కురుక్షేత్రం (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
కురుక్షేత్రం
(1977 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ మాధవీ పద్మాలయ కంబైన్స్
భాష తెలుగు

1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం.

వివాదం

ఈ చిత్రానికి పోటిగా దాన వీర శూర కర్ణ చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.

చిత్ర సన్నివేశాలు

మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

విశేషాలు

సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు. దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.

పాత్రలు - పాత్రధారులు