"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కివీ పండు
కివీ పండు అనేది 'యాక్టినిడియా చైనిన్సెస్' అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు.
లక్షణాలు
చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు 'విటమిన్ సి', ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం 'కివీ' పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.
కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి . ఇది అనేక ప్రాంతాలలో పండిస్తారు, అండాకారములో ఉంటుంది . సుమారు 5.8 పొడవు 2.0 సెం.మీ. వెడల్పు, 5.5 సెం.మీ. ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది . మంచి సువాసన కలిగి ఉంటుంది . దీనిని వ్యాపార పండుగా అనేక దేశాలలో పండిస్తున్నారు . చైనాలో దీనిని 'గూస్ బెర్రీ ' పండుగా వాడుకలో ఉన్నది .
కివి పండుకు పేర్లు చాలా ఉన్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీకి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులోఅధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది. కివి పండులో పోషకాలు చూడండి.
సాగు
కివి మొక్కలు సమశీతోష్ణ మండలాల్లో, అనగా వాతావరణంలో ఎండాకాలానికి చలికాలానికి మధ్య మోస్తరు తేడా మాత్రమే ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే వీటిని ఇటలీ, న్యూజిలాండ్, చిలీ, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, ఇరాన్, అమెరికా, కంబోడియా వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవల భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు.
సాగు
కివీ సాగు ద్రాక్ష సాగు వలె వుంటుంది. కివీ మొక్కల్లో శ్రీ, పురుష మొక్కలు వేరువేరుగా వుంటాయి. తుమ్మెదలు పురుష పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి స్త్రీ పువ్వుల మీదకు చేరవేయడం ద్వారా స్త్రీ మొక్కల నుండి కాయలు తయారవుతాయి. ఇలా ఒక పురుష మొక్క 3 నుండి 8 స్త్రీ మొక్కలు కాయలు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. ఒక హెక్టారుకు టన్నుల కొద్దీ కాయల దిగుబడి వస్తుంది. విత్తనాలు నాటిన 2 నుండి 3 సంవత్సరాలకే పంట దిగుబడి వస్తుంది. కివీ మొక్కలను గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు.
కంటికి వెలుగు ‘కివీ’...
కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెం ట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియి న్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోప ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
పోషక విలువలు
- కివీ పళ్ళలో అధికమైన పోషక విలువలున్నాయి.
- కార్బోహైడ్రేట్లు 14.66 గ్రా,
- షుగర్సు 8.99 గ్రా,
- ఫైబర్ 3.0 గ్రా,
- ఫేట్ 0.52 గ్రా,
- ప్రొటీన్ 1.14 గ్రా,
- లుటీన్, క్సాన్థిన్ 122 మైక్రో గ్రా,
- ధయామిన్ 0.027 మిగ్రా,
- రైబోఫ్లోవిన్ 0.025 మిగ్రా,
- నియాసిన్ 0.341 గ్రా, విటమిన్
- బి6 0.63 మిగ్రా,
- ఫోలేట్ 25 మైక్రో గ్రా,
- విటమిన్ సి 92.7 మిగ్రా,
- విటమిన్ ఇ 1.5 మిగ్రా,
- విటమిన్ కే 40.3 మైక్రో గ్రా,
- కేల్షియమ్ 34 మిగ్రా,
- ఐరన్ 0.31 మిగ్రా,
- మెగ్నిషియమ్ 17 మిగ్రా,
- ఫాస్పరస్ 34 మిగ్రా,
- పొటాషియం 312 మిగ్రా,
- సోడియం 3 మిగ్రా,
- జింక్ 0.14 మిగ్రా ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు :
- కివి పండులో దండిగా విటమిన్లు, ప్లావనాయిడ్స్, ఖనిజలవనాలు ఉన్నాయి. రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత, వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధము ఈ పండులో ఉన్నట్లు గుర్తించారు . ఇందులో ఉండే గ్లుటథియోన్ క్యాన్సర్ కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటారు ఆహారనిపుణులు . శరీరములో ఏర్పడే నైట్రేట్ ఫ్రీరాడికిల్ ప్రభావాన్ని నిరోదిస్తుంది .
- మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని తేలింది .
- కివిపండులోగల అమినోయాసిడ్ ' ఆర్జినిన్" శుద్ద రక్తనాళాల్లో గట్టి పదార్థం ఏర్పడకుండా నితోధిస్తుంది .
- కివిపండు మంచి ఫైబర్ గల ఆహారముగా నిపుణులు జరిపిన అధ్యయనములో తేలింది .
- జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాన్సర్ నిరోధక పదార్ధములు ఉన్నాయి .
- విరోచన కారిగా ఉపయోగ పడును .
- అత్యధికము గా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటీ ఆక్షిడెంట్ గా ఉపయోగపడును .
- కివి పండులోని ఫైటోకెమికల్ " లుటెయిన్ " ప్రోస్టేట్ గ్రంధి , కాలేయ క్యాన్సర్ లను నిరోధించును .
- కివి పండు లో ఉండే " ఇనోసిటాల్ " అనే పదార్ధము మనోవ్యాకులత చికిత్సకు ఉపయోగపడుతుంది .
- కివిపండు లోని ఫైటోకెమికల్స్ , గ్జాంతోఫిల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదము చేసే " మాక్యులార్ డిజనరేషన్" ను నివారించును .
- కివిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కొలెస్టిరాల్ ను భస్మము చేయకుండా నిరోధించును .
- ఈ పండులోని " ఆర్జినిన్, గ్లుటామిన్ " అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండడమువలన గుండెకు రక్తము బాగా సరఫరా కావడానికి సహకరిస్తాయి.
- కివిపండు తొక్కలో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీఆక్షిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడును .
- కివి విత్తనాలనుండి తీసిన ఆయిల్ లో 62% ఆల్ఫాలినోలిక్, ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానిని మంచిది .
- దీనిలో ఉండే ప్రోటీన్ వలన కొంతమందికి ' ఎలర్జీ' వచ్చే అవకాశము ఉన్నది .