"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కిమిడి కళా వెంకటరావు
కిమిడి కళావెంకటరావు | |||
కిమిడి కళా వెంకటరావు కిమిడి కళావెంకటరావు | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 జూన్ 2014 - ప్రస్తుతం | |||
ముందు | మీసాల నీలకంఠం | ||
---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలము 1983 – 1994 | |||
ముందు | బాబూ పరాంకుశం ముదిలి | ||
తరువాత | పాలవలస రాజశేఖరం | ||
పదవీ కాలము 2004 – 2009 | |||
ముందు | కిమిడి గణపతిరావు | ||
తరువాత | నియోజకవర్గ విలీనం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రేగిడి శ్రీకాకుళం జిల్లా | 1 జులై 1952||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం | ||
తల్లిదండ్రులు | సూరపునాయుడు (తండ్రి) అన్నపూర్ణమ్మ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | చంద్రమౌళి | ||
సంతానము | కుమార్తె, కుమారుడు | ||
నివాసము | రేగిడి, శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | మహారాజా కళాశాల, విజయనగరం | ||
వృత్తి | వ్యవసాయం | ||
మతం | హిందూ |
కిమిడి కళావెంకటరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షునిగా నియమింపబడ్డాడు.[2]
జీవిత విశేషాలు
కిమిడి కళావెంకటరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి గ్రామ వాస్తవ్యుడు. అతను 1952 జూలై 1న జన్మించాడు. బి.ఎ., బి.ఎల్ డిగ్రీలను చదివాడు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకి చేరాడు. 1983, 1985, 1989, 2004 ఎన్నికలలో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు శాసన సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. తెలుగుదేశం ప్రభుత్వాలలో వాణిజ్యపన్నులు, పురపాలక, హోం శాఖలలో మంత్రిగా పనిచేసాడు. తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించాడు. 2009 శాసనసభ ఎన్నికలలో చిరంజీవి నేతృత్వంవహించిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరాడు[3]. 2009లో ఉణుకూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలలో విలీనం అయ్యేసరికి అతను ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీసాల నీలకంఠం చేతిలో ఓడిపోయాడు. తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి రావాలని ఉన్నా కొన్ని కారణాల మూలంగా రాలేకపోయాడు. 2012 నుండి ప్రజారాజ్యం పార్టీని వదిలిపెట్టి 2 సంవత్సరముల పాటు ఏ రాజకీయపార్టీలో క్రయాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు[4].
నిర్వహించిన పదవులు
- పురపాలక శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
- వాణిజ్యపన్నుల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
- హోం శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
- శక్తి వనరుల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.[5]
- రాజ్యసభ సభ్యుడు
మూలాలు
బయటి లంకెలు
- Kimidi Kalavenkatarao,కిమిడి కళావెంకటరావు
- Kimidi Kala Venkatarao Takes Oath as AP Cabinet Minister
- TV9 Telugu (2015-10-25), Face to face with AP TDP Chief Kala Venkat Rao - Mukha Mukhi - TV9, retrieved 2018-06-09