతో సంభాషణలు జరిపిన సమయం నుంచి సాగన్‌కు ఎగిరే పళ్లేల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది.[56] వీటికి సంబంధించిన ప్రశ్నలకు ఎవరూ అద్భుతమైన సమాధానాలు ఇవ్వకపోయినా, శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధన చేయాలని సాగన్‌ ఆలోచించారు. ఎగిరే పళ్లేల గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న కారణంగా ఇది అవసరం అని ఆయన భావించారు.

స్టువర్ట్‌ అపెల్లె గుర్తించిందేమిటంటే, సాగన్‌ ఎగిరే పళ్లేల గురించి లాజికల్‌గా తన ఆలోచనలు,ఎంఫెరికల్ ఫలాసీస్ మరియు దీనికి సంబంధించిన అనుభవాల గురించి తరచూ రాస్తూ ఉండేవారు. వీటి గురించి గ్రహాంతర స్థాయిలో వివరణ అవసరం లేదని సాగన్‌ భావించారు. కానీ ఎగిరేపళ్లేల నివేదికలను పరిశీలించడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని సూచించారు. అందుకనే ఇది ఒక వివరణాత్మక పరిశోధన చేయాల్సిన అంశం అని పేర్కొన్నారు.[57]

1966లో US ఎయిర్‌ఫోర్స్‌ యొక్క ఎగిరేపళ్లేల పరిశోధన ప్రాజెక్ట్‌, ప్రాజెక్ట్‌ బ్లూ బుక్‌ను పున:సమీక్షించడానికి ఏర్పాటు చేసిన మధ్యంతర కమిటీలో సాగన్‌ కూడా సభ్యుడు. ఈ కమిటీ బ్లూ బుక్‌లో శాస్త్రీయ పరిశోధన లేదని నిర్ధారించింది. దీని ఫలితంగా, కాండన్‌ కమిటీ (1966-1968), ఫిజిస్ట్‌ ఎడ్వర్డ్‌ కాండన్‌ సారథ్యంలో ఏర్పాటయింది.కాండన్‌ కమిటీ తమ తుది నివేదికలో, ఎగిరేపళ్లేల గురించి ఒక ఆలోచనకు వచ్చారు. వాటిలో ఏవైనా ఉన్నాయా అనే విషయంతో సంబంధం లేకుండా, జాతీయ భద్రతకు వీటి నుంచి ఎలాంటి ముప్పు లేదని తేల్చారు.

రాన్‌ వెస్ట్రమ్‌ రాసిన దాని ప్రకారం, ఎగిరేపళ్లేల ప్రశ్నల గురించి సాగన్‌ యొక్క ట్రీట్‌మెంట్‌లో అతి పెద్ద అంశం 1969లో AAAS‌ యొక్క సింపోసియమ్‌. ఇందులో పాల్గన్న వారి నుంచి పెద్ద స్థాయిలో ఈ అంశం గురించి ఆలోచనలు బయటకు వచ్చాయి. ఇందులో ప్రొపెనెంట్స్‌ జేమ్స్‌ మెక్‌డొనాల్డ్‌ మరియు జె.అలెన్‌ హెనెక్‌లతో పాటు స్కెప్టిక్స్‌ తరహా ఖగోలవేత్తలు విలియమ్స్‌ హార్ట్‌మాన్‌ మరియు డొనాల్డ్‌ మెంజెల్‌ తమ ఆలోచనలు పంచుకున్నారు. ఇందులో వక్తల వ్యాఖ్యానాలు సరైన సమన్వయంతో సాగాయి. ఎడ్వర్డ్‌ కాండన్‌ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగలగడం సాగన్‌ యొక్క గొప్పతనం.[56] ఫిజిస్ట్‌ థోర్టాన్‌ పేజిలో, ఇందులో వచ్చిన ఉపన్యాసాల‌ను సాగన్‌ ఎడిట్‌ చేయడంతో పాటు చర్చ చేశారు. ఇవి 1972లో ఎగిరేపళ్లేలు: ఒక శాస్త్రీయ చర్చ అనే పేరుతో ప్రచురించబడ్డాయి. సాగన్‌ యొక్క అనేక పుస్తకాల్లో ఎగిరేపళ్లేలను పరిశీలించారు. (కాస్మోస్‌లో ఒక ఎపిసోడ్‌లో చేసినట్లు) ఈ ఆలోచనల వెనక అంతర్లీనంగా మతపరమైన నమ్మకాలు ఉన్నాయని ఆయన విశ్వసించారు.

1980 కాస్మోస్‌ సిరీస్‌లో సాగన్‌ మరోసారి తన ఈ ప్రయాణం గురించిన ఆలోచనలు తెలిపారు. ఆయన ఆఖర్లో రాసిన ఒక పుస్తకంలో, గ్రహాంతర వాసులకు సంబంధించిన స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమి మీదకు వచ్చే అవకాశాలు అత్యంత స్వల్పంగా ఉన్నాయని రాశారు. ఏదేమైనా, ఈ కోల్డ్‌వార్‌ జరగడానికి ఎగిరేపళ్లేల గురించి ప్రజలను తమ ప్రభుత్వాలు తప్పుదారి పట్టించడం కారణమని పేర్కొన్నారు. కొన్ని ఎగిరేపళ్లేల గురించిన నివేదికలు, విశ్లేషణ‌లు భారీ సంఖ్యలో ఫైల్స్‌లో దాచి, వాటిని ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఈ ఫైల్స్‌ను బయటకు తెచ్చి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తే చాలా సందేహాలు తీరిపోతాయి అని పేర్కొన్నారు. ఎగిరేపళ్లేలకు సంబంధించిన సమాచారం చేజారిపోకుండా చూసుకోవాలని హెచ్చరించారు. భూమి మీదకు గ్రహాంతరవాసులు‌ వచ్చారనడానికి గానీ, వస్తారనడానికి గానీ ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవని సాగన్‌ తేల్చి చెప్పారు.[58]

మరణం

బ్రూక్లిన్‌ బటానిక్‌ గార్డెన్‌లో సెలబ్రిటి పాత్‌లో కార్ల్‌ సాగన్‌కు అంకితం చేసిన రాయి

మూడు ఎముల మార్పిడి తర్వాత, మిలడెస్‌ప్లాసియాతో చాలాకాలం పోరాడి, 62 ఏళ్ల వయసులో సాగన్‌ న్యుమోనియాతో మరణించారు. 1996 డిసెంబరు 20న వాషింగ్టన్‌లోని హచిసన్‌ క్యాన్సర్‌ పరిశోధన కేంద్రంలో ఆయన తుది శ్వాస విడిచారు.[59] న్యూయార్క్‌లోని ఇథాచాలో ఉన్న లేక్‌వ్యూ శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

మరణానంతర గుర్తింపు

1997లో వచ్చిన కాంటాక్ట్‌ సినిమా, అదే పేరుతో ఉన్న ఆయన నవల ఆధారంగా చిత్రీకరించారు. సాగన్‌ మరణం తర్వాత దీని నిర్మాణం పూర్తయింది. "ఫర్‌ కార్ల్"‌ అంటూ అంకితం ఇస్తూ దీనిని ముగించారు.

1997లో న్యూయార్క్‌లోని ఇథాచాలో సాగన్‌ ప్లానెట్‌ వాక్‌ను ప్రారంభించారు. ఇది సోలార్‌ పద్ధతిలో నడిచే స్కేల్‌ పద్ధతిలో రూపొందించారు. ఇథాచా డౌన్‌టౌన్‌ మధ్యలోంచి 1.2 కిలోమీటర్లు మేర ఇది సాగింది. ఈ ఎగ్జిబిషన్‌కు కార్ల్‌ సాగన్‌కు స్మృతిగా ఏర్పాటు చేశారు. ఈయన ఇథాచా నివాసి కావడం, కార్నెల్‌ ప్రొఫెసర్‌ కావడం దీనికి కారణం. ఈ మ్యూజియం యొక్క సలహా బోర్డులో సాగన్‌ వ్యవస్థాపక సభ్యుడు.[60]

మార్స్‌ పాథ్‌ ఫైండర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌కు పేరులేని ల్యాండింగ్‌ సైట్‌ ఉండేది. దీనిని కార్ల్‌ సాగన్‌ మెమోరియల్‌ స్టేషన్‌గా 1997, జూలై 5న కొత్త పేరు పెట్టారు.

సాగన్‌ కుమారుడు నిక్‌ సాగన్‌, స్టార్‌ ట్రెక్‌ ఫ్రాంఛైజీలో అనేక ఎపిసోడ్స్‌ రాశారు. టెర్రా ప్రైమ్‌ అనే ఎపిసోడ్‌లో,Star Trek: Enterprise మార్స్‌ పాథ్‌ ఫైండర్‌లోని భాగం రోవర్‌ సోబోర్నర్‌ గురించి వేగమైన షాట్‌ చూపించారు. ఇది చరిత్రాత్మక కార్ల్‌ సాగన్‌ మెమోరియల్‌ స్టేషన్‌లో జరిగింది. ఇక్కడి మార్కర్‌ సాగన్‌ రాసిన ఒక కోట్‌ను ప్రదర్శించింది. మార్స్‌ మీద నువ్వు ఉండటానికి కారణం ఏదైనా కావచ్చు. నువ్వు అక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాను అనేది దాని సారాంశం‌. 2004లో సాగన్‌ శిష్యుడు స్టీవ్‌ స్క్విరెస్‌ తన స్పిరిట్ రోవేర్ ఆపర్చునీటీ రోవర్ మార్స్ ‌పై విజయవంతంగా దించాడు.

ఆస్టరాయిడ్‌ 2709సాగన్‌కు గౌరవసూచకంగాకి ఆయన పేరు పెట్టారు.

2001, నవంబరు 9న, సాగన్‌ యొక్క 67వ జయంతి నాడు, నాసా ఏమ్స్‌ పరిశోధనా కేంద్రం‌, కాస్మోస్‌లో జీవితం గురించి అధ్యయనం చేయడానికి కార్ల్‌సాగన్‌ సెంటర్‌కు సైట్‌ను అంకితం చేసింది. కార్ల్‌ ఒక అద్భుతమైన ఆలోచన ఉన్న వ్యక్తి. ఆయన వారసత్వాన్ని కాపాడుకుంటూ 21 శతాబ్దంలోని పరిశోధనలు సాగాలి. విశ్వంలోని మన జీవితం, అంతరిక్షంలోని మార్పులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండేలా ఈ ప్రయోగశాలలు పని చేయాలి అని నాసా పరిపాలకుడు డేనియల్‌ గోల్డిన్‌ పేర్కొన్నారు. 2006 అక్టోబరు 26న ఈ కేంద్రాన్ని ఆన్‌ డ్రుయెన్‌ సమక్షంలో ప్రారంభించారు.

సాగన్‌కు గౌరవంగా ఆయన పేరు మీద మూడు అవార్డులు నెలకొల్పారు:

 • ద కార్ల్‌ సాగన్‌ మెమోరియల్‌ అవార్డ్‌ను 1997 నుంచి అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సోసైటీ మరియు ప్లానెటరీ సొసైటీ కలిసి సంయుక్తంగా బహూకరిస్తున్నాయి.
 • ద కార్ల్‌ సాగన్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ ప్లానిటరీ సైన్స్‌ను 1998 నుంచి అమెరికా ఆస్ట్రోనామికల్‌ సొసైటీ యొక్క డివిజన్‌ ప్లానెటరీ సైన్సెస్‌ బహూకరిస్తోంది. చురుగ్గా వ్యవహరించే అంతరిక్ష పరిశోధకుడి అద్భుతమైన ప్రదర్శనకు దీనిని ఇస్తున్నారు. DPS నిర్వాహక కమిటీలో సాగన్‌ సభ్యుడిగా ఉండేవారు.
 • కార్ల్‌ సాగన్‌ అవార్డ్‌ ఫర్‌ పబ్లిక్‌ అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డును కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ సొసైటీ ప్రెసిడెంట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ అవార్డును 1993లో తొలుత స్వీకరించిన వ్యక్తి సాగన్‌ కావడం విశేషం.[61]

2006లో ద కార్ల్‌ సాగన్‌ మెడల్‌ను, ఆస్ట్రోబయాలజిస్ట్‌ మరియు రచయిత డేవిడ్‌ గ్రిన్‌స్పూన్‌కు బహూకరించారు. ఆయన సాగన్‌ స్నేహితుడు లెస్టెర్‌ గ్రిన్‌స్పూన్‌ కుమారుడు.

2006 డిసెంబరు 20న, సాగన్‌ యొక్క పదవ వర్ధంతి నాడు, ఒక బ్లాగర్‌ జోయెల్‌ స్కోల్స్‌బర్గ్‌ కార్ల్‌ సాగన్‌ బ్లాగ్‌ ఎ థోన్‌ను నిర్వహించారు. ఈ ఆలోచనను నిక్‌ సాగన్‌ సమర్ధించారు.[62] బ్లాగింగ్‌ కమ్యూనిటీలోని అనేక మంది సభ్యులు ఇందులో పాల్గన్నారు.

2008లో బెన్‌ జోర్డాన్‌, ఈయన ద ఫ్లాష్‌ బల్బ్‌గా కూడా సుపరిచితం, పాల్‌ బ్లూ డాట్‌ - ఎ ట్రిబ్యూట్‌ టు కార్ల్‌ సాగన్‌ అనే ఆల్బమ్‌ను విడుదల చేశాడు.

2009లో, జాన్‌ బోస్‌వెల్‌ రూపొందించిన మ్యూజిక్‌ వీడియో ప్రొడక్షన్‌లో కార్ల్‌ సాగన్‌ యొక్క కాస్మోస్‌ లోని దృశ్యాలను వాడారు. సింఫనీ ఆప్‌ సైన్స్‌ కోసం రూపొందించిన తొలి వీడియో ఇది. మ్యుజీషియన్‌ జాక్‌ వైట్‌ తర్వాత దీనిని తన థర్డ్‌మ్యాన్‌ రికార్డ్స్‌ లేబుల్‌తో విడుదల చేశారు.[63] సాగన్‌, రిచర్డ్‌ డాకిన్స్‌, రిచర్డ్స్‌ ఫేన్‌మన్‌, బ్రయాన్‌ గ్రీన్‌, లారెన్స్‌ క్రాస్‌, బిల్‌ నేయి, నీల్‌ టైసన్‌ సహా అనేక మంది శాస్త్రవేత్తలతో కలిసి సమావేశాల్లో పాల్గన్న అనేక వీడియోల రికార్డులను తర్వాతి కాలంలో వాడుకున్నారు. సైన్స్‌ వీడియోల్లో ప్రతి సింఫనీలోనూ ఉన్న ఒకే ఒక శాస్త్రవేత్త‌ సాగన్ మాత్రమే‌.

2009లోనే, కార్ల్‌ సాగన్‌ యొక్క 75వ జయంతి సందర్భంగా, నవంబరు 7న తొలిసారి కార్ల్‌ సాగన్‌ డేని జరుపుకున్నారు.[64]

పురస్కారాలు మరియు గౌరవాలు

నాసా డిస్టింగ్విష్డ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ మెడల్‌
 • టెలివిజన్‌ ఎక్స్‌లెన్స్‌కు వార్షిక అవార్డు - 1981- ఒహియో స్టేట్‌ యూనియవర్శిటీ - పిబిఎస్‌ సిరీస్‌ కాస్మోస్‌
 • అపోలో అచీవ్‌మెంట్‌ అవార్డు -జాతీయ ఏరోనాటిక్స్‌ మరియు స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌
 • నాసా పబ్లిక్‌ సర్వీస్‌ మెడల్‌ - నేషనల్‌ ఏరోనాటిక్స్‌ మరియు స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (రెండుసార్లు)
 • ఎమ్మి - అవుట్‌స్టాండింగ్‌ ఇండివిడ్యువల్‌ అవార్డు - 1981- పిబిఎస్‌ సిరీస్‌ కాస్మోస్‌
 • ఎమ్మి - అవుట్‌స్టాండింగ్‌ ఇన్‌ఫర్మేషనల్‌ సిరీస్‌ - 1981 - పిబిఎస్‌ సిరీస్‌ కాస్మోస్‌
 • ఎక్సెప్షనల్‌ సైంటిఫిక్‌ అచీవ్‌మెంట్‌ మెడల్‌ - నేషనల్‌ ఏరోనాటిక్స్‌ మరియు స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌
 • హెలెన్‌ కాల్‌డికాట్‌ లీడర్‌షిప్‌ అవార్డు - ఉమెన్స్‌ యాక్షన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ డిజర్‌మామెంట్‌
 • హూగో అవార్డు - 1981 - కాస్మోస్‌
 • హ్యుమనిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - 1981 - అమెరికన్‌ హ్యుమనిస్ట్‌ సంఘం బహూకరించింది.
 • ఇన్‌ ప్రైస్‌ ఆఫ్‌ దీజన్‌ అవార్డు - 1987 - కమిటీ ఫర్‌ ద సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆప్‌ క్లెయిమ్స్‌ ఆఫ్‌ ద పారానార్మల్‌
 • ఇసాక్‌ ఎసిమోవ్‌ అవార్డు - 1994 - కమిటీ ఫర్‌ ద సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆప్‌ క్లెయిమ్స్‌ ఆఫ్‌ ద పారానార్మల్‌
 • జాన్‌ ఎఫ్‌ కెనడీ ఆస్ట్రోనాటిక్స్‌ అవార్డు - అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సంఘం
 • జాన్‌ డబ్ల్యు క్యాంప్‌బెల్‌ మెమోరియల్‌ అవార్డు - 1974
 • జోసెఫ్‌ ప్రీస్ట్లీ అవార్డు- మానవాళి సంక్షేమం కోసం చేసిన సేవలకు అవార్డు
 • క్లుమ్‌ప్కి రాబర్ట్స్‌ అవార్డ్‌ ఆఫ్‌ ద ఆస్ట్రోనామికల్‌ సొసైటి ఆఫ్‌ ద పసిఫిక్‌ - 1974
 • కాన్‌స్టంటైన్‌ సిల్‌కొవోస్కీ మెడల్‌ - సోవియట్‌ కాస్మోనాట్స్‌ ఫెడరేషన్‌ బహూకరించింది
 • లూకాస్‌ అవార్డ్‌ 1986 - కాంటాక్ట్‌
 • లోవెల్‌ థామస్‌ అవార్డు - ఎక్స్‌ప్లోరర్స్‌ క్లబ్‌ - 75వ వార్షికోత్సవం
 • మసుర్‌స్కీ అవార్డ్‌ - అమెరికన్‌ ఆస్ట్రోనామికల్‌ సంఘం
 • మిల్లర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ - మిల్లర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (1960-1962)
 • ఓరెస్టెడ్‌ మెడల్‌ - 1990 - అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్‌
 • పీబాడీ అవార్డ్‌ - 1980- పిబిఎస్‌ సిరీస్‌ కాస్మోస్
 • ప్రిక్స్‌ గాల్బెర్ట్‌ - ద ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ ఆస్ట్రోనాటిక్స్‌
 • పబ్లిక్‌ వెల్పేర్‌ మెడల్‌ - 1994 - నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌
 • పులిట్జర్‌ ప్రైజ్‌ ఫర్‌ జనరల్‌ నాన్‌ ఫిక్షన్‌ - 1978 - ద డ్రాగన్స్‌ ఆఫ్‌ ఈడెన్‌
 • ఎస్‌ఎఫ్‌ క్రానికల్‌ అవార్డ్‌ - 1998 - కాంటాక్ట్‌
 • 2005, జూన్‌ 5న 99వ అతి గొప్ప అమెరికన్‌ గా పేరు, డిస్కవరీ చానెల్‌లో గ్రేటెస్ట్‌ అమెరికన్‌ షో ప్రసారం చేసింది.

ప్రచురణలు

 • ప్లానెట్స్‌ {/0{1}}(లైఫ్‌ సైన్స్‌ గ్రంథాలయం), సాగన్‌, కార్ల్‌, జోనాథన్‌ నార్టన్‌ లియోనార్డ మరియు ఎడిటర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ , టైమ్‌, 1966
 • ఇంటెలిజెంట్ లైఫ్ ఇన్ ది యూనివర్స్, I.S. ష్క్లొవ్స్కీ కాఉతోర్, రండోం హౌస్, 1966, 509 పేజీలు 
 • యుఎఫ్‌ఓస్‌ ఎ సైంటిఫిక్‌ డిబేల్‌ ; థోర్న్‌టన్‌ పేజ్‌ రచయిత, కార్నెల్‌ యూనివర్శిటీ ప్రెస్‌ 1972, 310 పేజీలు
 • కమ్యూనికేషన్‌ విత్‌ ఎక్స్‌ట్రా టెరెస్టీరియల్‌ ఇంటిలిజెన్స్‌. ఎంఐటిప్రెస్‌ 1973, 428 పేజీలు MIT ప్రెస్, 1973, 428 pgs
 • మార్స్‌ అండ్‌ మైండ్‌ ఆఫ్‌ మ్యాన్‌, సాగన్‌, కార్ల్‌, హార్పర్‌ అండ్‌ రో, 1973, 143 పేజీలు
 • జెరోమ్‌ ఏజెల్‌ సహరచయిత, యాంకర్‌ ప్రెస్‌, 1973,Cosmic Connection: An Extraterrestrial Perspective
 • అదర్‌ వరల్డ్స్‌. బాంటమ్‌ బుక్స్‌, 1975
 • మర్మర్స్‌ ఆఫ్‌ ఎర్త్‌; ద వాయేజర్‌ ఇంటర్‌స్టెల్లర్‌ రికార్డ్‌, సాగన్‌, కార్ల్‌, ఎట్‌ ఎఎల్‌,. రాండమ్‌ హౌస్‌
 • ద డ్రాగన్స్‌ ఆఫ్‌ ఈడెన్‌; స్పెక్యులేషన్‌ ఆన్‌ ద ఎవాల్యుయేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఇంటిలిజెన్స్‌. బాలంటైన్‌ బుక్స్‌ బల్లంతిన్ బుక్స్, 1978, ISBN 0-345-34629-7, 288 పేజీలు 
 • Broca's Brain: Reflections on the Romance of Science . బాలంటైన్‌ బుక్స్‌
 • కాస్మోస్‌. ' రాన్డం హౌస్, 2005. రాండమ్‌ హౌస్‌, 1980. రాండమ్‌ హౌస్‌ న్యూ ఎడిషన్‌, 2002 మే 7, ISBN 0-375-50832-5, 384 పేజీలు
 • సాగన్‌, కార్ల్‌ ఎట్‌ ఎఎల్‌, సిడ్జ్‌విడ్‌ అండ్‌ జాక్సన్‌, 1985The Cold and the Dark: The World after Nuclear War
 • కోమెట్‌, ఆన్‌ డ్రుయెన్‌ కో ఆథర్‌, బాలంటైన్‌ బుక్స్‌, 1985,ISBN 0-345-41222-2, 496 పేజీలు
 • కాంటాక్ట్ సిమన్‌ అండ్‌ షుస్టర్‌, 1985; రీ ఇష్యూడ్‌ ఆగస్టు 1997 బై డబుల్‌డే బుక్స్‌, ISBN 1-56865-424-3, 352 పేజీలు
 • ఎ పాథ్‌ వేర్‌ నో మ్యాన్‌ థాట్‌; న్యూక్లియర్‌ వింటర్‌ అండ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ రేస్‌, రిచర్డ్‌ టుర్కో కో ఆథర్‌, రాండమ్‌ హౌస్‌, 1990, ISBN 0-394-58307-8, 499 పేజీలు
 • షాడోస్‌ ఆఫ్‌ ఫర్గాటన్‌ యాంసెస్టర్స్‌; ఎ సెర్చ్‌ ఫర్‌ హూ ఉయ్‌ ఆర్‌, ఆన్‌ డ్రుయెన్‌ కో ఆథర్‌, బాలంటైన్‌ బుక్స్‌, ISBN 0-345-38472-5, 528 పేజీలు.
 • Pale Blue Dot: A Vision of the Human Future in Space రాండమ్‌ హౌస్‌, నవంబరు 1994,ISBN 0-679-43841-6, 429 పేజీలు
 • ద డెమోన్‌ హాన్‌టెడ్‌ వరల్డ్‌; సైన్స్‌ యాజ్‌ ఎ క్యాండిల్‌ ఇన్‌ ద డార్క్‌, బాలంటైన్‌ బుక్స్‌, మార్చి 1996 ISBN 0-345-40946-9, 480 పేజీలు  (గమనిక: ఈ పుస్తకం తొలుత ప్రచురించబడి, 1995లో కాపీరైట్‌ పొందింది. ఎరాట్టా స్లిప్‌ను కూర్చి)
 • Billions and Billions: Thoughts on Life and Death at the Brink of the Millennium ఆన్‌ డ్రుయెన్‌ కో ఆథర్‌, బాలంటైన్‌ బుక్స్‌, జూన్‌ 1997,ISBN 0-345-37918-7, 320 పేజీలు
 • ద వెరైటీస్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌; ఎ పర్సనల్‌ వ్యూ ఆఫ్‌ ద సెర్చ్‌ ఫర్‌ గాడ్‌, కార్ల్‌ సాగన్‌ (రచయిత) మరియు ఆన్‌ డ్రుయెన్‌ (ఎడిటర్‌), 1985 గిల్‌ఫోర్డ్‌ లెక్చర్స్‌, పెంగ్విన్‌ పెస్ర్‌ నవంబరు 2006,ISBN 1-59420-107-2, 304 పేజీలు

మూలం

 1. Sagan, Carl (1994). Pale Blue Dot: A Vision of the Human Future in Space (1st ed.). New York: Random House. p. 68. ISBN 0-679-43841-6.
 2. 2.0 2.1 2.2 "StarChild: Dr. Carl Sagan". NASA. Retrieved 2009-10-08.
 3. 3.0 3.1 Poundstone, William (1999). Carl Sagan: A Life in the Cosmos. New York: Henry Holt & Company. pp. 363–364, 374–375. ISBN 0-805-05766-8.
 4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 4.15 Davidson, Keay; Sagan, Carl (1999). Carl Sagan: a life. Wiley. p. 168. ISBN 0-471-25286-7.
 5. 5.0 5.1 5.2 స్పాన్‌బర్గ్‌, రే; మోసర్‌, డియేన్‌. కార్ల్‌ సాగన్‌; ఎ బయోగ్రఫి, గ్రీన్‌వుడ్‌ పబ్లికేషన్‌ 2-5
 6. http://astro.uchicago.edu/RAS/
 7. మొదటి సాగన్ భోధనా పురస్కారాలను గ్రాడ్జువేట్ విద్యార్ధులు అందుకుంటారు
 8. 8.0 8.1 చార్లీ రోజ్‌ ఇంటర్వ్యూ, జనవరి 5, 1994
 9. ప్లానెటరీ సైన్స్‌ విభాగంలో సాగన్‌ యొక్క పరిశోధనల్లో అధిక భాగం విలియమ్‌ పౌండ్‌స్టోన్‌ అవుట్‌లైన్‌ చేశారు. పౌండ్‌స్టోన్‌ యొక్క సాగన్‌ ఆత్మకథలో 8 పేజీల సాగన్‌ సైంటిఫిక్‌ ఆర్టికల్స్‌ కూడా కలిసి ఉన్నాయి. ఈ వ్యాసాలు 1957 నుంచి 1998 వరకూ ప్రచురితమయినవి. సాగన్‌ సైంటిఫిక్‌ వర్క్‌ యొక్క అధిక సమాచారం, ప్రాధమిక పరిశోధనా వ్యాసాల‌లోనే ఉంది. ఉదాహరణకు; సాగన్‌, సి., థాంప్సన్‌, డబ్ల్యు.ఆర్‌, అండ్‌ ఖేర్‌, బి.ఎన్‌.Titan: A Laboratory for Prebiological Organic Chemistry అకౌంట్స్ ఆఫ్ కెమికల్ రిసెర్చ్, వాల్యూం 25, పేజీ 286 (1992) టైటాన్‌ గురించిన రీసెర్చ్‌ ఆర్టికల్‌ ద ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఆస్ట్రో బయాలజీ, ఆస్ట్రోనామి, అండ్‌ స్పేస్‌ఫైట్‌ లో ఉంది.
 10. The Columbia Encyclopedia. "Sagan, Carl Edward". Sixth Edition. Columbia University Press. Retrieved 2007-05-02.
 11. The Planetary Society. "Carl Sagan". The Planetary Society. Retrieved 2007-05-14.
 12. టర్కో ఆరి, టూన్‌ ఓడి, ఆకెర్‌మన్‌ టిపి, పొలాక్‌ జెబి, సాగన్‌ సి. సైన్స్‌, Climate and smoke: an appraisal of nuclear winter Climate and smoke: an appraisal of nuclear winter సైన్సు, వాల్యూమ్‌ 247, పేజీలు 166-176(1990) పూర్తి టెక్స్ట్‌ వ్యాసం కోరకు లింక్‌ పబ్‌మెడ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ జెఎస్‌టిఓఆర్‌. కార్ల్‌ సాగన్‌, న్యూక్లియర్‌ పొలిటికల్‌ వింటర్‌ ఉపన్యాసాలు, అతడి ఎరోనిమస్‌ గ్లోబల్‌ కూలింగ్‌, గల్ఫ్‌ యద్ధం యొక్క అంచనా మొదలైన వివరాలను ద డెమోన్‌-హాంటెడ్‌ వరల్డ్‌లో రాశారు.
 13. "Carl Sagan". EMuseum@Minnesota State University. Retrieved 2009-10-08.
 14. 14.0 14.1 "CosmoLearning Astronomy". CosmoLearning. Retrieved 2009-10-08.
 15. "Meet Dr. Carl Sagan". The Science Channel. Retrieved 2007-05-02.
 16. 16.0 16.1 Sagan, Carl (1995-01-05). (.SWF) (Interview). Interviewed by Charlie Rose http://video.google.com/videoplay?docid=-1127834163386485385#2370s. Retrieved 2007-04-25. Unknown parameter |program= ignored (help); Unknown parameter |callsign= ignored (help); Unknown parameter |city= ignored (help); More than one of |subject= and |last= specified (help); Missing or empty |title= (help)00:39:29 వద్ద మొదలయ్యింది
 17. 17.0 17.1 మోరిసన్‌, డేవిడ్‌ (2007) మాన్‌ ఫర్‌ ద కాస్మస్‌; కార్ల్‌ సాగన్‌ యొక్క జీవితం మరియు సైంటిస్ట్‌గా వారసత్వం, టీచర్‌, మరియు స్కెప్టిక్‌, స్కెప్టికల్‌ ఇన్‌క్వైరర్‌ జనవరి / ఫిబ్రవరి
 18. Sagan, Carl (1996). The demon-haunted world: science as a candle in the dark. New York: Random House. p. 257. ISBN 0-394-53512-X.
 19. 19.0 19.1 ఇన్-సిటు అబ్జర్వేషన్స్ ఆఫ్ మిడ్-లాటిట్యూడ్ ఫారెస్ట్ ఫెయిర్ ప్లూమ్స్ డీప్ ఇన్ ది స్త్రాతోస్ఫియర్
 20. 20.0 20.1 EO న్యూస్ రూం: న్యూ ఇమేజెస్ - స్మోక్ సోర్స్ టు స్త్రాతోస్ఫిరిక్ హైట్స్
 21. 21.0 21.1 అబ్జర్వేషన్స్ ఆఫ్ బోరియాల్ ఫారెస్ట్ ఫెయిర్ స్మోక్ ఇన్ ది స్ట్రాతోస్ఫియర్
 22. 22.0 22.1 Fromm (2006). "Smoke in the Stratosphere: What Wildfires have Taught Us About Nuclear Winter". Eos Trans. AGU. 87 (52 Fall Meet. Suppl.): Abstract U14A–04.
 23. Head, Tom (2006). Conversations With Carl Sagan. University Press of Mississippi. pp. 86–87. ISBN 1-578-06736-7.
 24. "David Morrison - Taking a Hit: Asteroid Impacts & Evolution". Silicon Valley Astronomy Lectures. season 2007-2008. 2007-10-03. http://www.astrosociety.org/education/podcast/index.html. 
 25. Sagan, Carl; Ostro (1994). "Long-Range Consequences of Interplanetary Collisions". Issues in Science and Technology. X (4).
 26. 26.0 26.1 26.2 26.3 Sagan, Carl (1998). Billions and Billions. New York: Ballantine Books. ISBN 0-345-37918-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 27. Fred R. Shapiro and Joseph Epstein (2006). "Carl Sagan". The Yale Book of Quotations. Yale University Press. p. 660. ISBN 0-300-10798-6. Unknown parameter |isnb13= ignored (help)
 28. Carl Sagan (1980). Cosmos. Ballantine Books. ISBN 0-345-33135-4. Unknown parameter |isbn13= ignored (help)
 29. "Carl Sagan Takes Questions: More From His 'Wonder and Skepticism' CSICOP 1994 Keynote". The Committee for Skeptical Inquiry. 1994-06-26. Retrieved 2010-03-25.
 30. సాగన్‌ ఎట్‌ డిక్షనరీ. రిఫరెన్స్‌. కామ్‌ (డెఫినేషన్‌ ఫ్రమ్‌ ది జార్గన్‌ ఫైల్‌)
 31. విలియమ్‌ సఫైర్‌, ఆన్‌ లాంగ్వేజ్‌; ఫుట్‌ప్రింట్స్‌ ఆన్‌ ద ఇన్ఫోబాన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, ఏప్రిల్‌ 17, 1994
 32. http://archive.is/20120529135420/findarticles.com/p/articles/mi_m1374/is_6_60/ai_78889720/
 33. Asimov, Isaac (1980). In Joy Still Felt: The Autobiography of Isaac Asimov, 1954-1978. Doubleday/Avon. pp. 217, 302. ISBN 0-380-53025-2.
 34. Sagan, Carl (1986-02-12). "Chapter 23". Broca's Brain: Reflections on the Romance of Science. Ballantine Books. p. 330. ISBN 0345336895.
 35. http://atheism.about.com/library/quotes/bl_q_CSagan.htm
 36. Achenbach, Joel (2006-04-23). "Worlds Away". Washington Post. p. W15.
 37. ఎక్స్‌పెక్టెడ్‌ ఇన్‌Head, Tom, ed. (2006). University of Mississippi Press. ISBN 1-57806-736-7. Check |isbn= value: invalid character (help). Unknown parameter |unused_data= ignored (help); Missing or empty |title= (help)CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text: authors list (link)Head, Tom. "Conversations with Carl". Skeptic. 13 (1): 32–38.
 38. Sagan, Carl (1996). The Demon Haunted World: Science as a Candle in the Dark. New York: Ballantine Books. p. 278. ISBN 0-345-40946-9.
 39. Druyan, Ann (2003). "Ann Druyan talks about science, religion, wonder, awe… and Carl Sagan". Skeptical Inquirer. Committee for Skeptical Inquiry. 27 (6). ISSN 0194-6730. Retrieved July 27, 2010. Unknown parameter |month= ignored (help)
 40. Carl Sagan (writer/host) (1980-12-14). "Encyclopaedia Galactica". Cosmos. episode 12. 01:24 minutes in. PBS. 
 41. Truzzi, Marcello (1998). "On Some Unfair Practices towards Claims of the Paranormal". Oxymoron: Annual Thematic Anthology of the Arts and Sciences, Vol.2: The Fringe. Oxymoron Media. Retrieved 2007-05-02.
 42. ఎ సెన్స్‌ ఆఫ్‌ ప్లేస్‌ ఇన్‌ ద హార్ట్‌ల్యాండ్‌, ద మిల్వాకీ జర్నల్‌ సెంటినెల్‌ ఆన్‌లైన్‌
 43. Sagan, Carl (1985-10-12). Cosmos. Ballantine Books. p. 108. ISBN 0345331354.
 44. Grinspoon, Lester (1994). Marihuana Reconsidered (2nd ed.). Oakland, CA: Quick American Archives. ISBN 0-932-55113-0.
 45. Sagan, Carl. "Mr. X". Marijuana-Uses.com. Retrieved 2009-08-07.
 46. Whitehouse, David (1999-10-15). "Carl Sagan: A Life in the Cosmos". BBC News. Retrieved 2007-05-02.
 47. Davidson, Keay (1999-08-22). "US: Billions and Billions of '60s Flashbacks". San Francisco Examiner. Retrieved 2007-05-02.
 48. Larsen, Dana (1999-11-01). "Carl Sagan: Toking Astronomer". Cannabis Culture Magazine. Retrieved 2007-05-02.
 49. 49.0 49.1 పౌండ్‌ స్టోన్‌
 50. "This Week in Apple History: November 14–20". The Mac Observer.
 51. సాగన్‌ వర్సెస్‌ యాపిల్‌ కంప్యూటర్‌ 1072 (USDC C.D. Cal. 1994), CV 94-2180 LGB (BRx); 1994 U.S. Dist. LEXIS 20154.
 52. పౌండ్‌స్టోన్‌, పేజీ 374
 53. [15] ^ ఐబిడ్., పేజీ. 38.
 54. ibid, pp. 374-375.
 55. Sagan, Carl (2000). Carl Sagan's cosmic connection: an extraterrestrial perspective (2 ed.). Cambridge University Press. p. 183. ISBN 0-521-78303-8., [1]చాప్టర్ 25, పేజి 183{/{/2}2}[2]
 56. 56.0 56.1 Westrum, Ron (2000). "Limited Access: Six Natural Scientists and the UFO Phenomenon". UFOs and abductions: Challenging the Borders of Knowledge. Lawrence, Kansas: University Press of Kansas. pp. 30–55. ISBN 0-700-61032-4. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 57. Appelle, Stuart (2000). "Ufology and Academia: The UFO Phenomenon as a Scholarly Discipline". UFOs and abductions: Challenging the Borders of Knowledge. Lawrence, Kansas: University Press of Kansas. pp. 7–30. ISBN 0-700-61032-4. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 58. సాగన్, 1996: 81-96, 99-104
 59. "Carl Sagan dies at 62". CNN. Retrieved 2010-04-28.
 60. http://www.sciencenter.org/saganpw/
 61. "Sagan Award for Public Understanding of Science". The Council of Scientific Society Presidents. Retrieved 2007-05-02.
 62. జోయెల్స్‌ హ్యుమనిస్టిక్‌ బ్లాగ్‌; అనౌన్సింగ్‌ ద కార్ల్‌ సాగన్‌ మెమోరియల్‌ బ్లాగ్‌ - ఎ- థోన్‌
 63. "Jack White: Carl Sagan's Biggest Fan". The Washington Post. Retrieved 2009-11-11.
 64. http://www.carlsaganday.com/

మరింత చదవటానికి

 • Davidson, Keay (1999). Carl Sagan: A Life. New York: John Wiley & Sons. pp. 33–41. ISBN 0471252867.
 • Head, Tom (ed.) (2005). Conversations with Carl Sagan. Jackson, Mississippi: University Press of Mississippi. ISBN 1578067367. Cite has empty unknown parameter: |coauthors= (help)CS1 maint: extra text: authors list (link)
 • Poundstone, William (1999). Carl Sagan: A Life in the Cosmos. New York: Henry Holt & Company. ISBN 0805057668.
 • Morrison, David (2006). "Carl Sagan: The People's Astronomer" (PDF). AmeriQuests. 3 (2).
 • Achenbach, Joel (1999). Captured by Aliens: the search for life and truth in a very large universe. New York: Simon & Schuster. ISBN 0-684-84856-2. Unknown parameter |laysummary= ignored (|lay-url= suggested) (help)

బాహ్య లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

మూస:Normdaten

మూస:Carl Sagan

|PLACE OF BIRTH= Brooklyn, New York |DATE OF DEATH= 1996 డిసెంబరు 20 |PLACE OF DEATH= Seattle, Washington }}