"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కూచిమంచి జగ్గకవి

From tewiki
Jump to navigation Jump to search

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామానికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.

ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. చింతలపాటి నీలాద్రిరాజు మీద మొదట చంద్రరేఖా విలాసం అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో చంద్రరేఖా విలాపం అనే కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ కవి వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. [1]. రామా! భక్తమందారమా! అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;

 మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
   విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
   ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
   మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !

ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్ అని ఇతడిని వర్ణించాడు.

రచనలు

  • చంద్రలేఖా విలాసం
  • చంద్రలేఖా విలాపం
  • రామా భక్తమందారమా శతకము
  • నర్మదా పరిణయము
  • రాధాకృష్ణ చరిత్ర
  • సుభద్రా పరిణయము
  • సోమదేవరాజీయము
  • పార్వతీ పరిణయము

మూలాలు

బయటి లింకులు


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

  1. తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145