"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కాశీనాయన

From tewiki
(Redirected from కాశినాయన)
Jump to navigation Jump to search
Kasinayana
కాశీనాయన
దస్త్రం:Kasireddi nayana.png
కాశీనాయన
జననంకాశిరెడ్డి
జనవరి 15, 1895
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లి
నిర్యాణముడిసెంబర్ 6, 1995
తండ్రిసుబ్బారెడ్డి
తల్లికాశమ్మ
దస్త్రం:Sri Avadhuth Kasinayana Mandir, Jyothi, YSR district (YS) (6).JPG
కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని శ్రీ అవధూత కాశీనాయన మందిరం (కాశీనాయన సమాధి)

శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను గురు అతిరాచ గురువయ్య స్వామిచే ప్రభావితుడయ్యాడు[1]. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమరి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆయన డిసెంబరు 6, 1995 లో మరణించాడు.

కాశినాయన మండలం

1995 డిసెంబరు 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబరు 6న ) మరణించిన ఈయన జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

కాశినాయన ఆరాధనోత్సవాలు

ఆయన పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షెత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.

కాశినాయన ఆశ్రమాలు

కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

  • జ్యోతి క్షేత్రం :
  • కాశినాయన ఆశ్రమం, ఆత్మకూరు: ఈ ఆశ్రమం లో శివుని తో పాటు గాయత్రీ మాత , అయ్యప్ప స్వామి , సరస్వతి మాత నెలవై ఉన్నారు ఇచ్చట నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.


కాశినాయనపై పుస్తకాలు

అతని జీవితంపై ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి.

1. సమర్థ సద్గురు కాశినాయన అనురాగ జీవితం, సంకలనం :శ్రీ కాశి నాయన పాదరేణువులు

2. అవధూత కాశిరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర , రచయత : ప్రోలు సుబ్బారెడ్డి

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు