"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కుంజరని దేవి

From tewiki
Jump to navigation Jump to search
కుంజరని దేవి
జననం1 మార్చి, 1968
మణిపూర్, భారతదేశం
వృత్తివెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి
సురరిచితుడురాజీవ్ గాంధీ ఖేల్‌రత్న

నమేఐరక్పం కుంజరిని దేవి (జననం: మార్చి 1, 1968) వెయిట్ లిఫ్టింగ్ యందు పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి.

నేపథ్యం

కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్ లోని ఇంపాల్ నందు గల కైరంగ్ మయై లేఇకై నందు జన్మించారు.1978 ఇంపాల్ లోని సిండం సిన్శాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాల యందు ఉండగానే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్ లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పిమ్మట తన సమయమునంతా వెయిట్ లిఫ్టింగ్ నందు కేటాయించినది. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండెంట్ గా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుండి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది.

క్రీడా చరిత్ర

1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల యందు 44 కిలోల, 46 కిలోల చివరగా 48 కిలోల విభాగములో ఎక్కువగా బంగారు పతకాలు సాధించింది. 1987 లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది, తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మణిపూర్ లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

1989లో మాంచెస్టర్ లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు కైవసం చేసుకోవడం ఆమెలో ఆత్మస్థైర్యం నింపింది. అప్పటినించి 1993 మేల్బోర్ను పోటీలు మినహా వరుసగా ఏడుసార్లు జరిగిన ప్రపంచపోటీలలో పాల్గొన్న ప్రతిసారి బహుమతి సాధించింది. కానీ ప్రతిసారి వెండిపతకంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

1990లో బీజింగ్,1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధనలో విఫలమైంది.

అదృష్టవశాత్తు కుంజరిని ఆసియా ఖండపు వెయిట్ లిఫ్టింగ్ పోటీల యందు పలు పతకాలు సాధించింది.1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక వెండి మరియు రెండు రజత పతకాలు గెలిచింది. అది మొదలుకొని 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. తదుపరి 1992లో థాయిలాండ్ మరియు 1993లో చైనా పోటీలలో తన రెండవ స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. 1995లో దక్షిణకొరియా పోటీలలో 46 కిలోల విభాగములో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు మరియు ఒక రజతపతకం సాధించింది. కానీ 1996లో జపాన్ లో జరిగిన పోటీలలో రెండు వెండి, ఒక రజత పతకంతో సరిపెట్టవలసి వచ్చింది.

వివాదం

కుంజరిని దేవి 2001లో నిషేదించిన ష్టిరాయిడ్స్ వాడినట్లుగా రుజువైనందున 6 నెలలపాటు తాత్కాలిక నిషేధమునకు గురయినది.

గుర్తింపు

  • 1990లో ఆమెను అర్జున అవార్డు మరియు లియాండర్ పేస్ తో కలిపి 1996-1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డులు వరించాయి. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది.
  • ఆమె ఖాతాలో యాబై కి పైగా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. 2006 మెల్బోర్న్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు , 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పింది.

ప్రస్తుత పరిస్థితి

కుంజరిని ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్ గా పనిచేయుచున్నది.

బాహ్య లింకులు

అంతకు ముందువారు
కరణం మల్లేశ్వరి
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న
1996/1997
Joint with లియాండర్ పేస్
తరువాత వారు
సచిన్ టెండుల్కర్

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).